News


ఆటో షేర్ల భారీ పతనం

Friday 5th July 2019
Markets_main1562324742.png-26831

బడ్జెట్‌లో ఆటో రంగానికి అనుకున్నంత చేయూత లేకపోవడంతో పాటు అంతర్జాతీయంగా తయారి రంగం మందగించడంతో  నిఫ్టీ ఆటో సూచీ శుక్రవారం ట్రేడింగ్‌లో 228.10 పాయింట్లు నష్టపోయి 7,849.10 పాయింట్ల వద్ద ముగిసింది. ఎం అండ్‌ ఎం 4.73 శాతం నష్టపోయింది. ఇండెక్స్‌లో బాగా నష్టపోయిన షేరు ఇదే. దీనితో పాటు భారత్‌ ఫోర్జ్‌ 4.19 శాతం, హీరో మోటర్‌ కార్ప్‌ 3.85 శాతం , అశోక్‌ లేలాండ్‌ 3.45 శాతం, టాటా మోటర్స్‌ 3.24 శాతం, మారుతి 3.43 శాతం, మదర్‌ సుమీ 3.04శాతం, బోచ్‌ లి.2.47 శాతం, టీవీఎస్‌ మోటర్స్‌ 2.20 శాతం మేర నష్టపోయాయి. వీటితో పాటు అపోలో టైర్స్‌ (2.06 శాతం), బజాజ్‌ ఆటో (1.89 శాతం), ఎక్సైడ్‌ ఇండియా (1.45  శాతం), ఎయిచర్‌ మోటర్స్‌ (1.14శాతం), అమర్‌రాజా బ్యాటరీస్‌ (0.57  శాతం), ఎంఆర్‌ఎఫ్‌ (0.51 శాతం) కూడా నష్టపోయిన షేర్లలో ఉన్నాయి. 



You may be interested

ఇక ముందు వాటాదారులకు మరిన్ని డివిడెండ్లు 

Friday 5th July 2019

ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ లిస్టెడ్‌ కంపెనీలకు రుచించని నిర్ణయాన్ని బడ్జెట్లో ప్రతిపాదించారు. అది షేర్ల బైబ్యాక్‌ (వాటాదారుల నుంచి కంపెనీలు షేర్లను తిరిగి కొనుగోలు చేయడం)పై 20 శాతం పన్ను విధింపు. 2007లో ప్రభుత్వం వాటాదారులకు కంపెనీలు చేసే డివిడెండ్‌ చెల్లింపులపై 10 శాతం పన్నును తీసుకొచ్చింది. ఆ తర్వాత దీన్ని 15 శాతానికి పెంచగా, అన్ని రకాల పన్నులు కలిపి ప్రస్తుతం 20 శాతంగా అమల్లో ఉంది.

మార్కెట్‌ను మెప్పించని బడ్జెట్‌

Friday 5th July 2019

395 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్‌  135.60 పాయింట్లను కోల్పోన నిఫ్టీ  బడ్జెట్‌ స్టాక్ మార్కెట్‌ను మెప్పించలేకపోయింది. నేడు మోదీ 2.0 ప్రభుత్వం ప్రవేశపెట్టిన తొలి బడ్జెట్‌లో లిస్టెడ్‌ కంపెనీల్లో పబ్లిక్‌ వాటా పెంపు, ప్రభుత్వ కంపెనీల్లో భారీ స్థాయిలో నిధుల ఉపసంహరణ, ఆర్థిక లోటు కట్టడి, విదేశీ రుణాలు లాంటి ప్రతికూలాంశాలు ఇన్వెస్టర్లను నిరుత్సాహపరిచాయి. ఫలితంగా సెన్సెక్స్‌ 394.67 పాయింట్లు నష్టపోయి 39,513.39 వద్ద, నిఫ్టీ 135.60 పాయింట్లను కోల్పోయి 11,811.20 వద్ద

Most from this category