News


నష్టాల బాటలో అటో షేర్లు

Wednesday 24th July 2019
Markets_main1563959644.png-27283

ఐదో రోజూ కొనసాగుతున్న మార్కెట్‌ పతనంలో భాగంగా ఆటో షేర్లు బుధవారం నష్టాల బాట పట్టాయి. ఎన్‌ఎస్‌ఈలో అటో షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ అటో ఇండెక్స్‌ నేడు 2శాతం క్షీణించింది. నేడు ఇండెక్స్‌ 7,162.85 వద్ద ట్రేడింగ్‌ ప్రారంభించింది. మార్కెట్‌ ప్రారంభం నుంచి అటో షేర్లలో అమ్మకాలు విరివిరిగా జరగడంతో ఇండెక్స్‌ ఒకదశలో దాదాపు 2శాతం క్షీణించి 7,039.65 వద్ద ఇంట్రాడే కనిష్టానికి పతనమైంది. ఇండెక్స్‌లోని అధిక వెయిటేజీ కలిగి అశోక్‌లేలాండ్‌, టాటామోటర్స్‌ షేర్ల 3శాతం, మారుతి 1శాతం పతనం ఇండెక్స్‌కు క్షీణతకు కారణమైంది. మధ్యాహ్నం గం.2:20నిల.కు ఇండెక్స్‌ గతముగింపు(7,176.65)తో పోలిస్తే 1.75 శాతం నష్టం‍తో 7,051.15 వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఇదే సమయానికి ఇండెక్స్‌లోని అత్యధికంగా ఐషర్‌మోటర్స్‌, అశోక్‌లేలాండ్‌ షేర్లు 3.50శాతం క్షీణించాయి. టాటామోటర్స్‌ 3శాతం, హీరోమోటోకార్ప్‌, భాష్‌ లిమిటెడ్‌ షేర్లు 2.50శాతం నష్టపోయాయి. అలాగే ఎక్సైడ్‌, టాటామోటర్స్‌, అపోలో టైర్స్‌, ఎంఅండ్‌ఎం షేర్లు 2శాతం పతనమయ్యాయి. మారుతి సుజుకీ ఇండియా 1.50శాతం, భారతీఫోర్జ్‌ 1శాతం నష్టపోయాయి. మరోవైపు ఇదే ఇండెక్స్‌లోని అమరరాజా బ్యాటరీస్‌ 1శాతం లాభపడింది. అలాగే ఎంఆర్ఎఫ్‌, బజాజ్‌ అటో షేర్లు అరశాతం పెరిగాయి.



You may be interested

యస్‌ బ్యాంక్‌కు 100 ఫండ్‌ మేనేజర్లు గుడ్‌బై

Wednesday 24th July 2019

‘గత ఏడాది కాలంలో 100 మ్యూచువల్ ఫండ్ నిర్వాహకులు యస్ బ్యాంక్‌లో తమ వాటాను పూర్తిగా విక్రయించుకున్నారు’ అని మార్నింగ్‌ స్టార్‌ ఇండియా తెలిపింది. జూన్ 2018 లో 227 మ్యూచువల్ ఫండ్ పథకాల పోర్ట్‌ఫోలియోలో యెస్ బ్యాంక్‌ ఉండగా, జూన్ 2019 నాటికి ఈ మ్యూచువల్‌ ఫండ్‌ల సంఖ్య 132 కు పడిపోయిందని వివరించింది. యస్ బ్యాంక్‌ స్టాకు విలువ గణనీయంగా కూడా తగ్గడం ఈ పతనానికి ఒక

టాటా మోటర్స్‌ 3 శాతం పతనం..

Wednesday 24th July 2019

టాటా మోటర్స్‌ రేటింగ్‌ను అంతర్జాతీయ రేటింగ్‌ సంస్థ ఫిచ్‌ బీబీ నుంచి బీబీ మైనస్‌కు తగ్గించడంతో బుధవారం మధ్యహ్నాం 2.17 సమయానికి ఈ షేరు విలువ 2.85 శాతం నష్టపోయి రూ. 151.75 వద్ద ట్రేడవుతోంది. ఇదే సమయానికి ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 49.55 పాయింట్లు కోల్పోయి 11,281.50 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. టాటా మోటర్స్‌ లాభదాయకత, ద్రవ్యలభ్యత ఆందోళన కారణంగా రేటింగ్‌ను తగ్గించామని ఫిచ్‌ వివరించింది. జెఎల్‌ఆర్‌(జాగ్వార్‌ లాండ్‌ రోవర్‌)

Most from this category