News


నిఫ్టీ బ్యాంక్‌..400 పాయింట్ల పతనం

Friday 2nd August 2019
Markets_main1564722646.png-27487

మిగిలిన 300 బిలియన్‌ డాలర్ల చైనా దిగుమతులపై ఈ సెప్టెంబర్‌ 1 నుంచి 10 శాతం సుంకాలు విధిస్తామని యుఎస్‌ అధ్యక్షుడు ట్రంప్‌ అనడంతో అ‍ంతర్జాతీయ మార్కెట్లు శుక్రవారం ట్రేడింగ్‌లో భారీగా పతనమయ్యాయి. ఫలితంగా దేశియ ఈక్విటీ మార్కెట్లు కూడా నష్టాల్లోనే ట్రేడవుతున్నాయి. నిఫ్టీ బ్యాంక్‌ ఇం‍డెక్స్‌ ఉదయం 10.23 సమయానికి 394.75 పాయింట్లు పతనమయ్యి 28018.40 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ బ్యాంక్‌ ఇండెక్స్‌లో ప్రభుత్వ రంగ బ్యాంకులయిన బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా 2.23 శాతం, ఫెడరల్‌ బ్యాంక్‌ 1.28 శాతం, స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్‌బీఐ) 1.20 శాతం, పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌(పీఎన్‌బీ) 0.74 శాతం నష్టపోయి ట్రేడవుతున్నాయి. కాగా ప్రవేట్‌ రంగ బ్యాంకులయిన ఐసీఐసీఐ బ్యాంక్‌ 2.33 శాతం, ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ బ్యాంక్‌ లి. 2.29 శాతం, ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌ 1.77 శాతం, హెచ్‌డీఎఫ్‌సీ 1.28 శాతం, ఆర్‌బీఎల్‌ బ్యాంక్‌ లి. 0.96 శాతం, యస్‌ బ్యాంక్‌ 0.85 శాతం, యాక్సిస్‌ బ్యాంక్‌ 0.63 శాతం, కోటక్‌ బ్యాంక్‌ 0.36 శాతం నష్టపోయి ట్రేడవుతున్నాయి. 
 



You may be interested

దివాలా స్మృతి బిల్లుకు లోక్‌సభ ఆమోదం

Friday 2nd August 2019

7 సెక్షన్లకు సవరణలు న్యూఢిల్లీ: డిఫాల్టయిన సంస్థల ఆస్తుల వేలం ద్వారా వచ్చే నిధుల వినియోగంపై మరింత స్పష్టతనిచ్చేలా దివాలా స్మృతి సవరణల బిల్లు (2019)కి పార్లమెంటు ఆమోదముద్ర వేసింది. ఇప్పటికే దీనికి రాజ్యసభ ఆమోదం తెలపగా.. తాజాగా లోక్‌సభలో కూడా గ్రీన్‌ సిగ్నల్ లభించింది. స్మృతిలోని ఏడు సెక్షన్లలో సవరణలు ప్రతిపాదించారు. వీటి ప్రకారం డిఫాల్టయిన సంస్థ ఆస్తుల వేలం ద్వారా వచ్చిన నిధులపై రుణదాతల కమిటీకి పూర్తి అధికారాలు

తెరపైకి ట్రేడ్‌వార్‌: పరుగులు పెడుతున్న పసిడి ధర

Friday 2nd August 2019

అమెరికా చైనాల మథ్య మరోసారి ట్రేడ్‌ వార్‌ తెరపైకి పసిడి ధర శుక్రవారం పరుగులు పెడుతోంది. ఆసియా ట్రేడింగ్‌లో ఔన్స్‌ పసిడి ధర 29డాలర్లు (2శాతం) పెరిగింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ 300 విలువైన డాలర్ల చైనా దిగుమతులపై 10శాతం మేర పన్ను విధిస్తున్నట్లు నిన్నరాత్రి  ప్రకటించారు. ఈ విధింపు సెప్టెంబర్‌ 1నుంచి అమల్లోకి వస్తున్నట్లు ఆయన తెలిపారు. చైనాతో జరుగుతున్న చర్చలో భాగంగా అమెరికా ప్రతిపాదించిన అధిక పరిమాణంలో

Most from this category