News


బ్యాంక్‌ నిఫ్టీ 1.50శాతం డౌన్‌

Tuesday 21st May 2019
Markets_main1558431430.png-25864

క్రితం ట్రేడింగ్‌లో జీవితకాల గరిష్టాన్ని నమోదు చేసిన బ్యాంక్‌ నిఫ్టీ మంగళవారం నష్టాల బాట పట్టింది. ప్రైవేట్‌ రంగ షేర్లలో అ‍మ్మకాలు ఎక్కువగా జరగడంతో ఈ సూచీ నేటి ట్రేడింగ్‌లో 1.50శాతం నష్టపోయింది. మార్కెట్‌ భారీ ర్యాలీలో భాగంగా నిన్నటి ట్రేడింగ్‌లో 1330 పాయింట్లు(4.50శాతం) పెరిగి 30779.90 వద్ద కొత్త జీవితకాల గరిష్టాన్ని నమోదు చేసిన సంగతి తెలిసిందే. నేడు 30,862.10ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది.  ఇంట్రాడేలో ఇండస్‌ ఇండ్‌ 3.50శాతం, ఫెడరల్‌ బ్యాంక్‌, పీఎన్‌బీ బ్యాంక్‌ 2.50శాతం, ఐసీఐసీఐ బ్యాంక్‌, యస్‌ బ్యాంక్‌, ఎస్‌బీఐ బ్యాంక్‌ షేర్లు 2శాతం నష్టపోయాయి. అలాగే ఆర్‌బీఎల్‌ బ్యాంక్‌ 1.50శాతం, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, యాక్సిస్‌ బ్యాంక్‌, కోటక్‌ బ్యాంక్‌ షేర్లు 1శాతం క్షీణించాయి. మరోవైపు ఐడీఎఫ్‌సీ బ్యాంకు షేర్లు మాత్రం అరశాతం లాభపడ్డాయి. ఫలితంగా 1.50శాతం నష్టపోయి 30,270.70ల వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని నమోదు చేసింది. మధ్యాహ్నం గం.3:00లకు ఇండెక్స్‌ గతముగింపు (30759.70)తో పోలిస్తే 1.45శాతం నష్టపోయి 30,313.75ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. 



You may be interested

‘బేర్‌’మన్న టాటామోటర్స్‌

Tuesday 21st May 2019

మంగళవారం ఇంట్రాడేలో టాటామోటర్స్‌ షేరు దాదాపు 8 శాతం నష్టపోయింది. కంపెనీ మార్చి త్రైమాసిక ఫలితాలు మిశ్రమంగా ఉండడంతో షేరు కౌంటర్లో అమ్మకాలు పెరిగాయి. కంపెనీ నికరలాభం మార్చి త్రైమాసికంలో 49 శాతం క్షీణించి రూ. 1108 కోట్లకు చేరింది. జేఎల్‌ఆర్‌ మార్జిన్‌ గైడెన్స్‌లో కోత విధించింది. ముడిపదార్ధాల ధరల పెరుగుదల, చైనాలో జేఎల్‌ఆర్‌ ఇన్వెంటరీ ఇంకా తగ్గకపోవడం క్యు4 ఫలితాలపై ప్రభావం చూపాయి. ఈ నేపథ్యంలో కంపెనీ షేరుపై

నష్టాల్లో మెటల్‌ షేర్లు

Tuesday 21st May 2019

నష్టాల మార్కెట్లో మెటల్‌ షేర్లు కరిగిపోతున్నాయి. ఎన్‌ఎస్‌ఈలో మెటల్‌ షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ మెటల్‌ ఇండెక్స్‌ మిడ్‌సెషన్‌ సమయానికి 2శాతం నష్టపోయింది. ఇండెక్స్‌లో అత్యధికంగా నాల్కో షేరు 5శాతం నష్టపోయింది. ఏపిఎల్‌అపోలో, వెల్‌స్పన్‌ కార్ప్‌ 4.50శాతం పతనమయ్యాయి. టాటాస్టీల్‌, జేఎస్‌డబ్లూ‍్య స్టీల్‌ షేర్లు 2.50శాతం క్షీణించాయి. సెయిల్‌, ఎన్‌ఎండీసీ, హిందాల్కో, హిందూస్థాన్‌ జింక్‌ షేర్లు 2శాతం నష్టపోయాయి. వాటితో పాటు వేదాంత, కోల్‌ ఇండియా, హిందూస్థాన్‌ కాపర్‌ షేర్లు

Most from this category