News


బ్యాంకు నిఫ్టీ 3 శాతం అప్‌

Thursday 23rd May 2019
Markets_main1558586829.png-25894

సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ లెక్కింపులో గా కేంద్రంలో ఎన్‌డీఏ కూటమి స్పష్టమైన ఆధిక్యాన్ని ప్రదర్శిస్తున్న తరుణంలో మార్కెట్లలో కొనుగోళ్ల పర్వం కొనసాగుతుంది. బ్యాంకింగ్‌ షేర్లు అత్యధికంగా లాభపడుతున్నాయి. ఎన్‌ఎస్‌ఈలోని బ్యాంకు నిఫ్టీ ఇండెక్స్‌ 3శాతానికి పైగా పెరిగింది. ఇండెక్స్‌లో అత్యధికంగా బ్యాంకు ఆఫ్‌ బరోడా 10.50శాతం పెరిగింది. ఇండస్‌ ఇండ్‌ 7శాతం, ఎస్‌బీఐ 5శాతం, ఫెడరల్‌ బ్యాంకు 4.50శాతం, పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు, యస్‌ బ్యాంకు 4శాతం పెరిగాయి. కోటక్‌ బ్యాంకు 3శాతం, యాక్సిస్‌ బ్యాంక్‌ ఆర్‌బీఎల్‌ బ్యాంకు షేర్లు 2శాతం లాభపడ్డాయి. వాటితో పాటు ఐడీఎఫ్‌సీ బ్యాంకు 1.50శాతం, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు 1శాతం 1శాతం ర్యాలీ చేశాయి. ఉదయం గం.10:00లకు ఇండెక్స్‌ గత ముగింపు(30,526.80)తో పోలిస్తే 2.85శాతం పెరిగి 31,394.90 వద్ద ట్రేడ్‌ అవుతోంది. 

ఇక ప్రధాన ఇండెక్స్‌లైన సెన్సెక్స్‌  720.63 పాయింట్ల లాభంతో 39830.84 వద్ద, నిఫ్టీ 215.10 పాయింట్లు పెరిగి 11,953.00  వద్ద ట్రేడ్‌ అవుతోంది.



You may be interested

సెన్సెక్స్‌@40000.. నిఫ్టీ@12000..

Thursday 23rd May 2019

దేశీయ మార్కెట్లు చరిత్ర సృష్టించాయి. ఫస్ట్‌టైమ్‌ సెన్సెక్స్‌ 40వేల పాయింట్లను, నిఫ్టీ 12వేల పాయింట్లను తాకాయి. సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో భాజపా నేతృత్వంలోని ఎన్డీయే ఆధిక్యంలో దూసుకెళ్తుండటంతో దేశీయ మార్కెట్లు గురువారం జోరు చూపిస్తున్నాయి. మరోసారి ఎన్డీయే సర్కార్‌ ఖాయమన్న సంకేతాలతో నేటి ట్రేడింగ్‌ను సూచీలు రికార్డు స్థాయిలో లాభాలతో ప్రారంభించాయి. నిఫ్టీ 11901 పాయింట్ల వద్ద పయనం ఆరంభించింది. ఉదయం 10.38 సమయానికి నిఫ్టీ 12006 పాయింట్ల వద్ద,

ఎగ్జిట్‌ పోల్స్‌ నిజమైతే 12వేలకు నిఫ్టీ

Thursday 23rd May 2019

దేశీయ మార్కెట్లలో ర్యాలీ కొనసాగుతోంది. ఎగ్జిట్‌ పోల్స్‌కు అనుగుణంగానే ఇప్పటివరకు వస్తున్న ఫలితాలు ఉన్నాయి. పోల్‌ నిపుణులు ఊహించినట్లు ఎన్‌డీఏ బంపర్‌ మెజార్టీ సాధిస్తే నిఫ్టీ ఈ రోజే 12వేల పాయింట్లను తాకవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. వీరి అంచనాకు తగ్గట్లే నిఫ్టీ దాదాపు 11960 పాయింట్ల వరకు వచ్చింది. నిఫ్టీ గత నిరోధం 11856ను దాటడం పాజిటివ్‌ పరిణామమని, అందువల్ల 12వేల పాయింట్లకు చేరే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని

Most from this category