News


ఆల్‌టైం హైకి బ్యాంక్‌ నిఫ్టీ

Tuesday 17th December 2019
Markets_main1576566115.png-30272

మార్కెట్‌ ప్రారంభం నుంచి బ్యాంకింగ్‌ రంగ షేర్లకు లభిస్తున్న కొనుగోళ్లతో మంగళవారం ట్రేడింగ్‌లో బ్యాంక్‌ నిప్టీ ఇండెక్స్‌ కొత్త జీవితకాల గరిష్టాన్ని నమోదుచేసింది. ఎన్‌ఎస్‌ఈలో బ్యాంకింగ్‌ రంగ షేర్లకు ప్రాతినిథ్యం వహించే ఇండెక్స్‌ 32వేల స్థాయి పైన 32,082.40 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ఎస్సార్‌ స్టీల్‌ టేకోవర్‌ ప్రక్రియ సోమవారం పూర్తయ్యిందని ఆర్సెలర్‌ మిట్టల్‌ ప్రకటించింది. దివాలా చట్టం కింద పరిష్కారమైన అతిపెద్ద రికవరీ ఇదే కావడంతో పలు బ్యాంకింగ్‌ రంగ షేర్లు నిన్నటి ట్రేడింగ్‌ నుంచి లాభాల బాటపట్టాయి. ఈ క్రమంలోనే నేటి ట్రేడింగ్‌లో బ్యాంకింగ్‌ రంగ షేర్లకు డిమాండ్‌ నెలకొనడంతో ఇండెక్స్‌ 0.75శాతం లాభపడి 32,205.75 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. ఈ స్థాయి ఇండెక్స్‌ జీవితకాల గరిష్టస్థాయి కావడం విశేషం. మధ్యాహ్నం గం.12:20ని.లకు ఇండెక్స్‌ క్రితం ముగింపు(31,974.20)తో పోలిస్తే 0.60శాతం లాభంతో 32,167.60 వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఇదే సమయానికి యస్‌బ్యాంక్‌, పీఎన్‌బీ బ్యాంక్‌ షేర్లు 2శాతం పెరిగాయి. బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా షేరు 1.50శాతం, ఫెడరల్‌ బ్యాంక్‌, ఎస్‌బీఐ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఆర్‌బీఎల్‌ బ్యాంక్‌ షేర్లు 1శాతం ర్యాలీ చేశాయి. యాక్సిస్‌ బ్యాంక్‌, కోటక్‌ బ్యాంక్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌ షేర్లు అరశాతం లాభపడ్డాయి. ఇండస్‌ ఇండ్‌, ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ బ్యాంక్‌ షేర్లు అరశాతం నష్టపోయాయి. 



You may be interested

లాభాల్లో మెటల్‌ షేర్లు

Tuesday 17th December 2019

మార్కెట్‌ రికార్డు ర్యాలీలో మంగళవారం భాగంగా మెటల్‌ షేర్లు మెరుస్తున్నాయి. ఫలితంగా మెటల్‌ ఇండెక్స్‌ దాదాపు 3.50శాతం ర్యాలీ చేసింది. ఎన్‌ఎస్‌ఈలో మెటల్‌ షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ మెటల్‌ ఇండెక్స్‌ నేడు 2,603.90 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. రేపు జరిగే జీఎస్‌టీ కౌన్సిల్‌ సమావేశంలో మెటల్‌ ఉత్పత్తులను సుంకాలను సవరించవచ్చని అంచనాలతో నేడు మెటల్‌ షేర్లకు డిమాండ్‌ పెరిగింది. ఫలితంగా నిఫ్టీ మెటల్‌ ఇండెక్స్‌ 2.77శాతం పెరిగి 2,662.50

టాప్‌ బ్రోకరేజ్‌ల నుంచి ఐదు సిఫార్సులు

Tuesday 17th December 2019

లాంగ్‌టర్మ్‌కు దాదాపు 31 శాతం వరకు రాబడినిచ్చే ఐదు స్టాకులను ప్రముఖ బ్రోకరేజ్‌లు రికమండ్‌ చేస్తున్నాయి.  1. వీగార్డ్‌ ఇండస్ట్రీస్‌: షేర్‌ఖాన్‌ సిఫార్సు. కొనొచ్చు. టార్గెట్‌ రూ. 285. బహుళముఖ వ్యూహంతో అనుకున్న రెవెన్యూ గ్రోత్‌ గైడెన్స్‌ను సాధించగలదు. ప్రస్తుతం సరసమైన పీఈ వద్ద ట్రేడవుతోంది. రాబోయే సంవత్సరాల్లో 20 శాతం నికర ఎర్నింగ్స్‌లో చక్రీయ వార్షిక వృద్ది ఉంటుందని అంచనా. టైర్‌2, 3 నగరాల్లోకి వేగంగా విస్తరించడం, లోమార్జిన్‌ ఉత్పత్తులను

Most from this category