News


బ్యాంక్‌ నిఫ్టీ 1శాతం అప్‌

Thursday 12th December 2019
Markets_main1576138756.png-30192

మార్కెట్‌ మిడ్‌సెషన్‌ సమయానికి బ్యాంకింగ్‌ రంగ షేర్ల జోరు కొనసాగుతుంది. ఫలితంగా ఎన్‌ఎస్‌ఈలో కీలకమైన బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ 1శాతం పెరిగింది. ఎన్‌ఎస్‌ఈలో బ్యాంకింగ్‌ రంగ షేర్లకు ప్రాతనిథ్యం వహించే ఈ ఇండెక్స్‌ నేడు 31,356.80 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. మార్కెట్ ప్రారంభంలో బ్యాంకింగ్‌ రంగ షేర్లకు డిమాండ్‌ అంతంత మాత్రంగా ఉన్నప్పటికీ.., మిడ్‌సెషన్‌ కల్లా కొనుగోళ్ల జోరు పెరిగింది. దీంతో ఇండెక్స్‌ ఒక దశలో 1శాతం ర్యాలీ చేసి 31,548.10 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. మధ్యాహ్నం గం.1:15ని.లకు ఇండెక్స్‌ క్రితం ముగింపు(31,256.75)తో పోలిస్తే 75శాతం లాభపడి 31,485 వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఇదే సమాయనికి ఇండెక్స్‌లో ఒక్క ఐసీఐసీఐ తప్ప మిగిలిన షేర్లన్ని లాభాల్లో ట్రేడ్‌ అవుతున్నాయి. అత్యధికంగా యస్‌ బ్యాంక్‌ 7శాతం పెరిగింది. ఫెడరల్‌ బ్యాంక్, ఆర్‌బీఎల్‌ బ్యాంక్‌, ఇండస్‌ ఇండస్‌ బ్యాంక్‌ షేర్లు 2శాతం ర్యాలీ చేశాయి. పీఎన్‌బీ, ఎస్‌బీఐ షేర్లు 1.50శాతం పెరిగాయి. ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, కోటక్‌, ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ బ్యాంక్‌, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా షేర్లు 1శాతం లాభపడ్డాయి. ఒక్క ఐసీఐసీఐ బ్యాంక్‌ షేరు మాత్రం 0.10శాతం నష్టంతో ట్రేడ్‌ అవుతోంది. 



You may be interested

రికార్డుస్థాయికి కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌

Thursday 12th December 2019

కోటక్‌ మహీంద్రా బ్యాంకు షేరు గురువారం ట్రేడింగ్‌లో కొత్త జీవితకాల గరిష్టాన్ని అందుకుంది. నేడు ఈ బ్యాంకు షేరు రూ.1689.00 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ప్రైవేట్‌ రంగ షేర్లకు లభిస్తున్న కొనుగోళ్ల మద్దతులో భాగంగా షేరు ఒక దశలో 1.75శాతం పెరిగి రూ.1714.75ల వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. ఈ ధరకు షేరుకు జీవితకాల గరిష్టస్థాయి కావడం విశేషం.తద్వారా నేటి బ్యాంకింగ్‌ రంగ షేర్లలో జీవితకాల గరిష్టాన్ని అందుకున్న ఏకైక

ఇన్ఫీపై యూఎస్‌లో దావా దాఖలు!

Thursday 12th December 2019

దేశీయ ఐటి దిగ్గజం ఇన్ఫోసిస్‌పై అమెరికాకు చెందిన షేర్‌హోల్డర్ల పరిరక్షణ న్యాయసలహా సంస్థ ద స్కాల్‌ లాఫరమ్‌ క్లాస్‌ యాక‌్షన్‌ సూట్‌ దాఖలు చేసింది. ఇన్ఫీ తన ఇన్వెస్టర్లను తప్పుదోవ పట్టించి నష్టాలు వచ్చేలా చేసిందని దావాలో ఆరోపించింది. ఇన్ఫోసిస్‌ షేర్లను 2018 జూలై 7 నుంచి 2019 అక్టోబర్‌ 20 మధ్యలో కొనుగోలు చేసిన ఇన్వెస్టర్లు తమను ఈ నెల 23లోపు సంప్రదించి దావాలో భాగస్వామ్యులు కావచ్చని ప్రకటించింది.

Most from this category