News


వచ్చే ఏడాదికి నిఫ్టీ@13400!

Wednesday 9th October 2019
Markets_main1570615044.png-28786

ఐసీఐసీఐ సెక్యూరిటీస్‌ అంచనా
ప్రస్తుతం నిఫ్టీ పైకి పెరగడానికి ఆపసోపాలు పడుతున్నా, త్వరలో తిరిగి వేగం పుంజుకుంటుందని ఐసీఐసీఐ సెక్యూరిటీస్‌ అభిప్రాయపడింది. సంవత్సర కాలానికి నిఫ్టీ టార్గెట్‌ను 13400 పాయింట్లుగా నిర్ణయించింది. అంటే ఇప్పుడున్న స్థాయిల నుంచి దాదాపు 20 శాతం పెరుగుతుందని అంచనా వేసింది. దేశీయ డిమాండ్‌ రికవరీ వచ్చినకొద్దీ నాణ్యమైన కంపెనీల స్టాకులు జోరు చూపుతాయని తెలిపింది. సంవత్సర కాలానికి బంధన్‌ బ్యాంక్‌, అల్ట్రాటెక్‌ సిమెంట్‌, ఎల్‌అండ్‌టీ, సీమెన్స్‌, ఎన్‌ఎండీసీ, గ్రీన్‌లామ్‌, టీవీఎస్‌ మోటర్స్‌, గెలాక్సీ సర్ఫాక్టెంట్స్‌, డాబర్‌, జేబీ కెమికల్స్‌ షేర్లపై బుల్లిష్‌గా ఉన్నట్లు తెలిపింది. ఈ త్రైమాసిక ఆరంభం నుంచి వీఐఎక్స్‌, గోల్డ్‌ ధరలు అప్‌మూవ్‌లో ఉన్నాయి. దీంతో మార్కెట్లో తీవ్ర ఒడిదుడుకులు నమోదవుతున్నాయి. కానీ ఆర్థిక సంవత్సరం ద్వితీయార్ధానికి ఇవన్నీ సర్ధుకుంటాయని, పాజిటివ్‌ అంశాలు వెలుగులోకి వస్తాయని బ్రోకరేజ్‌ సంస్థ అభిప్రాయపడింది. ప్రస్తుత ఈక్విటీ పతనానికి అంతర్జాతీయ మందగమనం, ఈక్విటీ పతనాలు మేజర్‌కారణాలని తెలిపింది. 
ఇకపై అంతా పాజిటివ్‌...
పన్ను రాయితీల ప్రకటన తర్వాత 500 కంపెనీల్లో 212 స్టాకులు దాదాపు 8 శాతం పెరిగాయని, వీటిలో 85 స్టాకులు ఈ లాభాలన్నీ వెంటనే కోల్పోయాయని, 51 షేర్లు నెగిటివ్‌ జోన్‌లోకి మరలాయని వివరించింది. అయితే ఎక్కువ శాతం స్టాకులు మాత్రం ర్యాలీ లాభాల్లో ఎక్కువ శాతాన్ని నిలుపుకోగలిగాయని తెలిపింది. అన్నిరంగాల్లో గ్రోత్‌, క్వాలిటీ స్టాకులు పాజిటివ్‌గానే ఉంటున్నాయని పేర్కొంది. క్రమంగా రిస్క్‌ విస్తృతిలు తగ్గుతున్నాయని తెలిపింది. యూఎస్‌లో వృద్ధి కాస్త మందగించడంతో వడ్డీరేట్ల తగ్గింపునకు ఫెడ్‌కు అవకాశాలు పెరిగాయని తెలిపింది. వచ్చే నెల్లో యూరప్‌లో ఆరంభమయ్యే క్యుఈ2 ఉద్దీపనలతో అంతర్జాతీయ లిక్విడిటీ పెరుగుతుందని బ్రోకింగ్‌ సంస్థ తెలిపింది. దేశీయంగా కూడా ఆర్‌బీఐ తక్కువ రేట్లకు అనుకూలంగా ఉందని, ఇవన్నీ క్రమంగా ఈక్విటీ ఇన్వెస్టర్లకు ప్రయోజనం చేకూరుస్తాయని అభిప్రాయపడింది. ఆర్థిక సంవత్సరం ద్వితీయార్ధంలో జీడీపీ 7 శాతం వృద్ధి నమోదు చేయవచ్చని అంచనా వేసింది. ఇందుకు ప్రభుత్వ వ్యయం పెరగడం, క్రూడ్‌ ధరలు చల్లబడడం, సామర్ధ్య వినియోగం పెరగడం, ఈకామ్‌ చానెళ్ల ద్వారా విక్రయాలు పెరగడం వంటివి జీడీపీ పెరుగుదలకు దోహదం చేస్తాయని వివరించింది. 


 You may be interested

పతనానికి బ్రేక్‌...సెన్సెక్స్‌ 645, నిఫ్టీ 186 పాయింట్ల ర్యాలీ

Wednesday 9th October 2019

అంతర్జాతీయ పరిణామాలు అనుకూలంగా మారడంతో దేశీయ ఈక్విటీ మార్కెట్లు బుధవారం ట్రేడింగ్‌లో భారీ లాభాలతో ముగిశాయి. ఆరు ట్రేడింగ్‌ సెషన్ల నుంచి అదేపనిగా పడుతూవస్తున్న స్టాక్‌ సూచీలు ఈ రోజు కనిష్టస్థాయి వద్ద కొనుగోలు మద్దతును పొందగలిగాయి. సెషన్‌ ప్రారంభంలో నిఫ్టీ 11,090 స్థాయికి, సెన్సెక్స్‌ 37,415.83 స్థాయికి పడిపోగా, షార్ట్‌ కవరింగ్‌లు జరగడంతో పాటు, బ్యాంకింగ్‌, ఫైనాన్స్‌ స్టాకుల ర్యాలీ తోడవ్వడంతో నీఫ్టీ 11,300 స్థాయిని, సెన్సెక్స్‌ 38,100 స్థాయిని అధిగమించగలిగాయి. గత

పాజిటివ్‌గా మెటల్‌ షేర్లు..ఎన్‌ఎండీసీ 4% అప్‌

Wednesday 9th October 2019

దేశీయ ఈక్విటీ మార్కెట్లు బుధవారం ట్రేడింగ్‌లో పాజిటివ్‌గా ట్రేడవుతున్నాయి. కొనుగోళ్ల మద్ధతు లభించడంతో మధ్యాహ్నాం 1.58 సమయానికినిఫ్టీ మెటల్‌ ఇండెక్స్‌ 1.67 శాతం లాభపడి 2,307.75 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. ఈ ఇండెక్స్‌లో  నేషనల్‌ మినరల్‌ డెవలప్‌మెంట్‌ కార్పోరేషన్‌(ఎన్‌ఎమ్‌డీసీ) 4.86 శాతం, జిందాల్‌ స్టీల్‌ 3.70 శాతం, వేదాంత 2.28 శాతం, ఏపీఎల్‌ అపోలో ట్యూబ్స్‌ 2.08 శాతం, జేఎస్‌డబ్యూ స్టీల్‌ 2.07 శాతం,  హిందల్కో ఇండస్ట్రీస్‌ 1.95 శాతం,

Most from this category