News


నిఫ్టీ 120 పాయింట్లు, సెన్సెక్స్‌ 400 పాయింట్లు అప్‌

Tuesday 11th February 2020
Markets_main1581393920.png-31678

 

  • అంతర్జాతీయ మార్కెట్లను నుంచి సానుకూల సంకేతాలు
  • కలిసొచ్చిన క్రూడాయిల్‌ ధరల పతనం

దేశీయ మార్కెట్‌ రెండురోజుల వరుస నష్టాలకు స్వస్తి పలుకుతూ మంగళవారం లాభంతో మొదలైంది. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 203 పాయింట్ల లాభంతో  41,183.39 వద్ద, నిఫ్టీ 76 పాయింట్లు పెరిగి 12100 పైన 12,108.40వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. ట్రేడింగ్‌ మొదలైన కొద్ది నిముషాల్లోనే నిఫ్టీ 120 పాయింట్లకుపైగా, సెన్సెక్స్‌ 400 పాయింట్లకుపైగా జంప్‌చేశాయి.  ప్రపంచ ఈక్విటీ మార్కెట్లకు కరోనా వైరస్‌ వ్యాధి భయాలు కొంత వరకు తగ్గడంతో కొనుగోళ్లు జరిగాయి. నిన్నరాత్రి అమెరికా మార్కెట్‌ మరోసారి రికార్డు స్థాయిని అందుకోవడంతో పాటు నేడు ఆసియాలో ఈక్విటీ మార్కెట్లు 1శాతం వరకు లాభపడటం దేశీయ మార్కెట్‌కు కలిసొచ్చింది. అలాగే అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్‌ ధరలు మరోసారి 13నెలల కనిష్టానికి రావడంతో పాటు నేడు ఫారెక్స్‌ మార్కెట్లో డాలర్‌ మారకంలో రూపాయి విలువ 7పైసల లాభంతో ట్రేడింగ్‌ను ప్రారంభించడం ఇన్వెస్టర్లకు ఉత్సాహనిచ్చింది. 

ఉదయం గం.9:20ని.లకు సెన్సెక్స్‌ 367 పాయింట్ల లాభంతో 41,346.64 వద్ద, నిఫ్టీ 111 పాయింట్లు పెరిగి 12,142.65 వద్ద ట్రేడ్‌ అవుతున్నాయి. అన్నిరంగాలకు చెందిన షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభిస్తోంది. అత్యధికంగా మెటల్‌, అటో షేర్ల లాభపడ్డాయి. ప్రభుత్వ, ప్రైవేట్‌ రంగ బ్యాంకింగ్‌ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో ఎన్‌ఎస్‌ఈలో కీలకమైన బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ 326.05( 1.05శాతం)పాయింట్లు పెరిగి 31,384.20 వద్ద ట్రేడ్‌ అవుతోంది. 

ఇదే సమయానికి నిఫ్టీ-50 ఇండెక్స్‌లో ... హిందాల్కో, టాటాస్టీల్‌, ఐటీసీ, టాటామోటర్స్‌, గెయిల్‌ షేర్ల 2శాతం నుంచి 3శాతం వరకు లాభపడ్డాయి. టెక్‌ మహీంద్రా, యస్‌బ్యాంక్‌ షేర్లు అరశాతం స్వల్ప నష్టాల్లో ట్రేడ్‌ అవుతున్నాయి. 



You may be interested

రూ.200 తగ్గిన పసిడి

Tuesday 11th February 2020

మంగళవారం బంగారం ధర స్వల్పంగా తగ్గింది. దేశీయ ఎంసీఎక్స్‌లో ఉదయం 10 గంటల ప్రాంతంలో నిన్నటి ముగింపు ధరతో పోలిస్తే రూ.200 తగ్గి 10 గ్రాముల పసిడి ధర రూ.40,455.00 వద్ద ట్రేడ్‌ అవుతోంది. అంతర్జాతీయ మార్కెట్‌లో నిన్నటిముగింపు ధరతో పోలిస్తే 8 డాలర్లు తగ్గి ఔన్స్‌ బంగారం ధర 1,571.45 డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. (సోమవారం బంగారం(స్పాట్‌) ముగింపు ధరల కోసం ఆయా నగరాల గుర్తులపై క్లిక్‌ చేయగలరు)  

సిగరెట్‌ ధరల పెంపుతో ఐటీసీ జూమ్‌!

Tuesday 11th February 2020

వివిధ సిగరెట్ల ధరలను వాటి పొడవు ఆధారంగా 10- 12 శాతం మేర పెంచుతున్నట్లు ఐటీసీ ప్రకటించింది. బడ్జెట్లో విధించిన పన్ను భారాన్ని తట్టుకునేందుకు కంపెనీ ఈ నిర్ణయం తీసుకుంది. సిగరెట్‌ ధరల పెంపు ప్రకటనతో మంగళవారం ఐటీసీ షేరు ఆరంభ ట్రేడింగ్‌లో దాదాపు 3 శాతం లాభపడింది. సోమవారం క్లోజింగ్‌ రూ. 210.55 కాగా, మంగళవారం రూ. 216.50 వద్ద ఆరంభమైన ఐటీసీ షేరు రూ.216.95 గరిష్ఠాన్ని, రూ.213.85

Most from this category