News


బ్యాంక్‌ షేర్ల పతనం..పాజిటివ్‌గా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌

Tuesday 20th August 2019
Markets_main1566276444.png-27878

రూపీ విలువ డాలర్‌ మారకంలో తగ్గడంతో పాటు ప్రభుత్వం ప్రకటించనున్న ఉద్దీపన ప్యాకేజీ ఆలస్యం కానుండడంతో దేశియ మార్కెట్‌లు మంగళవారం నష్టాలో ట్రేడవుతున్నాయి. నిఫ్టీ బ్యాంక్‌ ఇండెక్స్‌ ఉదయం 9.58 సమయానికి 197.50 పాయింట్లు నష్టపోయి 28042.15 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. ఈ ఇండెక్స్‌లో హెవివెయిట్‌ షేర్లయిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ 0.46 శాతం లాభపడి ట్రేడవుతుండగా, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ 2.42 శాతం, కోటక్‌ బ్యాంక్‌ 0.37 శాతం నష్టపోయి ట్రేడవుతున్నాయి. మిగిలిన షేర్లలో ప్రభుత్వ రంగ బ్యాంక్‌ షేర్లయిన బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా 2.05 శాతం, పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌(పీఎన్‌బీ) 1.71శాతం, స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్‌బీఐ) 0.82 శాతం నష్టపోయి ట్రేడవుతుండగా, ప్రవేట్‌ రంగ బ్యాంక్‌ షేర్లయిన యస్‌ బ్యాంక్‌  5.15 శాతం , ఆర్‌బీఎల్‌ బ్యాంక్‌ లి. 1.80 శాతం, ఐసీఐసీఐ బ్యాంక్‌ 1.11 శాతం, యాక్సిస్‌ బ్యాంక్‌ 1.20 శాతం, ఫెడరల్‌ బ్యాంక్‌ 1.23 శాతం, ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ బ్యాంక్‌ లి. 1.32 శాతం కూడా నష్టపోయి ట్రేడవుతున్నాయి.



You may be interested

డెబిట్‌ కార్డులకు ఇక చెల్లుచీటీ..

Tuesday 20th August 2019

డిజిటల్ లావాదేవీలకు మరింత ప్రోత్సాహం ఎస్‌బీఐ చైర్మన్ రజనీష్ కుమార్‌ ముంబై: డెబిట్ కార్డుల వినియోగాన్ని క్రమంగా తప్పించే దిశగా బ్యాంకులు కసరత్తు చేస్తున్నాయి. ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) క్రమంగా ప్లాస్టిక్ కార్డుల వినియోగాన్ని తగ్గించి డిజిటల్ పేమెంట్ విధానాలను మరింతగా ప్రోత్సహించాలని భావిస్తోంది. తద్వారా డెబిట్ కార్డుల వాడకాన్ని పూర్తిగా నిలిపివేయాలని యోచిస్తోంది. సోమవారం జరిగిన బ్యాంకింగ్, ఆర్థిక రంగ సంస్థల వార్షిక

పసిడి 10డాలర్లు పతనం

Tuesday 20th August 2019

డాలర్‌ ఇండెక్స్‌ 3వారాల గరిష్టాన్ని తాకడంతో పాటు ఈక్విటీ మార్కెట్లలలో కొనుగోళ్లు నెలకొనడంతో మంగళవారం పసిడి ధర 10డాలర్లు పతనమైంది. ఇటీవల పలు దేశాల రిజర్వ్‌ బ్యాంకు ప్రకటించిన ఉద్దీపనలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు మెరుగుపరస్తాయనే అంచనాలతో ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను తిరిగి ఈక్విటీ కొనుగోళ్ల వైపు మళ్లిస్తున్నారు. ఫలితంగా పసిడి ఫ్యూచర్లకు డిమాండ్‌ తగ్గితోంది. నేటి ఆసియా ఉదయం ట్రేడింగ్‌ సెషన్‌లో ఔన్స్‌ పసిడి ధర 6.35 డాలర్లు

Most from this category