బ్యాంక్ నిఫ్టీ జోరు
By Sakshi

దేశీయ ఈక్విటీ మార్కెట్లు మంగళవారం సెషన్లో ప్రతికూలంగా ట్రేడవుతున్నప్పటికి బ్యాంకింగ్ షేర్లు మాత్రం సానుకూలంగా కదులుతున్నాయి. ఉదయం 10.57 సమయానికి నిఫ్టీ బ్యాంక్ ఇండెక్స్ 218.10 పాయింట్లు లాభపడి 29,338.35 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. ఈ ఇండెక్స్‌లో హెవీ వెయిట్ షేర్లయిన హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 0.47 శాతం లాభపడి రూ. 1,234.75 వద్ద, ఐసీఐసీఐ బ్యాంక్ 1.70 శాతం లాభపడి రూ. 445.25 వద్ద, యాక్సిస్ బ్యాంక్ 1.03 శాతం లాభపడి రూ. 716.85 వద్ద ట్రేడవుతున్నాయి. మిగిలిన షేర్లలో యెస్ బ్యాంక్ 7.20 శాతం, పంజాబ్ నేషనల్ బ్యాంక్(పీఎన్బీ) 1.24 శాతం, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) 0.95 శాతం, బ్యాంక్ ఆఫ్ బరోడా 0.78 శాతం, ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ 0.76 శాతం, ఫెడరల్ బ్యాంక్ 0.36 శాతం, కోటక్ బ్యాంక్ 0.03 శాతం లాభపడి ట్రేడవుతుండగా, ఆర్బీఎల్ బ్యాంక్ 1.69 శాతం, ఇండస్ఇండ్ బ్యాంక్ 0.11 శాతం నష్టపోయి ట్రేడవుతున్నాయి.
ఇదే సమయానికి నిఫ్టీ 50 0.064 శాతం నష్టపోయి 11,652.90 పాయింట్ల వద్ద, సెన్సెక్స్ 0.26 శాతం నష్టపోయి 39,199.01 పాయింట్ల వద్ద ట్రేడవుతున్నాయి.
You may be interested
స్థిరంగా పసిడి
Tuesday 22nd October 2019అమెరికా చైనాల మధ్య వాణిజ్య చర్చల సఫలంపై ఆశావహ అంచనాలతో పసిడి ధర మంగళవారం స్థిరంగా ట్రేడ్ అవుతోంది. ఆసియా మార్కెట్లో ఔన్స్ పసిడి ధర అరశాతం లాభంతో 1,489 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది. అయితే చర్చలపై సరైన వివరణ లేకపోవడంతో పసిడికి మద్దతు లభిస్తోంది. యూ.ఎస్. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వాణిజ్య ఒప్పందంపై ఆశావహనంగా మాట్లాడిన అనంతరం చైనా ఉప విదేశాంగ మంత్రి లే యుచెంగ్ స్పందించారు.
10శాతం పెరిగిన యస్‌బ్యాంక్
Tuesday 22nd October 2019ప్రైవేట్రంగానికి చెందిన యస్‌బ్యాంక్ షేర్లు మంగళవారం ట్రేడింగ్ ప్రారంభంలోనే 7శాతం లాభపడ్డాయి. నేడు ఎన్ఎస్ఈలో ఈ బ్యాంకు షేర్లు రూ.53.00 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. రియల్ ఎస్టేట్ డెవలపర్ సుమెర్ గ్రూప్‌నకు 6.4 ఎకరాల భూమిలో 50శాతం వాటాను బ్యాంకు టేకోవర్ చేయనునంది. దాని జాయింట్ వెంచర్ కంపెనీ రేడియస్ డెవలపర్స్ రూ .478 కోట్లకు పైగా బకాయిలు చెల్లించనందుకు యస్‌బ్యాంక్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. ఈ వార్తల నేపథ్యంలో