News


32,000 పైకి బ్యాంక్‌ నిఫ్టీ

Thursday 28th November 2019
Markets_main1574916396.png-29919

సూచీల రికార్డు ర్యాలీలో భాగంగా బ్యాంక్‌ నిఫ్టీ సైతం కొత్త రికార్డు అందుకుంది. ఎన్‌ఎస్‌ఈలో బ్యాంకింగ్‌ రంగ షేర్లకు ప్రాతినిథ్యం వహించే ఈ ఇండెక్స్‌ నేడు తొలిసారి 32000 స్థాయిని అధిగమించింది. నేడు ఈ ఇండెక్స్‌ 31,981.70 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. మార్కెట్‌ ప్రారంభం నుంచి ప్రభుత్వరంగ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభిస్తుండంతో పాటు, ప్రైవేట్‌ రంగ బ్యాంక్‌లో యస్‌బ్యాంక్‌(3.50శాతం), ఆర్‌బీఎల్‌(3శాతం), ఐసీఐసీఐ బ్యాంక్‌(ఆల్‌టైం) ర్యాలీతో ఇండెక్స్‌ ఇంట్రాడేలో 150 పాయింట్ల పెరిగి 32,000 పైన, 32,026.55 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. ఇండెక్స్‌కు ఈ స్థాయి జీవితకాల గరిష్టస్థాయి కావడం విశేషం. ఉదయం గం.10:00లకు ఇండెక్స్‌ క్రితం ముగింపు(31,875.95)తో పోలిస్తే 0.46శాత పెరిగి 32,024 వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఇదే సమయానికి ఇండెక్స్‌లో పీఎన్‌బీ 4.50శాతం, బ్యాంక్‌ బరోడా, ఆర్‌బీఐఎల్‌, యస్‌ బ్యాంక్‌ షేర్లు 3.50శాతం, ఐసీఐసీఐ బ్యాంక్‌, ఎస్‌బీఐ షేర్లు 2శాతం పెరిగాయి. ఫెడరల్‌ బ్యాంక్‌, ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌ షేర్లు అరశాతం లాభపడ్డాయి. మరోవైపు యాక్సిస్‌ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఐడీఎఫ్‌సీ బ్యాంక్‌, కోటక్‌ బ్యాంక్‌ షేర్లు అరశాతం నష్టపోయాయి. 



You may be interested

రూ. 10 లక్షల కోట్ల కంపెనీగా రిలయన్స్‌!

Thursday 28th November 2019

దేశంలో రూ. 10 లక్షల కోట్ల మార్కెట్‌ క్యాపిటల్‌ కలిగివున్న కంపెనీగా, ముఖేష్‌ అంబానీ రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ గురువారం సెషన్‌లో అవతరించింది. గత కొన్ని సెషన్‌లలో రూ. 10 లక్షల కోట్ల మార్కెట్‌ క్యాప్‌ మార్కుకు దగ్గరగా వచ్చి వెనుతిరిగిన ఈ కంపెనీ, తన టెలికాం విభాగం రిలయన్స్‌ జియోపై ఇన్వెస్టర్లు సానుకూలంగా ఉండడంతో గురువారం ఈ మైలు రాయిని అందుకుంది. టెలికాం కంపెనీల టారిఫ్‌ల పెంపుపై ప్రభుత్వం జోక్యం

ఇండెక్స్‌ షార్ట్‌ పొజిషన్లు తగ్గించుకున్న ఎఫ్‌ఐఐలు

Thursday 28th November 2019

సూచీల్లో మరింత ర్యాలీకి అవకాశం విదేశీ ఫండ్స్‌ అక్టోబర్‌ నుంచి దేశీయ సూచీల్లో కొనుగోళ్ల జోరు పెంచాయి. దీంతో సూచీలు రికార్డు హైలకు చేరాయి. గతంలో తీసుకున్న బేరిష్‌ బెట్స్‌ను ఫండ్స్‌ వదిలించుకున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. అందువల్ల తాజా బుల్‌ రన్‌ మరికొంత కాలం కొనసాగుతుందని డెరివేటివ్స్‌ నిపుణులు అంచనా వేస్తున్నారు. బుధవారానికి నవంబర్‌నెల్లో ఎఫ్‌ఐఐలు రూ.22710 కోట్ల కొనుగోళ్లు జరిపాయి. ఇదే సమయంలో నికర ఇండెక్స్‌షార్ట్స్‌ను 43327 కాంట్రాక్టుల నుంచి

Most from this category