News


కొనసాగుతున్న బ్యాంక్‌ నిఫ్టీ పతనం

Thursday 27th September 2018
Markets_main1538033049.png-20640

మార్కెట్‌ నష్టాల ట్రేడింగ్‌లో భాగంగా బ్యాంకు నిఫ్టీ సూచి గురువారం నష్టాల బాట పట్టింది. నేడు 25,442ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ఇంట్రాడేలో ఇన్వెస్టర్లు అ‍మ్మకాలు కారణంగా 0.83శాతం నష్టపోయి 25163 కనిష్టాన్ని తాకింది. మధ్యాహ్నం గం.12:15ని.లకు ఇండెక్స్‌ గతముగింపు(25376)తో పోలిస్తే 0.75శాతం నష్టపోయి 25,186 వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఇదే సమయానికి సూచీలో భాగమైన మొత్తం 12షేర్లలో 10 షేర్లు నష్టాల్లో కొసాగుతుండగా, ఎస్‌బీఐ షేరు(1.50శాతం), హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు (0.09శాతం) లాభాల్లో ట్రేడ్‌ అవుతున్నాయి. మరోవైపు యస్‌బ్యాంకు అత్యధికంగా 6.50శాతం నష్టపోయింది. అలాగే ఐడీఎఫ్‌సీ బ్యాంక్‌, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, ఫెడరల్‌ బ్యాంక్‌ షేర్లు 3నుంచి 2శాతం నష్టపోయాయి. అలాగే ఐసీఐసీఐ బ్యాంకు, పీఎన్‌బీ బ్యాంకు, యాక్సిస్‌ బ్యాంకు, కోటక్‌ బ్యాంకు షేర్లు 1.50శాతం నుంచి 1శాతం నష్టపోయాయి. ఆర్‌బీఎల్‌, ఇండస్‌ ఇండ్‌ షేర్లు అరశాతం నష్టపోయాయి.
ఎస్‌బీఐ 1.50శాతం లాభం:-  ఎస్‌బీఐ జనరల్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీలో 4శాతం వాటాను విక్రయించేందుకు ఎగ్జిక్యూటివ్‌ కమిటీ ఆఫ్‌ సెంట్రల్‌ బోర్డు(ఈసీసీఐ) నుంచి అనుమతి దక్కించుకోవడంతో ఇంట్రాడేలో 1.80శాతం ర్యాలీ చేసింది. మధ్యాహ్నం గం.12:15ని.లకు సూచి గత ముగింపుధర(రూ.263.85)తో పోలిస్తే 1.42శాతం లాభంతో రూ.267.60 వద్ద ట్రేడ్‌ అవుతోంది.You may be interested

ఫెడ్‌ నిర్ణయం: వీటిని గమనించారా?

Thursday 27th September 2018

అమెరికా ఫెడరల్‌ రిజర్వు అంచనాలకు అనుగుణంగానే బుధవారం వడ్డీ రేట్లను 25 బేసిస్‌ పాయింట్లు (పావు శాతం) పెంచింది. దీంతో వడ్డీ రేట్ల శ్రేణి 2-2.5 శాతానికి చేరాయి. అలాగే డిసెంబర్‌లోనూ మరోదఫా రేట్ల పెంపు ఉండొచ్చని సాంకేతాలిచ్చింది. తన పాలసీ స్టేట్‌మెంట్‌ నుంచి ‘అకామోడేటివ్‌’ అనే పదాన్ని తొలగించింది. అమెరికా ఆర్థిక వ్యవస్థపై వడ్డీ రేట్ల పెంపు ప్రభావం లేనంత వరకు రేట్లను క్రమంగా పెంచుకుంటూ వెళ్తామని పరోక్షంగా

నష్టాల్లో అడాగ్‌ షేర్లు

Thursday 27th September 2018

ముంబై:- ఆటుపోట్ల మధ్య సాగుతున్న మార్కెట్‌లో అనిల్‌ అంబానీ ధీరూభాయ్‌ గ్రూప్‌(అడాగ్‌) షేర్లు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కోంటున్నాయి.  అడాగ్‌ షేర్లలో భారీ స్థాయిలో అమ్మకాలు చేపట్టారు. ఫలితంగా గురువారం అడాగ్‌ గ్రూప్‌నకు చెందిన రిలయన్స్‌ క్యాపిటల్‌ షేరు ఏడాది కనిష్టానికి పతనమైంది. రిలయన్స్‌ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్‌ 5శాతానికి పైగా నష్టపోయింది. ఏడాది కనిష్టానికి రిలయన్స్‌ క్యాపిటల్‌:-  నేటి బీఎస్‌ఈ ట్రేడింగ్‌లో రూ.318.75ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది.  సంస్థకు 10ఏళ్ల పాటు సీఈవో, ఈడీగా

Most from this category