News


నష్టాల్లో మారుతి, బజాజ్‌, హీరో మోటో

Friday 27th September 2019
Markets_main1569562075.png-28585

అంతర్జాతీయ మార్కెట్‌లు శుక్రవారం నెగిటివ్‌లో ట్రేడవుతుండడంతో దేశీయ ఈక్విటీ మార్కెట్‌లు కూడా అదే బాటాలో నడుస్తున్నాయి. ఉదయం 10.48 సమయానికి నిఫ్టీ ఆటో ఇండెక్స్‌ 1.45 శాతం కోల్పోయి 7,548.40 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. ఈ ఇండెక్స్‌లో హెవీవెయిట్‌ షేర్లయిన మారుతి సుజుకీ 1.25 శాతం నష్టపోయి రూ. 6,772.05 వద్ద, బజాజ్‌ ఆటో 1.01 శాతం నష్టపోయి రూ. 2,940.35 వద్ద, ఐషర్‌ మోటర్స్‌ 0.62 శాతం రూ. 17,800.00 వద్ద ట్రేడవుతున్నాయి. మిగిలిన షేర్లలో టాటా మోటర్స్‌ 4.50 శాతం, అమర్‌రాజా బ్యాటరీస్‌ 3.18 శాతం, అశోక్‌ లేలాండ్‌ 2.65 శాతం,  మహింద్రా అండ్‌ మహింద్రా (ఎం అండ్‌ ఎం) 2.11 శాతం,  హీరో మోటర్‌ కార్ప్‌ 1.81 శాతం, టీవీఎస్‌ మోటర్స్‌ 1.52 శాతం, అపోలో టైర్స్‌ 1.11 శాతం, భారత్‌ ఫోర్జ్‌ 0.85 శాతం, బోష్‌ 0.34 శాతం నష్టపోయి ట్రేడవుతుండగా, మదర్‌ సుమీ 0.50 శాతం, ఎక్సైడ్‌ ఇండియా 0.33 శాతం, ఎంఆర్‌ఎఫ్‌ 0.24 శాతం లాభపడి ట్రేడవుతున్నాయి.



You may be interested

ఎనిమిదేళ్ల కనిష్టానికి యస్‌ బ్యాంక్‌

Friday 27th September 2019

ప్రమోటర్ల వాటా విక్రయాలతో తీవ్ర కష్టాలను ఎదుర్కోంటున్న యస్‌బ్యాంక్‌ షేర్లు శుక్రవారం ఉదయం ట్రేడింగ్‌లో ఎనిమిదేళ్ల కనిష్టం వద్ద ట్రేడ్‌ అవుతున్నాయి.  క్రితం ట్రేడింగ్‌లో 5శాతం నష్టపోయిన యస్‌బ్యాంక్‌ షేర్లు... నేడు ఎన్‌ఎస్‌ఈలో రూ.50 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. కంపెనీ ప్రధాన ప్రమోటింగ్‌ సంస్థల్లోఒకటైన యస్‌ క్యాపిటల్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థ(వైసీపీఎల్‌) ప్రతి షేరు ధర రూ.51.94 చొప్పున మొత్తం 4.65 కోట్ల ఈక్విటీ షేర్లను(1.82శాతం వాటాకు సమానం) రూ.241.5 కోట్లకు విక్రయించింది. అలాగే

61 డాలర్ల స్థాయికి క్రూడ్‌

Friday 27th September 2019

    చమురు కేంద్రాలపై డ్రోన్‌ దాడి జరిగిన తర్వాత నుంచి రెండు వారాల్లోనే సౌదీ తన చమురు ఉత్పత్తిని పునరుద్ధరించడంతో చమురు ధరలు శుక్రవారం నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ఉదయం 9.37 సమయానికి బ్రెంట్‌క్రూడ్‌ 1 శాతం నష్టపోయి బారెల్‌ 61.12 డాలర్ల వద్ద, డబ్యూటీఐ క్రూడ్‌ 0.60 శాతం నష్టపోయి బారెల్‌ 56.07 డాలర్ల వద్ద ట్రేడవుతున్నాయి. ‘ఊహించని దాని కంటే ముందుగానే సౌదీ తన చమురు కేంద్రాలను

Most from this category