News


బ్యాంక్‌ నిఫ్టీ జోరు

Friday 9th August 2019
Markets_main1565325782.png-27652

ప్రభుత్వం, విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లను (ఎఫ్‌పీఐ) అధిక సర్‌చార్జి నుంచి మినహాయించడం, మూడేళ్లు దాటిన హొల్డింగ్స్‌పై దీర్ఘకాల మూలధన లాభాలపై(ఎల్‌టీసీజీ) విధించే ట్యాక్స్‌ ను తొలగించడం, డివిడెండ్‌ డిస్ట్రీబ్యూషన్‌ ట్యాక్స్‌ను(డీడీటీ) సులభతరం చేయడం వంటి మార్కెట్‌ ప్రెండ్లీ నిర్ణయాలను తీసుకునే అవకాశం ఉండడంతో శుక్రవారం మార్కెట్లు పాజిటివ్‌గా కదులుతున్నాయి. నిఫ్టీ బ్యాంక్‌ ఇం‍డెక్స్‌ ఉదయం 9.57 సమయానికి 212.05 పాయింట్లు లాభపడి 28343.60 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ బ్యాంక్‌ ఇండెక్స్‌లో ప్రభుత్వ రంగ బ్యాంకులయిన బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా 0.45 శాతం, పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌(పీఎన్‌బీ) 0.15 శాతం లాభపడి ట్రేడవుతుండగా, స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్‌బీఐ) 0.02 శాతం నష్టపోయి ట్రేడవుతోంది. కాగా ప్రవేట్‌ రంగ బ్యాంకులయిన ఫెడరల్‌ బ్యాంక్‌ 2.46 శాతం, ఆర్‌బీఎల్‌ బ్యాంక్‌ 3.56 శాతం, హెచ్‌డీఎఫ్‌సీ 1.67 శాతం, ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ బ్యాంక్‌ లి. 1.53 శాతం, ఐసీఐసీఐ బ్యాంక్‌ 0.59 శాతం, యాక్సిస్‌ బ్యాంక్‌ 0.52 శాతం,  కోటక్‌ బ్యాంక్‌ 0.21 శాతం, ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌ 0.06 శాతం లాభపడి ట్రేడవుతుండగా,  యస్‌ బ్యాంక్‌ మాత్రం 2.13 శాతం నష్టపోయి ట్రేడవుతోంది.



You may be interested

పసిడి 10 డాలర్ల ర్యాలీ

Friday 9th August 2019

ప్రపంచమార్కెట్లో పసిడి ధర పరుగులు ఆగడం లేదు. ఆసియాలో శుక్రవారం మరో 10డాలర్లు ర్యాలీ చేసింది. నేటి ఉదయం సెషన్‌లో ఔన్స్‌ పసిడి ధర 10డాలర్లు(0.65శాతం) పెరిగి (0.65శాతం) 1,519.90డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. ప్రస్తుత పరిణామాలు ఈక్విటీ మార్కెట్లకు ప్రతికూలంగా ఉండటంతో పసిడి ధరలకు కలిసొస్తుంది. వాణిజ్య ఉద్రిక్తతలు పెరుగున్న నేపథ్యంలో ఆయా ఆయాదేశాలు వడ్డీరేట్ల తగ్గింపునకు మొగ్గుచూపడం పసిడి డిమాండ్‌ను పెంచుతుందని మార్కెట్‌ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఆర్థిక

ఒపెక్‌ చర్యలు..పెరిగిన చమురు

Friday 9th August 2019

యుఎస్‌-చైనా వాణిజ్య ఘర్షణ వలన అంతర్జాతీయ వృద్ధి మందగించి, చమురు డిమాండ్‌ పడిపోతుందనే ఆందోళన నేపథ్యంలో చమురు ధరలు నష్టపోతుండగా, చమురు ఉత్పత్తి, ఎగుమతి దేశాలు(ఒపెక్‌​దేశాలు) ఈ నష్టాలను తగ్గించిందేకు మరిన్ని చర్యలను తీసుకుంటారనే అంచనాల నేపథ్యంలో చమురు ధరలు శుక్రవారం పెరిగాయి. గత సెషన్‌తో పోల్చుకుంటే బ్రెంట్‌ క్రూడ్‌ 0.4 శాతం పెరిగి బ్యారెల్‌కు 57.61 డాలర్ల వద్ద, డబ్యూటీఐ క్రూడ్‌ 0.5 శాతం పెరిగి బ్యారెల్‌కు 52.79

Most from this category