News


బ్యాంక్‌ నిఫ్టీ 1.25% క్రాష్‌

Friday 6th December 2019
news_main1575622305.png-30093

బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ శుక్రవారం మిడ్‌సెషన్‌ సమయానికి 1.32శాతం నష్టపోయింది. ఈ దఫా వడ్డీరేట్లపై ఎలాంటి మార్పు లేకుండా యథాతధంగా ఉంచుతున్నట్లు ప్రకటించడంతో నిన్న ఆర్‌బీఐ పాలసీ కమిటి నిర్ణయం తీసుకోవడంతో బ్యాకింగ్‌ రంగ షేర్లు మార్కెట్‌ ప్రారంభం నుంచి అమ్మకాల ఒత్తిడికి లోనవుతున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా ప్రభుత్వరంగ బ్యాంక్‌ షేర్లు ఎక్కువగా నష్టపోయాయి. మిడ్‌సెషన్‌ను ప్రైవేట్‌ రంగ షేర్లలో సైతం అమ్మకాలు వెల్లువెత్తాయి. ఫలితంగా బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ 1.33శాతం క్షీణించి 31293 స్థాయికి చేరుకుంది. మధ్యాహ్నం గం.2:00లకు ఇండెక్స్‌ క్రితం ముగింపు(31713)తో పోలిస్తే 1.30శాతం నష్టపోయి 31,306 వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఇదే సమయానికి ఇండెక్స్‌లో అత్యధికంగా యస్‌బ్యాంక్‌ షేరు​6శాతం నష్టపోయింది. ఆర్‌బీఎల్‌ 6.50శాతం, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా 4.50శాతం, ఎస్‌బీఐ 4శాతం, పీఎన్‌బీ షేరు 3.50శాతం నస్టపోయాయి. ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌, ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ బ్యాంక్‌, ఫెడరల్‌ బ్యాంక్‌ 2.50శాతం వరకు నష్టపోయాయి. యాక్సిస్‌ బ్యాంక్‌ 1.50శాతం, ఐసీఐసీఐ బ్యాంక్‌ 1శాతం, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ 0.35శాతం పతనయ్యాయి. ఒక్క కోటక్‌ బ్యాంక్‌ షేరు మాత్రం 1.25శాతం లాభపడింది. 



You may be interested

బుల్లిష్‌ అష్టపది!

Friday 6th December 2019

ఎనిమిది స్టాక్‌ రికమండేషన్లు ఏడాది కాలంలో మంచి రాబడిని అందించే ఎనిమిది స్టాకులను నార్నోలియా ఫైనాన్షియల్‌ అడ్వైజర్స్‌, జియోజిత్‌ ఫిన్‌సర్వ్‌, రెలిగేట్‌ బ్రోకింగ్‌కు చెందిన అనలిస్టులు రికమండ్‌ చేస్తున్నారు.  1. కోటక్‌మహీంద్రా బ్యాంక్‌: టార్గెట్‌ రూ. 1946. ఆరోగ్యవంతమైన లోన్‌గ్రోత్‌ కొనసాగిస్తోంది. పరిశ్రమలో మందగమనం ఉన్నా, బ్యాంకు మాత్రం మంచి పనితీరు చూపుతోంది. ఎన్‌ఐఐ, ఎన్‌ఐఎంలు బలంగా ఉండడంతో రెండంకెల లోన్‌గ్రోత్‌ కొనసాగవచ్చు. బ్యాంకు అనుబంధ విభాగాలు బలమైన వృద్ధి నమోదు చేస్తున్నాయి.  2.

నెలరోజుల కనిష్టానికి యస్‌ బ్యాంక్‌

Friday 6th December 2019

మూడింగ్‌ రేటింగ్‌ కోతతో 9శాతం పతనమైన షేరు యస్‌బ్యాంక్‌ షేరు శుక్రవారం ట్రేడింగ్‌లో 9శాతం నష్టపోయి నెలరోజుల కనిష్టానికి దిగివచ్చింది. ప్రముఖ బ్రోకరేజ్‌ మూడీస్‌ బ్యాంక్‌ రేటింగ్‌ను డౌన్‌గ్రేడ్‌ చేయడం ఇందుకు కారణమైంది. నేడు బీఎస్‌ఈలో ఈ షేరు రూ.61.00 వద్ద ప్రారంభమైంది. నిర్థరక ఆస్తులు, తక్కువ లాస్‌-అబ్‌సోరింగ్‌ బఫర్‌లు బ్యాంక్‌ నిధుల సమీకరణ, ద్రవ్యతపై ప్రతికూల ప్రభావాన్ని చూపే అవకాశం ఉందని రేటింగ్‌ తెలిపింది. ఈ కారణంగా మూడీస్‌... బ్యాంకు

Most from this category