News


వచ్చే 3 వారాల కోసం 3 టాప్‌ స్టాకులు

Tuesday 19th November 2019
Markets_main1574144876.png-29700

-హెచ్‌డీఎఫ్‌సీ సెక్యురిటీష్‌, సీనియర్‌ టెక్నికల్‌ అండ్‌ డెరివేటివ్‌ ఎనలిస్ట్‌, నందిష్‌ షా 
   నిఫ్టీ, నవంబర్‌ సిరిస్‌ ప్రారంభం నుంచి 200 పాయింట్ల తక్కువ పరిధిలో ట్రేడవుతూ వస్తోంది. అయినప్పటికి వారపు చార్టులలో ఎంఏసీడీ(మూవింగ్‌ యావరేజ్‌ కన్వర్జన్స్‌ డైవర్జన్స్‌), డీఎంఐ(డైరక‌్షనల్‌ మూవ్‌మెంట్‌ ఇండెక్స్‌) ఇండికేటర్లు బుల్లిష్‌గా ఉన్నాయి. నిఫ్టీ తన 50, 100, 200 డీఎంఏ(డైలీ మూవింగ్‌ యావరేజ్‌)కి పైన ముగిసింది.అంతేకాకుండా టెక్నికల్‌ చార్టులో నిఫ్టీ హయ్యర్‌ టాప్స్‌ హయ్యర్‌ బాటమ్స్‌ నమూనాను ఏర్పారిచింది. ఈ అంశాలన్ని మార్కెట్‌ బుల్లిష్‌ ట్రెండ్‌లో ఉందనే సంకేతాన్ని ఇస్తున్నాయి. నిఫ్టీ కీలకనిరోధమైన 11,700 స్థాయిని అక్టోబర్‌ 29న అధిగమించింది. దీంతో నిఫ్టీ రోజువారి చార్టులో బుల్లిష్‌ ‘కప్‌ అండ్‌ హ్యాండిల్‌’ నమూనాను ఏర్పరిచింది. ముందు కీలక నిరోధంగా పనిచేసిన 11,700 స్థాయి, ప్రస్తుతం కీలక మద్ధతు స్థాయిగా పనిచేస్తోంది. 
   డెరివేటివ్‌ మార్కెట్‌లో... నిఫ్టీ 11,800-11,700 స్ర్టయిక్‌ ప్రైస్‌ వద్ద పుట్‌ రైటింగ్‌లు చూడొచ్చు. దీంతో నిఫ్టీకి 11,800-11,700 స్థాయిల వద్ద మద్ధతు లభిస్తోందనే విషయం అర్థమవుతోంది. ఈ స్థాయిల దిగువకు పడిపోతే కానీ, నిఫ్టీ బుల్లిష్‌ ట్రెండ్ మారదు. అందువలన డెరివేటివ్‌ మార్కెట్స్‌ కూడా బుల్లిష్‌గా ఉన్నాయనే సంకేతాలున్నాయి. అదేవిధంగా 12,000 స్థాయి వద్ద నిఫ్టీ కాల్‌ రైటింగ్స్‌ చూడొచ్చు. అందువలన ఈ స్థాయి కీలక నిరోధంగా పనిచేస్తోంది. ఈ స్థాయిని అధిగమించడానికి నిఫ్టీ గత కొన్ని సెషన్‌ల నుం‍చి ప్రయత్నిస్తోంది కానీ ఇప్పటికి అధిగమించలేదు. అయినప్పటికి ఈ స్థాయిని నిఫ్టీ స్వల్ప కాలంలోనే అధిగమిస్తుందని సాంకేతిక, డెరివేటివ్‌ ఇండికేటర్లు సూచిస్తున్నాయి. బ్యాంక్‌ నిఫ్టీని పరిశీలిస్తే, ఈ ఇండెక్స్‌ నవంబర్‌ సిరిస్‌ ప్రారంభం నుంచే నిఫ్టీని మించి ప్రదర్శన చేస్తోంది. బ్యాంక్‌ నిఫ్టీకి సంబంధించి గత వారంలో లాంగ్‌ పొజిషన్లు పెరిగాయి. ఇది వచ్చే వారం కూడా కొనసాగుతుందని అంచనావేస్తున్నాం. 30,300 స్థాయిని స్టాప్‌ లాస్‌గా పెట్టుకొని బ్యాంక్‌ నిఫ్టీలో లాంగ్‌పొజిషన్‌లు తీసుకోమని సలహాయిస్తున్నాం. బ్యాంక్‌ నిప్టీపై 31,800, 32,500 స్థాయిలను టార్గెట్‌గా నిర్ణయించాం. 
   చాలా వరకు కీలక ఇండెక్స్‌లు ఆల్‌టైం గరిష్ఠాలకు చేరుకోగా, స్మాల్‌ క్యాప్‌, మిడ్‌ క్యాప్‌ ఇండెక్స్‌లు మాత్రం అండర్‌పెర్ఫార్మ్‌ చేస్తున్నాయి. అయినప్పటికి కొన్ని సెషన్‌ల కిందట మిడ్‌క్యాప్‌ ఇండెక్స్‌ తన కీలక నిరోధమైన 16,880 స్థాయిని అధిగమించగలిగింది. అన్నిటికంటే ఈ త్రైమాసిక సీజన్‌లో స్మాల్‌క్యాప్‌ స్టాకులు అండర్‌పెర్ఫార్మ్‌ చేయడాన్ని చూశాం. ఈ స్టాకులు కూడా తమ ట్రెండ్‌ను మార్చుకుంటాయని ఆశిస్తున్నాం. 

