News


బ్యాంక్‌ నిఫ్టీ 300 పాయింట్లు అప్‌!

Monday 14th October 2019
Markets_main1571030834.png-28867

  దేశీయ ప్రభుత్వ రంగ బ్యాంకుల చీఫ్‌లతో కేంద్ర ఆర్థిక మంత్రి సమావేశం కానుండడంతో ప్రభుత్వ బ్యాంకులు సోమవారం ట్రేడింగ్‌లో లాభాల్లో ట్రేడవుతున్నాయి. దీనితో పాటు అంతర్జాతీయ మార్కెట్లు లాభల్లో ట్రేడవుతుండడం, దేశీయ కరెన్సీ రూపీ డాలర్‌ మారకంలో బలపడడం వంటి కారణాల వలన బ్యాంకింగ్‌ షేర్లు లాభాల బాట పట్టాయి. ఉదయం 10.41 సమయానికి నిఫ్టీ బ్యాంక్‌ ఇండెక్స్‌ 327.35 పాయింట్లు లేదా 1.17 శాతం లాభపడి 28,369.85 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. ఈ ఇండెక్స్‌లో హెవివెయిట్‌ షేర్లయిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ 1.52 శాతం లాభపడి రూ. 1,217.00  వద్ద,  ఐసీఐసీఐ బ్యాంక్‌ 0.57 శాతం లాభపడి రూ. 431.00 వద్ద ట్రేడవుతున్నాయి. మిగిలిన షేర్లలో ప్రభుత్వ బ్యాంక్‌ షేర్లయిన స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్‌బీఐ) 1.28 శాతం, పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌(పీఎన్‌బీ) 1.32 శాతం లాభపడి ట్రేడవుతుండగా, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా 0.77 శాతం  మాత్రం నష్టాల్లో ట్రేడవుతోంది. ఈ ఇండెక్స్‌లో ఇతర షేర్లయిన  ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ 2.80 శాతం, ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ బ్యాంక్‌ 1.34 శాతం, యాక్సిస్‌ బ్యాంక్‌ 1.32 శాతం, ఫెడరల్‌ బ్యాంక్‌ 0.83    శాతం, ఆర్‌బీఎల్‌ బ్యాంక్‌ 0.81 శాతం, కోటక్‌ బ్యాంక్‌ 0.32 శాతం, యెస్‌ బ్యాంక్‌ 0.25 శాతం లాభపడి ట్రేడవుతున్నాయి. 



You may be interested

స్థిరంగా పసిడి ధర

Monday 14th October 2019

అమెరికా చైనాల మధ్య కుదిరిన పాక్షిక ఒప్పందంతో కిత్రం వారం ముగింపు రోజున భారీ పతనమైన పసిడి ధర సోమవారం ఉదయం ట్రేడింగ్‌లో దాదాపు అదే స్థాయిలో స్థిరంగా ట్రేడ్‌ అవుతోంది. ఆసియా ట్రేడింగ్‌లో ఉదయం గం.11:10ని.లకు ఔన్స్‌ పసిడి ధర 3 డాలర్ల స్వల్ప లాభంతో 1,491.80 డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. రాబోయే రోజుల్లో పసిడి ధరకు బ్రిగ్జిట్‌, ఫెడ్‌ రిజర్వ్‌ వడ్డీరేట్ల అంశాలు కీలకం కానున్నాయి.

ఐఆర్‌సీటీసీ.. అదరగొట్టింది!

Monday 14th October 2019

బంపర్‌ లిస్టింగయిన షేరు ఇండియన్‌ రైల్వే కేటరింగ్‌ అండ్‌ టూరిజం కార్పొరేషన్‌(ఐఆర్‌సీటీసీ) షేరు మార్కెట్లో శుభారంభం చేసింది. ఇష్యూ ధర కన్నా భారీ ప్రీమియంతో షేరు సోమవారం లిస్టింగయింది. ఇష్యూ ధర రూ. 320 కాగా లిస్టింగ్‌ 101.25 శాతం ప్రీమియంతో రూ. 644వద్ద జరిగింది. ఇది మార్కెట్‌ వర్గాల అంచనాల కన్నా, గ్రేమార్కెట్‌ సంకేతాల కన్నా చాలా అధికం. లిస్టింగ్‌ అనంతరం దూసుకుపోయిన షేరు ఒక దశలో రూ. 698ని

Most from this category