STOCKS

News


కొత్త ఏడాది అంచనాలు నిలుస్తాయా?!

Saturday 28th December 2019
Markets_main1577526671.png-30497

వచ్చే వారం దేశీ స్టాక్‌ మార్కెట్లు కొత్త ఏడాదిలోకి అడుగుపెట్టనున్నాయి. ఇటీవల మార్కెట్లు సరికొత్త గరిష్టాలను తాకుతుండటంతో అంచనాలు పెరిగినట్లు విశ్లేషకులు చెబుతున్నారు. ఫిబ్రవరిలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న వార్షిక బడ్జెట్‌పై ఇన్వెస్టర్లు అత్యంత ఆశావహంగా ఉన్నట్లు తెలియజేశారు. అయితే వచ్చే వారం మార్కెట్లు గడిచిన వారాన్ని తలపిస్తూ ఒడిదొడుకులు చవిచూసే అవకాశమున్నట్లు సాంకేతిక నిపుణులు భావిస్తున్నారు. బడ్జెట్‌పై అంచనాలతో ఉన్న ఇన్వెస్టర్లు మెటల్స్‌, ఫార్మా, కన్జూమర్‌ డ్యురబుల్స్‌, ఎఫ్‌ఎంసీజీ రంగాలలోని పటిష్ట కంపెనీలవైపు దృష్టిసారించడం మేలు చేకూర్చగలదని అంచనా వేశారు.

12300 రెసిస్టెన్స్‌?
వచ్చే వారం ఎన్‌ఎస్‌ఈ ప్రధాన ఇండెక్స్‌ నిఫ్టీకి 12,300 పాయింట్ల స్థాయిలో రెసిస్టెన్స్‌(అవరోధం) ఎదురుకావచ్చని సాంకేతిక నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ స్థాయిలో లాభాల స్వీకరణకు చాన్స్‌ ఉన్నట్లు చెబుతున్నారు. వారపు చార్ట్‌ ప్రకారం నిఫ్టీ-50 డోజీ ప్యాటర్న్‌ను ప్రతిఫలిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇది అయోమయాన్ని(కన్‌ఫ్యూజన్‌) సృష్టిస్తున్నట్లు తెలియజేశారు. నిఫ్టీలో నెలకొన్న బలాన్ని చాలా రంగాలు ప్రతిబింబించడం లేదని చెప్పారు. దీంతో వచ్చే వారం స్టాక్‌ స్పెసిఫిక్‌ కదలికలకే ఆవకాశమున్నట్లు అభిప్రాయపడ్డారు. నిఫ్టీ 12,100 పాయింట్ల దిగువకు చేరితే.. అమ్మకాల ఒత్తిడి పెరగవచ్చని చెప్పారు. దీంతో 11,800 వరకూ నీరసించవచ్చని తెలియజేశారు. వారపు కనిష్టాలను స్టాప్‌లాస్‌గా పెట్టుకుని ట్రేడర్లు లాంగ్‌ పొజిషన్లు తీసుకోవచ్చని సూచిస్తున్నారు. 

పసిడి జోరు
అమెరికా, చైనా మధ్య వాణిజ్య వివాద పరిష్కారానికి వీలుగా ప్రాథమిక ఒప్పందంపై అవగాహన కుదరడం, యూకే ఎన్నికల ద్వారా బ్రెక్సిట్‌పై స్పష్టత వంటి సానుకూల అంశాల కారణంగా బంగారం ధరలు క్షీణించవలసి ఉన్నట్లు విశ్లేషకులు తెలియజేశారు. అయితే ఇటీవల బంగారం, వెండి యూటర్న్‌ తీసుకుని ర్యాలీ చేయడం గమనించదగ్గ అంశమని చెబుతున్నారు. ఇది ఒకరకంగా ఈక్విటీలకు హెచ్చరిక వంటిదని వ్యాఖ్యానించారు. ప్రధానంగా అమెరికా తదితర ఈక్విటీ మార్కెట్లలో లాభాల స్వీకరణకు అవకాశమున్నట్లు అభిప్రాయపడ్డారు.

