News


భారీ లాభాల్లో మారుతి, బజాజ్‌, ఐషర్‌

Friday 20th September 2019
Markets_main1568963693.png-28454

కేంద్రప్రభుత్వం అనుహ్యాంగా దేశీయ కంపెనీలపై కార్పోరేట్‌ ట్యాక్స్‌ను తగ్గించడంతో మార్కెట్‌లు శుక్రవారం ర్యాలీ చేస్తున్నాయి. నిఫ్టీ ఆటో ఇండెక్స్‌ మధ్యాహ్నాం 12.30 సమయానికి 7.48 శాతం లేదా 517.60 పాయింట్లు లాభపడి 7,438.20 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. ఈ ఇండెక్స్‌లో హెవీ వెయిట్‌ షేర్లయిన మారుతి సుజుకీ 8.84 శాతం లేదా రూ. 528.05 లాభపడి రూ. 6,499.80     వద్ద, బజాజ్‌ ఆటో 6.50 శాతం లేదా రూ. 178.15 లాభపడి రూ. 2,730.00 వద్ద, ఐషర్‌ మోటర్స్‌ 13.19 శాతం లేదా రూ. 2,077.50 లాభపడి రూ. 17,830.00 వద్ద ట్రేడవుతున్నాయి. మిగిలిన షేర్లలో అశోక్‌ లేలాండ్‌ 13.70 శాతం, భారత్‌ ఫోర్జ్‌ 10.12 శాతం, టీవీఎస్‌ మోటర్స్‌ 10.00 శాతం, మదర్‌ సుమీ 7.87 శాతం,  ఎక్సైడ్‌ ఇండియా 7.72 శాతం, టాటా మోటర్స్‌ 7.69 శాతం, హీరో మోటర్‌ కార్ప్‌ 7.03 శాతం, అపోలో టైర్స్‌ 6.65 శాతం, అమర్‌రాజా బ్యాటరీస్‌ 6.63 శాతం, మహింద్రా అండ్‌ మహింద్రా (ఎం అండ్‌ ఎం) 5.72 శాతం, ఎంఆర్‌ఎఫ్‌ 4.70 శాతం, బోష్‌ 3.87 శాతం లాభపడి ట్రేడవుతున్నాయి.You may be interested

వువ్వెత్తున పెరిగిన హెవీవెయిట్స్‌

Friday 20th September 2019

మార్కెట్లో కొనసాగుతున్న కొనుగోళ్ల పర్వంలో అధిక వెయిటేజీ కలిగిన షేర్ల భారీ ర్యాలీ ఇండెక్స్‌లను పరుగులు పెట్టిస్తుంది. నిఫ్టీ -50 ఇండెక్స్‌లో అధిక వెయిటేజీ కలిగిన హెచ్‌డీఫ్‌సీ బ్యాంక్‌, రియలన్స్‌ ఇండస్ట్రీస్‌, హెచ్‌డీఎఫ్‌సీ, ఇన్పోసిస్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, టీసీఎస్‌, ఐటీసీ, కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌, ఎల్‌అండ్‌, యాక్సిస్‌ బ్యాంక్‌ షేర్లు భారీగా ర్యాలీ చేస్తున్నాయి. అధిక వెయిటేజీ షేర్ల ర్యాలీ(శాతాల్లో...) షేరు పేరు పెరిగిన శాతం హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ 8.50 శాతం రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ 6.66 శాతం హెచ్‌డీఎఫ్‌సీ 3.82 శాతం ఇన్పోసిస్‌ 1 శాతం ఐసీఐసీఐ బ్యాంక్‌ 8.74

ఐదేళ్ల కనిష్ఠానికి ‘జీ’

Friday 20th September 2019

సుభాష్‌ చంద్ర నాయకత్వంలోని ఎస్సెల్‌ గ్రూప్‌కు చెందిన జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ షేర్లు శుక్రవారం ట్రేడింగ్‌లో భారీగా నష్టపోయి బీఎస్‌ఈలో ఐదేళ్ల కనిష్ఠానికి పడిపోయాయి. రుణాన్ని తిరిగి చెల్లించడానికి సుభాష్‌ చంద్ర ప్రైవేట్ సంస్థలకు మరికొంత సమయం ఇవ్వాలా వద్దా అనే అంశంపై మ్యూచువల్ ఫండ్స్ తమలో తాము గొడవ పడుతుండటంతో ఎస్సెల్ గ్రూప్ ప్రమోటర్ల రుణ ఒత్తిళ్లు తీవ్రమవుతున్నాయి. ఫలితంగా శుక్రవారం ఉదయం 10.57 సమయానికి 9.65 శాతం నష్టపోయి

Most from this category