వచ్చే వారం లేదా మూడు వారాలలో మంచి రిటర్న్‌లను ఇచ్చే టాప్‌ స్టాకులు..
గ్రాన్యుల్స్‌ ఇండియా: కొనచ్చు​; ప్రస్తుత ధర: రూ. 128.25; టార్గెట్‌ ధర: రూ.145; స్టాప్‌ లాస్‌: రూ. 120; అప్‌సైడ్‌: 13 శాతం
ఈ స్టాక్‌ గత కొన్ని సెషన్‌ల కిందట డౌన్‌వార్డ్‌ స్లోపింగ్‌ ట్రెండ్‌లైన్‌ను దాటింది. అంతేకాకుండా రోజువారి చార్టులో అక్టోబర్‌ 30, నవంబర్‌ 8 సెషన్‌లలో ఏర్పరిచిన గరిష్ఠ స్థాయికి చేరుకోగలిగింది. నెలవారి చార్టులో ఈ స్టాక్‌ తన కీలక నిరోధ స్థాయయిన రూ. 123ను అక్టోబర్‌ నెలలో అధిగమించింది. వారపు చార్టులో ఆర్‌ఎస్‌ఐ, ఎంఏసీడీ ఇండికేటర్లు కూడా ఈ స్టాక్‌ పాజిటివ్‌గా ఉందనే సంకేతాన్నిస్తున్నాయి. ప్రస్తుతం ఫార్మా సెక్టార్‌ మంచి ప్రదర్శన చేస్తోంది. స్వల్పకాలానికి గాను ఈ సెక్టార్‌ను పరిశీలించవచ్చు. 

చోళమండలం ఇన్వెస్ట్‌మెంట్‌ అండ్‌ ఫైనాన్స్‌ కంపెనీ: కొనచ్చు; ప్రస్తుత ధర: రూ. 329; టార్గెట్‌ ధర: రూ. 360; స్టాప్‌ లాస్‌: 310; అప్‌సైడ్‌: 9 శాతం
ఈ స్టాక్‌ తన కీలక నిరోధమైన రూ. 320 స్థాయిని అధిగమించి, 52 వారాల గరిష్ఠానికి చేరువలో ట్రేడవుతోంది. అంతేకాకుండా వారపు చార్టులో ఆర్‌ఎస్‌ఐ, ఎంఏసీడీ ఇండికేటర్లు ఈ స్టాక్‌ పాజిటివ్‌గా ఉందనే సంకేతాన్ని ఇస్తున్నాయి. డెరివేటివ్‌ విభాగంలో, ఈ స్టాక్‌ ప్యూచర్స్‌ కోసం అధికంగా లాంగ్‌ పొజిషన్‌లు ఏర్పడ్డాయి. ప్రస్తుతం ఈ స్టాక్‌ తన 5, 20, 200 రోజుల ఎస్‌ఎంఏ(సింప్లీ మూవింగ్‌ యావరేజ్‌)కి పైన ట్రేడవుతోంది. ఇది స్వల్ప కాలం నుంచి మధ్యస్థ కాలానికిగాను పాజిటివ్‌ ట్రెండ్‌ను సూచిస్తోంది. 

