News


సెన్సెక్స్‌@40000.. నిఫ్టీ@12000..

Thursday 23rd May 2019
Markets_main1558588798.png-25895

దేశీయ మార్కెట్లు చరిత్ర సృష్టించాయి. ఫస్ట్‌టైమ్‌ సెన్సెక్స్‌ 40వేల పాయింట్లను, నిఫ్టీ 12వేల పాయింట్లను తాకాయి. సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో భాజపా నేతృత్వంలోని ఎన్డీయే ఆధిక్యంలో దూసుకెళ్తుండటంతో దేశీయ మార్కెట్లు గురువారం జోరు చూపిస్తున్నాయి. మరోసారి ఎన్డీయే సర్కార్‌ ఖాయమన్న సంకేతాలతో నేటి ట్రేడింగ్‌ను సూచీలు రికార్డు స్థాయిలో లాభాలతో ప్రారంభించాయి. నిఫ్టీ 11901 పాయింట్ల వద్ద పయనం ఆరంభించింది. ఉదయం 10.38 సమయానికి నిఫ్టీ 12006 పాయింట్ల వద్ద, సెన్సెక్స్‌ 40018 పాయింట్ల వద్ద కొనసాగుతున్నాయి. బ్యాంకు నిఫ్టీలోని కీలక షేర్లు చెలరేగడంతో ఈ సూచీ దాదాపు వెయ్యికి పైగా పాయింట్ల లాభంలో ఉంది. ఐటీ మినహా దాదాపు అన్ని రంగాల షేర్లు లాభాల్లోనే ఉన్నాయి. రూపాయి సైతం బలపడింది. 
రికార్డు స్థాయికి ఎస్‌బీఐ
గతంలో మూడు మార్లు అడ్డుగా నిలిచిన కీలక నిరోధం రూ.350ను ఎస్‌బీఐ అధిగమించింది. గురువారం రికార్డు లాభాల ఆరంభంతో ఎస్‌బీఐ ట్రేడింగ్‌ను ప్రారంభించింది. రూ. 353 వద్ద ట్రేడింగ్‌ ఆరంభించిన ఎస్‌బీఐ ఇంట్రాడేలో 363 పాయింట్ల గరిష్ఠాన్ని తాకింది. ప్రస్తుతం 362 రూపాయల వద్ద కొనసాగుతోంది. ట్రిపుల్‌టాప్‌గా నిలిచిన రూ. 350ని దాటేయడంతో షేరులో అప్‌మూవ్‌ భారీగా ఉంటుందని, ఈ లాభాలు నిలబడాలంటే షేరు రూ. 350పైన మంచి వాల్యూంలతో బలంగా క్లోజవ్వాలని నిపుణులు చెబుతున్నారు. 



You may be interested

బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా 12 శాతం అప్‌

Thursday 23rd May 2019

గత ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో బ్యాంకు ఆఫ్‌ బరోడా నిరుత్సాహకరమైన ఫలితాలను ప్రకటించినప్పటికీ.., ఈ కంపెనీ షేర్లు గురువారం 12 శాతం లాభపడ్డాయి. నేడు బీఎస్‌ఈలో ఈ కంపెనీ షేర్లు రూ. 128.95ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. నేడు ప్రభుత్వరంగ షేర్ల ర్యాలీలో భాగంగా ఈ కంపెనీ షేర్ల కొనుగోళ్లకు మద్దతు లభించింది. ఫలితంగా షేరు 12 శాతం లాభపడి రూ.143.60ల వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. మధ్యాహ్నం

బ్యాంకు నిఫ్టీ 3 శాతం అప్‌

Thursday 23rd May 2019

సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ లెక్కింపులో గా కేంద్రంలో ఎన్‌డీఏ కూటమి స్పష్టమైన ఆధిక్యాన్ని ప్రదర్శిస్తున్న తరుణంలో మార్కెట్లలో కొనుగోళ్ల పర్వం కొనసాగుతుంది. బ్యాంకింగ్‌ షేర్లు అత్యధికంగా లాభపడుతున్నాయి. ఎన్‌ఎస్‌ఈలోని బ్యాంకు నిఫ్టీ ఇండెక్స్‌ 3శాతానికి పైగా పెరిగింది. ఇండెక్స్‌లో అత్యధికంగా బ్యాంకు ఆఫ్‌ బరోడా 10.50శాతం పెరిగింది. ఇండస్‌ ఇండ్‌ 7శాతం, ఎస్‌బీఐ 5శాతం, ఫెడరల్‌ బ్యాంకు 4.50శాతం, పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు, యస్‌ బ్యాంకు 4శాతం పెరిగాయి. కోటక్‌ బ్యాంకు

Most from this category