News


నష్టాల్లో బ్యాంకింగ్‌ షేర్లు..

Tuesday 13th August 2019
Markets_main1565672238.png-27729

మార్కెట్లు మంగళవారం ట్రేడింగ్‌లో పాజిటివ్‌గా మొదలై ఉదయ 10.15 సమయానికి నష్టాల్లోకి ట్రేడవుతున్నాయి. నిఫ్టీ బ్యాంక్‌ ఇం‍డెక్స్‌ 330.60 పాయింట్లు కోల్పోయి, 28112.60 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ బ్యాంక్‌ ఇండెక్స్‌లో ప్రభుత్వ రంగ బ్యాంకులయిన  పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌(పీఎన్‌బీ) 0.83 శాతం, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా 0.80 శాతం లాభపడి ట్రేడవుతుండగా, స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్‌బీఐ) మాత్రం 0.50 శాతం నష్టపోయి ట్రేడవుతోంది. కాగా ప్రవేట్‌ రంగ బ్యాంకులయిన యాక్సిస్‌ బ్యాంక్‌ 0.61 శాతం, యస్‌ బ్యాంక్‌ మాత్రం 0.13 శాతం లాభపడి ట్రేడవుతుండగా,  ఫెడరల్‌ బ్యాంక్‌ 3.41 శాతం, హెచ్‌డీఎఫ్‌సీ 2.27 శాతం, ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ బ్యాంక్‌ లి.1.80 శాతం, ఐసీఐసీఐ బ్యాంక్‌ 1.15 శాతం, ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌ 0.96 శాతం, కోటక్‌ బ్యాంక్‌ 0.59 శాతం, ఆర్‌బీఎల్‌ బ్యాంక్‌ లి. 0.04 శాతం నష్టపోయి ట్రేడవుతున్నాయి.
 



You may be interested

పసిడి 12డాలర్ల ర్యాలీ

Tuesday 13th August 2019

ఆసియా ట్రేడింగ్‌లో మంగళవారం పసిడి ధర 12డాలర్ల మేరకు ర్యాలీ చేసింది. హాంగ్‌కాంగ్‌ నెలకొన్న రాజకీయ ఉద్రిక్తతలు, అంతర్జాతీయ ఆర్థిక మందగమన భయాలతో అర్జెంటీనా కరెన్సీ క్షీణత పసిడి ఫ్యూచర్లకు డిమాండ్‌ను పెంచాయి. ఫలితంగా ఆసియా ట్రేడింగ్‌లో భారత వర్తమానకాల ప్రకారం ఉదయం గం.10:30ని.లకు ఔన్స్‌ పసిడి ధర 10డాలర్ల లాభంతో 1,527 డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. హాంగ్‌కాంగ్‌లోని ప్రధాన భూభాగం చైనాకు అప్పగించే బిల్లుకు వ్యతిరేకంగా ప్రారంభమైన

71 దిగువకు రూపాయి

Tuesday 13th August 2019

రూపీ డాలర్‌ మారకంలో మంగళవారం 36 పైసలు బలహీనపడి 71.14 వద్ద ప్రారంభమైంది. అధిక పన్ను సర్‌చార్జికి సంబంధించి విదేశీ పెట్టుబడిదారులు, ఆర్థిక మంత్రిత్వ శాఖ అధికారుల మధ్య సమావేశం జరగనుండడంతో, మార్కెట్‌లో పాల్గొనేవారు జాగ్రత్త వహించారు. ఫలితంగా గత సెషన్‌లో(శుక్రవారం) రూపీ డాలర్‌ మారకంలో 9 పైసలు బలహీనపడి 70.78 వద్ద ముగిసింది.  

Most from this category