News


29,000 పైకి బ్యాంక్‌ నిఫ్టీ!

Thursday 17th October 2019
Markets_main1571304294.png-28952

  బ్యాంకింగ్‌ షేర్లలో విపరీతంగా కొనుగోళ్ళు జరుగుతుండడంతో దేశీయ ఈక్విటీ మార్కెట్లు గురువారం ట్రేడింగ్‌లో లాభాల్లో ట్రేడవుతున్నాయి. మధ్యాహ్నం 2.30 సమయానికి నిఫ్టీ బ్యాంక్‌ ఇండెక్స్‌ 450.25 పాయింట్లు లేదా 1.58 శాతం లాభపడి 28,989.05 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. 28,596.35 పాయింట్ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించిన ఈ ఇండెక్స్‌, 29,049.05 పాయింట్ల వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని తాకింది. ఈ ఇండెక్స్‌లో యెస్‌ బ్యాంక్‌ 16.69 శాతం, ఆర్‌బీఎల్‌ బ్యాంక్‌ 9.42 శాతం, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ 4.57 శాతం, స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్‌బీఐ) 3.22 శాతం, ఫెడరల్‌ బ్యాంక్‌ 2.31 శాతం, పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌(పీఎన్‌బీ) 2.27 శాతం, యాక్సిస్‌ బ్యాంక్‌ 1.90 శాతం, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా 1.49 శాతం, ఐసీఐసీఐ బ్యాంక్‌ 1.36 శాతం, ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ బ్యాంక్‌ 1.15 శాతం, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ 0.53 శాతం లాభపడి ట్రేడవుతుండగా, కోటక్‌ బ్యాంక్‌ మాత్రం 0.20 శాతం నష్టపోయి ట్రేడవుతోంది.
  ఇదే సమయానికి నిఫ్టీ 50 91 పాయింట్లు లాభపడి 11,555.30 పాయింట్ల వద్ద, సెన్సెక్స్‌ 386.87 పాయింట్లు లాభపడి 38,984  పాయింట్ల వద్ద ట్రేడవుతోంది.



You may be interested

యస్‌ బ్యాంక్‌ 17.50శాతం అప్‌

Thursday 17th October 2019

ప్రముఖ పారిశ్రామికవేత్తలు సునీల్‌ మిట్టల్‌, సునీల్‌ ముంజల్‌ యస్‌బ్యాంక్‌లో వాటా కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నారనే వార్తలు వెలుగులోకి రావడంతో యస్‌ బ్యాంక్‌ షేర్లు గురువారం ట్రేడింగ్‌లో 17.50శాతం లాభపడింది. నేడు ఎస్‌ఈలో ఈ బ్యాంకు షేర్లు రూ.41.90 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. బ్యాంకులో వాటా కొనుగోలుకు సంబంధించి చర్చలు ప్రాథమిక దశలో ఉన్నాయని, చర్చలు విజయవంతమైనట్లైతే.., మిట్టల్‌, ముంజల్‌ 5శాతం వాటాను కొనుగోలు చేసే అవకాశం ఉందని వార్తలు నిన్న

పన్ను తగ్గింపుతో ప్రైవేటు బ్యాంకులకు అధిక లాభం

Thursday 17th October 2019

-పంకజ్‌ పాండే, ఐసీఐసీఐ డైరక్ట్‌ ప్రస్తుతం మెటల్‌ స్టాకులకు దూరంగా ఉండాలని ఐసీఐసీఐ డెరక్ట్‌, రీసెర్చ్‌ హెడ్‌, పంకజ్‌ పాండే ఓ ఆంగ్ల చానెల్‌కిచ్చిన ఇంటర్యూలో అన్నారు. బ్యాంకింగ్‌ సెక్టార్‌కు సంబంధించి ఎన్‌ఐఐ వృద్ధి దృక్పథం ఆధారంగా ప్రైవేట్‌ బ్యాంకులు లేదా మిడ్‌ క్యాప్‌ బ్యాంకు ఆకర్షణీయంగా ఉన్నాయన్నారు. ఆటో స్టాక్స్‌ను కొనుగోలు చేయడానికి ఇంకొంత కాలం వేచి ఉండడ మంచిదని తెలిపారు. ఇంటర్యూలోని ముఖ్యంశాలు ఆయన మాటల్లోనే.... నాణ్యమైన స్టాకులను విడిచిపెట్టకండి.. వివిధ

Most from this category