News


లాభాల ప్రారంభం

Monday 14th October 2019
Markets_main1571026112.png-28862

అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలను అందిపుచ్చుకున్న దేశీయ మార్కెట్‌ సోమవారం లాభంతో మొదలైంది. సెన్సెక్స్‌ 100 పాయింట్ల లాభంతో 38,227 వద్ద, నిఫ్టీ 30 పాయింట్లు పెరిగి 11,335.90 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించించాయి. అగ్రరాజ్యాలైన అమెరికా చైనాల మధ్య 15నెలల సుధీర్ఘ వాణిజ్య యుద్ధానికి ఉపశమనంగా శుక్రవారం ఇరుదేశాల మధ్య పాక్షిక ఒప్పందం కుదిరింది. ఫలితంగా గతవారంలో అమెరికా మార్కెట్లు దాదాపు 1శాతం లాభంతో ముగియగా, నేడు ఆసియా మార్కెట్లు లాభాల బాట పట్టాయి. ఈ నేపథ్యంలో నేడు దేశీయ సూచీలు సైతం అదే ట్రెండ్‌ను కొనసాగిస్తున్నాయి. ఫారెక్స్‌ మార్కెట్లో డాలర్‌ మారకంలో రూపాయి విలువ 14 పైసలు బలపడి 70.88 వద్ద ప్రారంభమైంది. ఉదయం గం.9:30లకు సెనెక్స్‌ 23 పాయింట్ల లాభంతో 38,150 వద్ద, నిఫ్టీ 15 పాయింట్ల లాభంతో 11,319.70 వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఫార్మా, ప్రైవేట్‌ బ్యాంకింగ్‌, రియల్టీ, మెటల్‌, అటో, ఎఫ్‌ఎంజీసీ షేర్లకు కొనుగోళ్లకు మద్దతు లభిస్తోంది. మరోవైపు ఐటీ, ప్రభుత్వరంగ బ్యాంకింగ్‌, మీడియా, ఆర్థిక రంగ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనవుతున్నాయి. 

ఐఓసీ, టాటా స్టీల్‌, జేఎస్‌డబ్ల్యూస్టీల్‌, వేదాంత, టాటామోటర్స్‌ షేర్లు 2శాతం నుంచి 4.50శాతం లాభపడ్డాయి. హీరోమోటోకార్ప్‌, జీ లిమిటెడ్‌, టీసీఎస్‌, యూపీఎల్‌, ఇన్ఫోసిస్‌ షేర్లు అరశాతం నుంచి 3శాతం నష్టపోయాయి. 



You may be interested

14 పైసలు బలపడిన రూపీ

Monday 14th October 2019

దేశీయ కరెన్సీ రూపీ, డాలర్‌ మారకంలో సోమవారం 14 పైసలు బలపడి 70.88 వద్ద ప్రారంభమైంది. కాగా ఇరాన్‌ ఆయిల్‌ ట్యాంకర్‌పై దాడి జరగడంతో శుక్రవారం సెషన్‌లో క్రూడ్‌ ఆయిల్‌ ధరలు పెరిగాయి. ఫలితంగా గత సెషన్లో రూపీ డాలర్‌ మారకంలో ప్రారంభ లాభాలను కోల్పోయి చివరికి 5 పైసలు బలపడి 71.02 వద్ద ప్లాట్‌గా ముగిసింది. గత సెషన్‌లో ఎన్‌ఎస్‌ఈలో రూపీ-డాలర్‌ అక్టోబర్‌ కాంట్రాక్ట్‌ 71.15 వద్ద ఉందని,

సోమవారం వార్తల్లోని షేర్లు

Monday 14th October 2019

వివిధ వార్తలకు అనుగుణంగా సోమవారం ప్రభావితమయ్యే కొన్ని ప్రధాన కంపెనీలు ఇన్ఫోసిస్‌:- క్యూ2 ఫలితాలను శుక్రవారం ఫలితాలను విడుదల చేసింది. ఫలితాలు మార్కెట్‌ వర్గాల అంచనాలకు తగ్గట్లుగానే ఉన్నాయి. క్యూ2లో నికర లాభం 2.2శాతం క్షీణించి రూ. 4,019 కోట్లుగా, ఆదాయం 3.8శాతం పెరిగి రూ.22,629 కోట్లుగా నమోదయ్యాయి. అవెన్యూ సూపర్‌ మార్ట్‌:- క్యూ2లో నికరలాభం 47.5శాతం వృద్ధి చెంది రూ.322.63 కోట్లను నమోదు చేసింది. ఆదాయం 22.26 శాతం వృద్ధిని సాధించి

Most from this category