News


బ్యాంక్‌ నిఫ్టీ 1శాతం ర్యాలీ

Thursday 15th November 2018
Markets_main1542269349.png-22048

ఎన్‌ఎస్‌ఈలో బ్యాంకింగ్‌ రంగ షేర్లకు ప్రాతినిథ్యం వహించే బ్యాంక్‌ నిఫ్టీ గురువారం మిడ్‌ సెషన్‌ సమయానికి 1శాతం లాభపడింది.  ఈ సూచీలోని యాక్సిస్‌ బ్యాంక్‌ (3 శాతం), ఐసీఐసీఐ బ్యాంక్‌(2 శాతం) షేర్లు ర్యాలీ సూచీని లాభాల బాట పట్టించింది. మధ్యాహ్నం గం.1:10ని.లకు సూచి గతముగింపు(25,930.15)తో పోలిస్తే దాదాపు శాతం (0.90శాతం) లాభపడి 26,170.60 వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఇదే సమయానికి సూచీలో భాగమైన  మొత్తం 11 షేర్లలో 9 షేర్లు లాభాల్లో ట్రేడ్‌ అవుతుండగా, 3షేర్లు మాత్రం నష్టాల్లో ట్రేడ్‌ అవుతున్నాయి. కోటక్‌ బ్యాంక్‌, ఐడీఎఫ్‌సీ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ షేర్లు 1శాతం పెరిగాయి. ఇండస్‌ఇండ్‌, పంజాజ్‌ నేషనల్‌ బ్యాంక్‌, స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, ఆర్‌బీఎల్‌ బ్యాంక్‌ షేర్లు అరశాతం ర్యాలీ చేశాయి. మరోవైపు ఇదే సూచీలో యస్‌ బ్యాంక్‌ షేర్లు అత్యధికంగా 8శాతం నష్టపోయింది. ఆ బ్యాంక్‌ నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ పార్ట్‌టైమ్‌ ఛైర్మన్‌ అశోక్‌ చావ్లా తన పదవికి రాజీనామా చేయటం షేరు పతనానికి కాణమైంది. అలాగే ఫెడరల్‌ బ్యాంక్‌, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా షేర్లు 1శాతం క్షీణించాయి.



You may be interested

సెన్సెక్స్‌ @ 35,400

Thursday 15th November 2018

250 పాయింట్లు అప్ 10,640 వద్ద నిఫ్టీ ఇండియన్‌ స్టాక్‌ మార్కెట్లు లాభనష్టాల మధ్య ఊగిసలాడుతోంది. ఫ్లాట్‌గా ప్రారంభమైన ఇండెక్స్‌లు తర్వాత పెరిగాయి. అటుపైన పడిపోయాయి. మళ్లీ ఇప్పుడు లాభాల్లో ట్రేడవుతున్నాయి. మధ్యాహ్నం 1:40 సమయంలో బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 253 పాయింట్ల లాభంతో 35,395 వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 65 పాయింట్ల లాభంతో 10,640 వద్ద ఉన్నాయి. ఇంట్రాడేలో బీఎస్‌ఈ 35,400 పాయింట్ల గరిష్ట స్థాయిని, 35,118 పాయింట్ల కనిష్ట స్థాయికి తాకింది.

గ్రాసీమ్‌ 9శాతం క్రాష్‌

Thursday 15th November 2018

నష్టాల క్యూ2 గణాంకాల నమోదు కారణంగా ఆదిత్యా బిర్లా గ్రూప్‌నకు గ్రాసీమ్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ షేర్లు గురువారం 9శాతం క్రాష్‌ అయ్యాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరపు రెండో తైమాసిక కాలంలో కంపెనీ నష్టాలను నమోదు చేయడం షేరు పతనానికి కారణమైంది. ఈ క్యూ2లో కన్సాలిడేషన్‌ ప్రాతిపదికన కంపెనీ రూ.1,300 కోట్ల నికర నష్టాన్ని నమోదు చేసింది. గతేడాది ఇదే క్యూ2లో కంపెనీ ఆర్జించిన రూ.799 కోట్ల నికరలాభాన్ని ఆర్జించడం గమనార్హం. కంపెనీ

Most from this category