News


జోరుగా అటో షేర్ల ర్యాలీ

Monday 1st July 2019
Markets_main1561972727.png-26717

జూన్‌ నెల వాహన విక్రయ గణాంకాలు వెల్లడి అవుతున్న నేపథ్యంలో సోమవారం అటోరంగ షేర్లు జోరుగా ర్యాలీ చేస్తున్నాయి. ఎన్‌ఎస్‌ఈలో వాహన రంగ షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ అటో ఇండెక్స్‌ 1.50శాతం ర్యాలీ చేసింది. పలు ప్రధాన కంపెనీల జూన్‌ వాహన విక్రయాలు విశ్లేషకుల అంచనాలకు మించి నమోదుకావడంతో ఇన్వెస్టర్లు ఈ రంగ షేర్ల కొనుగోళ్లకు మొగ్గుచూపుతున్నారు. వాస్తవానికి కార్లు, బైకులపై ప్రభుత్వం ఇన్సూరెన్స్‌ రేట్లను పెంచడటం, నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌ రంగంలో సంక్షోభం, గ్రామీణ ప్రాంతాల్లో వృద్ధి నమోదు మందగించడటం తదితర అంశాలతో ఈ జూన్‌లో వాహన విక్రయాలు భారీగా తగ్గవచ్చని విశ్లేషకులు అంచనా వేశారు. అయితే, పలు కంపెనీల జూన్‌ విక్రయాలు విశ్లేషకుల అంచనాల కంటే ఎక్కువగానే జరిగాయి. ఫలితంగా ఈ రంగ షేర్లకు నేడు డిమాండ్‌ పెరిగింది. ఇండెక్స్‌లో అత్యధికంగా టాటామోటర్స్‌  4శాతం ర్యాలీ చేసింది. మదర్‌సన్‌సుమీ 3.50శాతం, బజాజ్‌ అటో, ఎక్సైడ్‌ ఇండస్ట్రీస్‌ 2.50శాతం పెరిగాయి. అలాగే భాష్‌ లిమిటెడ్‌, ఐషర్‌ మోటర్స్‌, భారత్ ఫోర్జ్ షేర్లు 2శాతం పెరిగాయి. అలాగే అమరరాజా బ్యాటరీస్‌, హీరోమోటర్స్‌ కార్ప్‌ షేర్లు 1.50శాతం లాభపడ్డాయి. మహీంద్రా  అండ్‌ మహీంద్రా కంపెనీ షేర్లు ఒకశాతం లాభపడగా, అపోలో ఏపిల్‌, ఎంఆర్‌ఎఫ్‌ షేర్లు అరశాతం ర్యాలీ చేశాయి. మరోవైపు అశోక్‌ లేలాండ్‌ అరశాతం, మారుతి షేర్లు అరశాతం వరకు నష్టపోయాయి. మధ్యాహ్నం గం.2:30ని.లకు ఇండెక్స్‌ గత ముగింపు(7,928.05)తో పోలిస్తే 1.35శాతం ర్యాలీ చేసి 8,035.45 వద్ద ట్రేడ్‌ అవుతోంది.

ఇదే సమయానికి బెంచ్‌మార్క్‌ సూచీలైన నిఫ్టీ 88.15 పాయింట్లు పెరిగి 11,877.00 వద్ద, సెన్సెక్స్‌ 324.76 పాయింట్లు లాభపడి 39,719.40 వద్ద ట్రేడ్‌ అవుతోంది.



You may be interested

తయారి రంగంలో వృద్ధి అంతంతే

Monday 1st July 2019

ఆర్డర్లు, ఉత్పత్తి, ఉద్యోగాలలో వృద్ధి  కానీ దేశియంగా, అంతర్జాతీయంగా తగ్గిన డిమాండ్‌ : పీఎమ్‌ఐ      ఆర్డర్లు, ఉత్పత్తి, ఉద్యోగాలలో వృద్ధి  ఉన్నప్పటికి భారత తయారిరంగ వృద్ధి జూన్‌ నెలలో అంతంత మాత్రంగానే నమోదయ్యింది. ఒక అంతర్జాతీయ సంస్థ సోమవారం విడుదల చేసిన పర్చేజింగ్‌ మానేజర్‌ ఇండెక్స్‌(పీఎంఐ) ప్రకారం తయారి రంగం పీఎంఐ జూన్‌ నెలలో 52.1 పాయింట్లగా ఉంది. కానీ మే లో నమోదు చేసిన 52.7 పాయింట్ల కంటే ఇది తక్కువ.

షార్ట్‌టర్మ్‌ కోసం ఐదు సిఫార్సులు

Monday 1st July 2019

స్వల్పకాలంలో 20 శాతం వరకు రాబడినిచ్చే ఐదు స్టాకులను అనలిస్టులు సిఫార్సు చేస్తున్నారు. 1. బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 145. స్టాప్‌లాస్‌ రూ. 104. గత గరిష్ఠాల నుంచి పతనమైన తర్వాత రూ. 115 వద్ద బాటమ్‌ అవుట్‌ అయింది. చార్టుల్లో బుల్లిష్‌ పాటర్న్‌ కనిపిస్తోంది. 2. పీఎన్‌బీ: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 89. స్టాప్‌లాస్‌ రూ. 74. కీలకమైన రూ.73 స్థాయినుంచి రీబౌండ్‌ చూపింది. చార్టుల్లో మార్నింగ్‌స్టార్‌

Most from this category