2019 ఇలా..
ఇన్వెస్టర్లు మెచ్చని విధంగా కొన్ని హెవీవెయిట్స్‌ మాత్రమే లాభపడటం ద్వారా 2019లో ర్యాలీ వచ్చినట్లు మార్కెట్‌ నిపుణులు పేర్కొన్నారు. పలు బ్లూచిప్స్‌, మిడ్‌ క్యాప్‌ కౌంటర్లు ఇప్పటికీ వెనుకడుగులోనే ఉన్నట్లు తెలియజేశారు. ఇందుకు స్థూల ఆర్థిక వాతావరణం ప్రభావం చూపినట్లు చెప్పారు. దేశ జీడీపీ గత ఆరేళ్లలోనే కనిష్ట వృద్ధికి చేరడాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఇంతక్రితం 2015-16లోనూ ఇలాంటి పరిస్థితులు తలెత్తినప్పుడు మార్కెట్లు 20 శాతం క్షీణించాయి. అయితే జీడీపీ దాదాపు 8 శాతం వృద్ధి చూపింది. కాగా.. ఆర్థిక వ్యవస్థ నీరసించినప్పడు ఇన్వెస్ట్‌ చేసే పెట్టుబడిదారులు.. రికవరీ ప్రారంభమయ్యాక లాభాలు ఆర్జించేందుకు వీలుంటుంది. ప్రస్తుత ర్యాలీ ప్రకారం చూస్తే.. భవిష్యత్‌లో బలపడనున్న జీడీపీపై అంచనాలు ప్రభావం చూపుతున్నట్లు విశ్లేషకులు వివరించారు.You may be interested

3-4వారాల్లో 9శాతం ర్యాలీ చేసే షేర్లు ఇవే...!

Saturday 28th December 2019

నిఫ్టీ -50 ఇండెక్స్‌ 12000 స్థాయి వద్ద స్థిరమైన మద్దతు స్థాయిని ఏర్పాటు చేసుకునే పనిలో ఉందని ఐసీఐసీఐ డెరెక్టర్‌.కామ్‌ రిసెర్చ్‌ హెడ్‌ సాంకేతిక నిపుణుడు ధర్మేంద్ర షా అభిప్రాయపడుతున్నారు. కాల్‌ ఆప్షన్స్‌ పొజిషన్లు సైతం గరిష్టస్థాయి 12500 మార్చబడ్డాయని షా అంటున్నారు. ఈ నేపథ్యంలో 3-4వారాల్లో 9శాతం ర్యాలీ చేసే షేర్లను ఆయన సిఫార్సు చేశారు.  షేరు పేరు:- ఎస్‌బీఐ రేటింగ్‌:- కొనవచ్చు టార్గెట్‌ ధర:- రూ.360 స్టాప్‌ లాస్‌:- రూ.324 అప్‌ సైడ్‌:- 7శాతం  షేరు

డిసెంబర్‌ 31లోగా మీరు పూర్తిచేయాల్సిన ఆర్థిక వ్యవహారాలు..!

Saturday 28th December 2019

ఈ 2019 ఏడాది మరో 3రోజుల్లో ముగుస్తుంది. మనలో కొంతమంది సరికొత్త ఎజెండాలతో కొత్త ఏడాదికి స్వాగతం పలికేందుకు సంసిద్ధంగా ఉన్నారు. మీరు కూడా డిసెంబర్‌ 31లోగా ఈ 3 ఆర్థిక కర్తవ్యాలను పూర్తి చేసుకుని నూతన సంవత్సరానికి ఘనంగా స్వాగతం పలకండి. ఇంతకీ ఈ 3 ఆర్థిక కర్తవ్యాలు ఏమిటని ఆలోచిస్తున్నారా..? అయితే పూర్తి వివరాలకు కింద కథనాన్ని చదవండి.... పాన్‌కార్డును ఆధార్‌తో లింక్‌ చేసుకోండి:-  ఈ డిసెంబర్‌ 31వ తేదీకల్లా పాన్‌కార్డును

Most from this category