STOCKS

News


బ్యాంక్‌ నిఫ్టీ 1శాతం క్రాష్‌...

Thursday 13th February 2020
news_main1581584359.png-31762

ప్రైవేట్‌ రంగ బ్యాంక్‌ షేర్లు అమ్మకాల ఒత్తిడికిలోనవ్వడంతో గురువారం బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ మిడ్‌సెషన్‌ సమయానికి 1శాతం నష్టాన్ని చవిచూసింది. నేడు ఈ ఇండెక్స్‌ 31,586.55 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. మార్కెట్‌ ప్రారంభం నుంచి ప్రైవేట్‌ రంగ షేర్ల అమ్మకాలకు ఇన్వెస్టర్లు మొగ్గుచూపడంతో ఇండెక్స్‌ ఒకదశలో 1శాతం నష్టచవిచూసి 31180 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని తాకింది. మధ్యాహ్నం గం.2:20ని.లకు ఇండెక్స్‌ క్రితం ముగింపు(31,492.90)తో పోలిస్తే 0.91శాతం నష్టంతో 31,206.00 వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఇదే సమయానికి ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌ 4శాతం నష్టపోయింది. ఆర్‌బీఎల్‌ 2శాతం, ఐసీఐసీఐ బ్యాంక్‌, ఫెడరల్‌ బ్యాంక్‌, కోటక్‌ బ్యాంక్‌, యాక్సిస్‌ బ్యాంక్‌ 1శాతం చొప్పున, హెచ్‌డీఎప్‌సీ షేరు అరశాతం నష్టపోయింది. కానీ ప్రభుత్వ రంగ ఎస్‌బీఐ 2 శాతం జంప్‌చేసింది.



You may be interested

కొద్ది రోజుల్లో నూతన శిఖరాలకు నిఫ్టీ...జియోజిత్‌

Thursday 13th February 2020

జియోజిత్‌ ఫిన్‌సర్వ్‌ అంచనా ఫిబ్రవరి 11 నిఫ్టీ చార్టుల్లో గ్రేవ్‌స్టోన్‌ డోజీ ఏర్పడిందని, అయితే మరుసటి రోజే బుల్లిష్‌ క్యాండిల్‌ ఏర్పడడం బుల్స్‌ బలానికి సంకేతమని జియోజిత్‌ ఫిన్‌సర్వ్‌ తెలిపింది. నిఫ్టీ తన 60 రోజుల ఈఎంఏ స్థాయి నుంచి మంగళవారం మంచి అప్‌మూవ్‌ నమోదు చేసేలా బుల్స్‌ కీలకపాత్ర వహించారు. అయితే బుధవారం తిరిగి బుల్స్‌ జోరు కనిపించలేదు. కానీ సూచీలు పెద్దగా పతనం కాలేదు. మంగళవారం నిఫ్టీ 12

క్యూ3- టొరంట్‌ పవర్‌ హైజంప్‌

Thursday 13th February 2020

ప్రోత్సాహకర ఫలితాల ఎఫెక్ట్‌ వాటాదారులకు రూ. 11.6 డివిడెండ్‌ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2019-20) మూడో త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించడంతో ప్రయివేట్‌ రంగ కంపెనీ టొరంట్‌ పవర్‌ కౌంటర్‌ వెలుగులోకి వచ్చింది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో ఈ షేరు భారీ లాభాలతో సందడి చేస్తోంది. ఈ ఏడాది క్యూ3(అక్టోబర్‌-డిసెంబర్‌)లో టొరంట్‌ పవర్‌ నికర లాభం 76 శాతం పెరిగి రూ. 421 కోట్లకు చేరింది. కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన మొత్తం ఆదాయం మాత్రం రూ.

Most from this category