బ్యాంక్ నిఫ్టీ 390 పాయింట్లు డౌన్
By Sakshi

కార్పోరేట్ ట్యాక్స్ తగ్గింపుతో భారీ ర్యాలీ చేసిన నిఫ్టీ బ్యాంక్ ఇండెక్స్ బుధవారం ట్రేడింగ్‌లో నష్టాలతో ప్రారంభమైంది. ఉదయం 10.04 సమయానికి నిఫ్టీ బ్యాంక్ ఇండెక్స్ 398.35 పాయింట్లు కోల్పోయి 29771.70 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. ఈ ఇండెక్స్‌లో హెవివెయిట్ షేర్లయిన హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 1.36 శాతం నష్టపోయి రూ. 1236.80 వద్ద, ఐసీఐసీఐ బ్యాంక్ 1.16 శాతం నష్టపోయి రూ. 435.80 వద్ద ట్రేడవుతుండగా, ఇండస్ఇండ్ బ్యాంక్ షేర్ 0.07 శాతం లాభపడి రూ. 1517.30 వద్ద ట్రేడవుతోంది. మిగిలిన షేర్లలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) 3.07 శాతం, బ్యాంక్ ఆఫ్ బరోడా 1.86 శాతం, కోటక్ బ్యాంక్ 1.67 శాతం, ఆర్బీఎల్ బ్యాంక్ 1.50 శాతం, పంజాబ్ నేషనల్ బ్యాంక్(పీఎన్బీ) 1.28 శాతం, ఫెడరల్ బ్యాంక్ 0.90 శాతం, యాక్సిస్ బ్యాంక్ 0.67 శాతం నష్టపోయి ట్రేడవుతున్నాయి. కాగా ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ 0.82 శాతం, యెస్ బ్యాంక్ 0.27 శాతం లాభపడి ట్రేడవుతున్నాయి.
You may be interested
71.07 వద్ద ప్రారంభమైన రూపీ
Wednesday 25th September 2019దేశీయ కరెన్సీ రూపీ, డాలర్ మారకంలో 6 పైసలు బలహీనపడి 71.07 వద్ద ప్రారంభమైంది. కాగా విదేశీ నిధుల ఔట్ ఫ్లో కొనసాగడంతోపాటు దేశీయ ఈక్విటీ మార్కెట్లు నష్టపోవడంతో గత సెషన్లో రూపీ డాలర్ మారకంలో 7 పైసలు బలహీనపడి 71.01 వద్ద ముగిసింది. చమురు ధరలు తగ్గడం, ప్రధాన కరెన్సీలతో పోల్చుకుంటే డాలర్ బలహీనపడడంతో రూపీ పతనం పరిమితమయ్యిందని పీటీటీ పేర్కొంది. గత సెషన్లో ఎన్ఎస్ఈలో డాలర్-రూపీ సెప్టెంబర్
సీనియర్ సిటిజన్ స్కీమ్‌కు పన్ను మినహాయింపు..
Wednesday 25th September 2019-ఇవ్వాలని ప్రభుత్వానికి ఎస్బీఐ ఎకోరాప్ సూచన -ద్రవ్యలోటుపై ప్రభావం పరిమితమేనని అభిప్రాయం న్యూఢిల్లీ: పెద్దల పొదుపు పథకం (సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్) కింద ఆర్జించే వడ్డీ రాబడిపై ఆదాయపన్ను మినహాయింపు ఇవ్వడాన్ని ప్రభుత్వం పరిశీలించాలని ఎస్బీఐ ఎకోరాప్ నివేదిక సూచించింది. దీనివల్ల ద్రవ్యలోటుపై ప్రభావం పరిమితమేనని పేర్కొంది. సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ (ఎస్సీఎస్ఎస్) కింద ఒకరు రూ.15 లక్షలను గరిష్టంగా డిపాజిట్ చేసుకోవచ్చు. కాకపోతే 60 ఏళ్లు, ఆ పైన