News


బ్యాంకింగ్‌ షేర్లకు కొనుగోళ్ల మద్దతు

Thursday 2nd January 2020
Markets_main1577952974.png-30618

మార్కెట్‌ ర్యాలీలో భాగంగా బ్యాంకింగ్‌ షేర్లకు భారీగా లాభపడుతున్నాయి. ఫలితంగా ఎన్‌ఎస్‌ఈలోని కీలకమైన బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ గురువారం మిడ్‌సెషన్‌కల్లా 0.75శాతం లాభపడింది. నేడు బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ 8,226.60 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ఉదయం నుంచి బ్యాంకింగ్‌ రంగ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో ఇండెక్స్‌ ఒక దశలో 0.60శాతం పెరిగి 32296.15 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని అందుకుంది. మధ్యాహ్నం 1:00లకు ఇండెక్స్‌ క్రితం ముగింపు(32102.90)తో పోలిస్తే 0.50శాతం పెరిగి 32,265.10 వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఇదే సమయానికి ఇండెక్స్‌లో అత్యధికంగా యస్‌ బ్యాంక్‌ షేర్లు 3.30శాతం పెరిగింది. పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌, ఆర్‌బీఎల్‌, ఫెడరల్‌ బ్యాంక్‌ షేర్లు 3శాతం పెరిగాయి. అలాగే ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా షేర్లు 2శాతం లాభపడ్డాయి. యాక్సిస్‌ బ్యాంక్‌, ఎస్‌బీఐ, ఐడీఎఫ్‌సీ బ్యాంక్‌ షేర్లు 1శాతం, ఐసీఐసీఐ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ షేర్లు అరశాతం వరకు పెరిగాయి. కోటక్‌ బ్యాంక్‌ షేరు మాత్రం 0.25శాతం నష్టాల్లో ట్రేడ్‌ అవుతోంది. 



You may be interested

లార్జ్‌క్యాప్స్‌ కంటే మిడ్‌క్యాప్స్‌ మిన్న!

Thursday 2nd January 2020

ఈ ఏడాది స్మాల్‌ క్యాప్స్‌ టర్న్‌అరౌండ్‌? రికవరీ వస్తుందన్న నమ్మకముంటే..లార్జ్‌ క్యాప్స్‌ కంటే మిడ్‌ క్యాప్స్‌లోనే అత్యధిక రిటర్నులు పొందవచ్చునంటున్నారు.. సుందరం మ్యూచువల్‌ ఫండ్‌ ఎండీ, సీఈవో సునీల్‌ సుబ్రమణ్యం. ఒక ఆంగ్ల చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో గతేడాది మార్కెట్ల తీరు, ఎఫ్‌ఎంసీజీ స్టాక్స్‌లో భారీ ర్యాలీ తదితర పలు అభిప్రాయాలను వెల్లడించారు. వివరాలు చూద్దాం.. ప్రధానంగా మిడ్‌, స్మాల్‌ క్యాప్స్‌ ఆర్థిక వ్యవస్థ పురోభివృద్ధిపై ఆధారపడి కదులుతుంటాయి. ఈ ఏడాది జీడీపీ

స్టెరిలైట్‌కు తెలంగాణ ప్రాజెక్ట్‌- షేరు జూమ్‌

Thursday 2nd January 2020

గ్రామీణ ప్రాంతాలకు హై‍స్పీడ్‌ బ్రాడ్‌బ్యాండ్‌ తెలంగాణవ్యాప్తంగా 11 జిల్లాలలో హైస్పీడ్‌ బ్రాడ్‌బ్యాండ్‌ నెట్‌వర్క్‌ ఏర్పాటుకు వీలుగా భారీ ప్రాజెక్టును గెలుపొందినట్లు స్టెరిలైట్‌ టెక్నాలజీస్‌ తాజాగా వెల్లడించింది. తెలంగాణ ఫైబర్‌ గ్రిడ్‌ కార్పొరేషన్‌తో సంయుక్తంగా ఈ ప్రాజెక్టును అభివృద్ధి చేయనున్నట్లు తెలియజేసింది. ఈ ప్రాజెక్టులో భాగంగా 3,000 గ్రామ పంచాయతీల పరిధిలో అత్యంత వేగవంతమైన బ్రాడ్‌బ్యాండ్‌ నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేయనున్నట్లు తెలియజేసింది. తద్వారా ఆరు మిలియన్లమందికి అందుబాటు ధరల్లో హైస్పీడ్‌ బ్రాడ్‌బ్యాండ్‌ కనెక్టివిటీ

Most from this category