News


లాభాల్లో ఆటో షేర్లు..

Friday 26th July 2019
Markets_main1564133280.png-27333

వరుస పతనాల తర్వాత మార్కెట్లు శుక్రవారం పాజిటివ్‌గా ట్రేడవుతున్నాయి. నిఫ్టీ ఆటో ఇండెక్స్‌ 2.44 శాతం లాభపడి 7,181.80 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. ఈ ఇండెక్స్‌లో ఐషర్‌ మోటర్స్‌ 5.62 శాతం, టీవీఎస్‌ మోటర్స్‌ 4.19 శాతం, బజాజ్‌ ఆటో 3.79 శాతం, హీరో మోటర్‌ కార్ప్‌ 3.67 శాతం, మహింద్రా అండ్‌ మహింద్రా (ఎం అండ్‌ ఎం)  2.80 శాతం, అశోక్‌ లేలాండ్‌ 2.70 శాతం, అమర్‌రాజా బ్యాటరీస్‌ 2.21 శాతం,   భారత్‌ ఫోర్జ్‌ 2.05 శాతం, ఎక్సైడ్‌ ఇండియా 1.82 శాతం, మారుతి 1.67 శాతం, అపోలో టైర్స్‌ 1.58 శాతం, ఎంఆర్‌ఎఫ్‌1.08 శాతం,  టాటా మోటర్స్‌ 0.90 శాతం, బోచ్‌ లి. 0.23 శాతం  లాభపడి ట్రేడవుతుండగా, మదర్‌ సుమీ మాత్రం 0.09 శాతం నష్టపోయి ట్రేడవుతోంది.  



You may be interested

మెసేజ్‌ పంపినంత సులువుగా నగదు బదలీ..!

Friday 26th July 2019

పూర్తి స్థాయిలో అందుబాటులోకి మెసేజీ పంపినంత సులువుగా నగదు బదిలీ న్యూఢిల్లీ: మెసేజింగ్ యాప్ వాట్సాప్‌ ఈ ఏడాది ఆఖరు నాటికల్లా నగదు చెల్లింపుల సేవలను దేశవ్యాప్తంగా పూర్తి స్థాయిలో అందుబాటులోకి తేనున్నట్లు సంస్థ గ్లోబల్ హెడ్ విల్‌ కాథ్‌కార్ట్‌ వెల్లడించారు. మెసేజి పంపినంత సులువుగా నగదు బదిలీ ప్రక్రియను సులభతరం చేయాలన్నది తమ లక్ష్యమని ఆయన వివరించారు. "యూపీఐ ప్రాతిపదికన భారతీయ బ్యాంకులతో కలిసి పేమెంట్స్ వ్యవస్థను రూపొందించాం. దీన్ని సరిగ్గా

జెట్‌ ఎయిర్‌వేస్‌పై ఇండిగో కన్ను

Friday 26th July 2019

టీపీజీ క్యాపిటల్‌తో కలసి బిడ్‌ వేసే యోచన రంగంలోకి అపోలో గ్లోబల్‌ మేనేజ్‌మెంట్‌ న్యూఢిల్లీ: జెట్‌ ఎయిర్‌వేస్‌కు మళ్లీ మంచి రోజులు వచ్చేట్టున్నాయి. రుణాలు తీర్చలేక, చేతిలో చిల్లిగవ్వ లేక ఈ సంస్థ కార్యకలాపాలు నిలిపివేసిన విషయం తెలిసిందే. దీంతో ఈ సంస్థకు రూ.8000 కోట్లకు పైగా రుణాలు ఇచ్చిన బ్యాంకులు వాటిని వసూలు చేసుకునేందుకు మార్గంగా జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్‌లో పిటిషన్‌ వేయడం తెలిసిందే. ఓ పరిష్కార నిపుణుడిని నియమించి,

Most from this category