ర్యాలీస్‌ ఇండియా: కొనచ్చు; ప్రస్తుత ధర: రూ. 179.70; టార్గెట్‌ ధర: రూ. 200; స్టాప్‌ లాస్‌: రూ. 168; అప్‌సైడ్‌: 12 శాతం 
ఈ స్టాక్‌ రోజువారి చార్టులో హయ్యర్‌ టాప్‌-హయ్యర్‌ బాటమ్‌ నమూనాను ఏర్పరిచింది. అంతేకాకుండా ఈ స్టాక్‌ నిరోధ స్థాయయిన రూ. 177ను అధిగమించి, ప్రస్తుతం జనవరి 1 తర్వాత గరిష్ఠ స్థాయిని ఏర్పరిచింది. ప్రస్తుతం ఈ షేరు బుల్లిష్‌ ట్రెండ్‌లో కొనసాగుతోంది. అం‍తేకాకుండా ఈ స్టాక్‌ తన 5, 20, 200 రోజుల ఎస్‌ఎంఏ స్థాయికి పైన ట్రేడవుతోంది. రోజువారి, వారపు చార్టులలో ఆర్‌ఎస్‌ఐ, ఎంఏసీడీ ఇండికేటర్లు ఈ స్టాక్‌ పాజిటివ్‌గా కదలనుందనే సంకేతాలను ఇస్తున్నాయి. 

 



You may be interested

టెలికం షేర్లను కొనొచ్చా?

Tuesday 19th November 2019

కదం తొక్కుతున్న ఎయిర్‌టెల్‌, వీఐఎల్‌ షేర్లు మూడు సెషన్లుగా ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌ ఐడియా(వీఐఎల్‌) షేర్లు భారీ ర్యాలీ జరుపుతున్నాయి. క్యు2లో రికార్డు నష్టాలు ప్రకటించిన ఈ కంపెనీల షేర్లపై ఒక్కమారుగా ఇన్వెస్టర్లకు ఆసక్తి పెరిగింది. మంగళవారం ట్రేడింగ్‌లో వీఐఎల్‌ షేరు దాదాపు 30 శాతం, ఎయిర్‌టెల్‌ షేరు సుమారు 6 శాతం లాభపడ్డాయి. డిసెంబర్‌ 1 నుంచి టారిఫ్‌లు పెంచుతామని రెండు కంపెనీలు ప్రకటించాయి. దీంతో రెండు కౌంటర్లలో కొనుగోళ్ల జోరు

మారుతీ డీజిల్‌ కార్లకు భారీ డిమాండ్‌!

Tuesday 19th November 2019

డిస్కౌంట్లు, వారెంటీ కారణమంటున్న నిపుణులు మారుతీ సుజుకీ డీజిల్‌ కార్లకు అనూహ్యంగా డిమాండ్‌ పెరిగింది. ఏప్రిల్‌ నుంచి కొత్త ఉద్గార నిబంధనలు అమల్లోకి రానుండడంతో పలు డీజిల్‌ మోడళ్ల ఉత్పత్తిని మారుతీ గతంలో తగ్గించింది. తాజా డిమాండ్‌తో కంపెనీ కొన్ని డీజిల్‌ వేరియంట్ల ఉత్పత్తిని వేగవంతం చేసింది. బీఎస్‌ 6 నిబంధనలకు అనుగుణంగా కొత్త కార్లను తయారు చేసే ముందు ఉన్న సరుకును విక్రయించేందుకు మారుతీ పలు డిస్కౌంట్‌ ఆఫర్లు ప్రకటించింది.

Most from this category