News


బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ 5.75శాతం క్రాష్‌..!

Friday 6th March 2020
Markets_main1583469834.png-32319

బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ శుక్రవారం ట్రేడింగ్‌ ప్రారంభమైన గంటలోపే ఏకంగా 5.75శాతం నష్టాన్ని చవిచూసింది. యస్‌ బ్యాంక్‌ సంక్షోభానికి తోడు కరోనా వైరస్‌ వ్యాధి భయాల ఈక్విటీ మార్కెట్లోలో నెలకొన్న అమ్మకాలు ఇండెక్స్‌ భారీ పతనానికి కారణమయ్యాయి. ఎన్‌ఎస్‌ఈలో బ్యాంకింగ్‌ రంగ షేర్లకు ప్రాతినిథ్యం వహించే బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ నేడు క్రితం ముగింపు(28,815.35)తో పోలిస్తే 4శాతం (1165 పాయింట్లు) నష్టంతో 27,649.95 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. మార్కెట్‌ ఆరంభంలో బ్యాంకింగ్‌ రంగ షేర్లలో అనూహ్యంగా అమ్మకాలు వెల్లువత్తడంతో ఇండెక్స్‌ ఏకంగా 5.73శాతం (1653.05 పాయింట్లు) వరకు పతనమైంది. ఉదయం గం.10:00లకు ఇండెక్స్‌ క్రితం ముగింపు(28815.35)తో పోలిస్తే 4.24శాతం నష్టంతో 27,593.10 వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఇదే సమయానికి ఇండెక్స్‌లో తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న యస్‌బ్యాంక్‌ షేరు ఏకంగా 30శాతం నష్టాన్ని చవిచూసింది. ఆర్‌బీఎల్‌ బ్యాంక్‌ 16శాతం పతనమైంది. ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌ 8.50శాతం, ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ బ్యాంక్‌, ఎస్‌బీఐ బ్యాంక్‌ షేర్లు 6శాతం క్షీణించాయి. పీఎన్‌బీ, ఫెడరల్‌ బ్యాంక్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, యాక్సిస్‌ బ్యాంక్‌ షేర్లు 5శాతం​నుంచి 3శాతం పతనమయ్యాయి. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ 2.50శాతం, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, కోటక్‌ బ్యాంక్‌ షేర్లు 2శాతం వరకు నష్టపోయాయి.  



You may be interested

నేటి వార్తల్లోని షేర్లు

Friday 6th March 2020

వివిధ వార్తలకు అనుగుణంగా శుక్రవారం స్టాక్‌ మార్కెట్లో ప్రభావితమయ్యే షేర్లు జిందాల్‌ స్టెయిన్‌లెస్‌: కార్పొరేట్‌ డెట్‌ రీస్ట్రక్చరింగ్‌(సీడీఆర్‌) ఫ్రేమ్‌వర్క్‌ నుంచి బయటికి వస్తున్నట్లు జిందాయ్‌ స్టెయిన్‌లెస్‌ లిమిటెడ్‌(జేఎస్‌ఎల్‌) వెల్లడించింది. రైట్స్‌(ఆర్‌ఐటీఈఎస్‌): రైట్స్‌లో ఉన్న 2.38 శాతం ప్రభుత్వ వాటాను సెంకండరీ మార్కెట్‌ ద్వారా ఎల్‌ఐసీ కొనుగోలు చేసింది. దీంతో ఇప్పటిదాక రైల్వే కంపెనీ రైట్స్‌ మొత్తం ఈక్విటీలో 7.83 శాతం  వాటాను ఎల్‌ఐసీ సొంతం చేసుకుంది. ఎన్‌టీపీసీ: ఈ కంపెనీలోని 3.12 శాతం వాటాను

ఒకేరోజు రూ.1000 పెరిగిన పసిడి

Friday 6th March 2020

 ప్రపంచ దేశాల్లో  కోవిడ్‌-19 వేగంగా విస్తరిస్తుండడంతో ఇన్వెస్టర్లంతా రక్షణాత్మక పెట్టుబడులవైపు దృష్టిపెట్టడంతో బంగారం ధర శుక్రవారం భారీగా పెరిగింది. దేశీయ మల్టీకమోడిటీ మార్కెట్లో నిన్నటితో పోలిస్తే రూ.1000 పెరిగి 10గ్రాముల పసిడి రూ.44,468.00 వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఎంసీఎక్స్‌లో ఇదే అల్‌టైమ్‌ హై. గురువారం ఆసియా మార్కెట్లతోపాటు  అమెరికా ఇండెక్స్‌లు 3శాతం పడిపోవడంతో అంతర్జాతీయంగాను బంగారం ధర పెరిగింది. నిన్నటితో పోలిస్తే 17 డాలర్లు‍ పెరిగి ఔన్స్‌ బంగారం ధర

Most from this category