News


11,800 శిఖరంపై నిఫ్టీ

Tuesday 16th April 2019
Markets_main1555403673.png-25165

మార్కెట్‌ చరిత్రలో మొదటిసారిగా ఎన్‌ఎస్‌ఈ ప్రధాన సూచి నిఫ్టీ-50....11,800 పాయింట్ల శిఖరాన్ని అధిరోహించింది. గతేడాది ఆగస్టులోనూ, ఈ ఏడాది మార్చిలోనూ 11,760 పాయింట్ల స్థాయి వరకూ పెరిగినప్పటికీ, 11,800 పాయింట్ల స్థాయిని అందుకోలేక దిగిపోయింది. అయితే ఈ మంగళవారం ట్రేడింగ్‌ ప్రారంభం నుంచి దూకుడు ప్రదర్శించిన నిఫ్టీ ఎట్టకేలకు ఈ ప్రధాన స్థాయిని చేరగలిగింది. నిఫ్టీ తాజా ఫీట్‌ సాధించడానికి బ్యాంకింగ్‌ షేర్లు ప్రధానంగా సహకరించాయి. ఈ మధ్యాహ్న సెషన్‌లో 2 గంటల సమయానికి 114 పాయింట్లు జంప్‌చేసిన నిఫ్టీ 11,804 పాయింట్ల వద్దకు చేరింది. 



You may be interested

జీవితకాల గరిష్టానికి చేరువలో ఐసీఐసీఐ బ్యాంక్‌

Tuesday 16th April 2019

ప్రైవేట్‌రంగ బ్యాంకింగ్‌ దిగ్గజం ఐసీఐసీఐ బ్యాంకు షేర్లు మంగళవారం ట్రేడింగ్‌లో జీవితకాల గరిష్టస్థాయికి చేరువులో ట్రేడ్‌ అవుతున్నాయి. నేడు ఎన్‌ఎస్‌ఈలో ఈ కంపెనీ షేర్లు రూ.397.50ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీ గోల్డ్‌మెన్ సాచెస్ రానున్న రోజుల్లో ఐసీఐసీఐ బ్యాంకు కార్పోరేట్ వ్యాపార రంగంలో ఆదాయాలను ఆర్జించడంలో తిరుగులేని ప్రత్యామ్నాయ శక్తిగా అవతరిస్తుందని అభిప్రాయపడింది. 2020-21 ఆర్థిక సంవత్సరం నాటికి కంపెనీ ఆస్తులపై ఆదాయాలు 1.8శాతం, ఈక్విటీలపై

పీసీ జ్యువెల్లర్స్‌ 18శాతం జూమ్‌

Tuesday 16th April 2019

పీసీ జ్యువెల్లర్స్‌ షేర్లు వరుసగా నాలుగో ట్రేడింగ్‌ సెషన్స్‌లో లాభపడ్డాయి. నేటి బీఎస్‌ఈలో ట్రేడింగ్‌లో 18శాతం ర్యాలీ చేశాయి. విదేశీ సంస్థాగత ఇన్వెస్టింగ్‌ సంస్థ కర్లినా ఓపెన్‌ మార్కెట్‌ ద్వారా షేరు ధర రూ.105.73 ధర వద్ద ఏప్రిల్‌ 10న 37లక్షల ఈక్విటీ షేర్లను రూ.35 కోట్లకు, ఏప్రిల్‌ 14న అదే కంపెనీ 47లక్షల ఈక్విటీ షేర్లను రూ.46 కోట్లకు కొనుగోలు చేసినట్లు తెలిసింది. ఈ మొత్తం ఈక్విటీ షేర్ల వాటా

Most from this category