News


గ్యాప్‌అప్‌ ఓపెనింగ్‌

Monday 19th August 2019
Markets_main1566185922.png-27841

అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల సంకేతాల ప్రభావంతో భారత్‌ స్టాక్‌ సూచీలు సోమవారం గ్యాప్‌అప్‌తో మొదలయ్యాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 135 పాయింట్లు జంప్‌చేసి 37,485 పాయింట్ల వద్ద మొదలుకాగా, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 47 పాయింట్ల పెరుగుదలతో 11,095 పాయింట్ల వద్ద ఆరంభమయ్యింది. ఇండియాబుల్స్‌ హౌసింగ్‌ 3 శాతం లాభాలతోనూ, టైటాన్‌, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, డాక్టర్‌ రెడ్డీస్‌,  సన్‌ఫార్మాలు 1-2 శాతం మధ్య లాభాలతోనూ ట్రేడింగ్‌ ప్రారంభించాయి. మరోవైపు టాటా మోటార్స్‌, యూపీఎల్‌, బ్రిటానియా, ఆసియన్‌ పెయింట్స్‌ స్వల్పంగా నష్టపోయాయి. ఇక అసియా మార్కెట్లు....అమెరికా-చైనాల మధ్య వాణిజ్య చర్చలు పునర్‌ప్రారంభమవుతాయన్న అంచనాలతో పాజిటివ్‌గా ట్రేడవుతునన్నాయి. ప్రజాందోళనలతో అట్టుడుకుతున్న హాంకాంగ్‌లోని హాంగ్‌సెంగ్‌ సూచీ అన్నింటికంటే అధికంగా 1.8 శాతం పెరిగింది. చైనా షాంఘై సూచి 1 శాతం లాభపడగా, జపాన్‌, తైవాన్‌, కొరియా, సింగపూర్‌ స్టాక్‌ సూచీలు 0.7 శాతం వరకూ పెరిగాయి. 



You may be interested

సోమవారం వార్తల్లోని షేర్లు

Monday 19th August 2019

వివిధ వార్తలకు అనుగుణంగా సోమవారం ప్రభావితమయ్యే షేర్ల వివరాలు  కాఫీ డే ఎంటర్‌ప్రైజెస్‌:- సంస్థ రుణాలపై స్పష్టతనిచ్చింది. ఈ ఏడాది జూలై 31నాటికి సంస్థకు మొత్తం రూ. 4,970 కోట్ల రుణాలున్నట్లు తెలిపింది. గ్లోబల్‌ విలేజ్‌ టెక్‌ పార్క్‌ను బ్లాక్‌స్టోన్‌ సంస్థకు విక్రయంతో వచ్చిన నిధుల ద్వారా మొత్తం రుణాన్ని రూ.2400 కోట్లకు పరిమితం చేసుకోవాలని భావిస్తుంది. డీహెచ్‌ఎఫ్‌ఎల్‌:- ప్రస్తుత పరిస్థితులో క్యూ1 ఫలితాలను అనుకున్న తేదికి విడుదల చేయలేమని ప్రకటించింది. అయితే

మార్కెట్లు ముందుకా.. వెనక్కా..?

Sunday 18th August 2019

ఈక్విటీ మార్కెట్లు గత వారం కాస్త నిలదొక్కుకున్నాయి. నిఫ్టీ కీలకమైన 11,000 మార్క్‌పైన, బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 37,000పైనే క్లోజవడం గమనార్హం. కేంద్ర ప్రభుత్వం ఆర్థిక రంగ ఉద్దీపనకు పలు చర్యలను ప్రకటించొచ్చని, పలు రంగాలకు రాయితీలు ఉంటాయని, ఎఫ్‌పీఐలకు సర్‌చార్జీ మినహాయింపు ఉండొచ్చన్న అంచనాలే గత వారం మార్కెట్‌ను కుదురుకునేలా చేశాయి. ఈ నేపథ్యంలో ఈ వారం మార్కెట్‌ ఎలా ఉంటుందోనన్న సందేహం ఇన్వెస్టర్లలో నెలకొంది. దీనిపై యాక్సిస్‌ సెక్యూరిటీస్‌

Most from this category