News


వచ్చే 18 నెలలూ మంచి ర్యాలీ: సంజీవ్‌ భాసిన్‌

Friday 1st November 2019
Markets_main1572548886.png-29267

భారీ ర్యాలీకి ఆరంభంలో మన మార్కెట్‌ ఉందన్నారు ఐఐఎఫ్‌ఎల్‌ సెక్యూరిటీస్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ సంజీవ్‌ భాసిన్‌. మిడ్‌క్యాప్‌ స్టాక్స్‌ ఎంతో ఆకర్షణీయంగా ఉన్నాయని, పెట్టుబడులకు మంచి అవకాశంగా పేర్కొన్నారు. ఓ వార్తా సంస్థకు ఈ మేరకు ఆయన ఇంటర్వ్యూ ఇచ్చారు.

 

‘‘నేను చెప్పిన విధంగానే ఈ 12 వారాల్లో (నవంబర్‌ నుంచి) మార్కెట్లో మంచి పెరుగుదల ఉంటుంది. సెన్సెక్స్‌ ఇప్పటికే నూతన గరిష్టాన్ని తాకింది. నిఫ్టీ కూడా నూతన గరిష్టాలకు వెళ్లడం ఎంతో సమయం పట్టదు. ఇన్వెస్టర్ల ప్రాతినిధ్యం, భయపడకుండా కొనుగోళ్లు చేయడమే ఇక్కడ గమనించాలి. మార్కెట్‌ క్షీణత సమయంలో ప్రభుత్వం తన వంతు చేయాల్సినది చేసింది. మిడ్‌క్యాప్స్‌ చాలా ఆకర్షణీయంగా ఉన్నాయి. దీర్ఘకాలం కోసం అయితే ఎటువంటి సందేహాలు అక్కర్లేదు. ఇండెక్స్‌ గమనంతో సంబంధం లేకుండా ఇన్వెస్ట్‌ చేసుకోవచ్చు. ప్రస్తుతం మంచి ఫలాలను అందుకునే స్థితిలో ఉన్నాం. మన స్థూల ఆర్థిక పరిస్థితులు మెరుగుపడడం మొదలైంది. కార్పొరేట్‌ పన్ను తగ్గింపు, వ్యూహాత్మకం పెట్టుబడుల ఉపసంహరణతో వచ్చే 18 నెలలూ మనకు అనుకూలంగా ఉంటుంది. అంతర్జాతీయంగానూ 2020 జనవరి నుంచి భారీ ర్యాలీ ఉంటుందని నా అంచనా. స్టాక్స్‌ కొనుగోళ్లు ఆరంభించేందుకు ఇది మంచి సమయం. 

 

మార్కెట్లు భవిష్యత్తును చూస్తుంటాయి. ప్రభుత్వం కార్పొరేట్‌ పన్ను తగ్గింపు రూపంలో ఇచ్చిన రూ.1.5 లక్షల కోట్ల ఉత్ప్రేరకం, వ్యూహాత్మక పెట్టుబడుల ఉపసంహరణ అన్నవి మార్కెట్‌ వ్యాప్త ర్యాలీకి పునాదులు వేశాయి. వడ్డీ రేట్లు నాలుగేళ్ల కనిష్ట స్థాయికి చేరాయి. ఇండెక్స్‌ను ఇక మీదట కేవలం 20 స్టాక్స్‌ మాత్రమే నడిపించవు. మార్కెట్‌ వ్యాప్తంగా వేలాది షేర్లు, రంగాలు ఈ ర్యాలీలో పాలు పంచుకుంటాయి. యస్‌ బ్యాంకు ఇప్పటికే రూ.30 నుంచి రూ.60కు చేరిపోయింది. ప్రభుత్వరంగ సంస్థలు నిజంగా కిరీటంలోని ఆభరణాల్లాంటివే. ఒక సంస్థలో పెట్టుబడుల ఉపసంహరణ జరిగినా పరిస్థితిని మార్చేస్తుంది. భారీగా పెట్టుబడులు పెట్టుకోవాల్సిన తరుణమిదే. వచ్చే రెండేళ్ల కాలంలో ఎంపిక చేసిన మిడ్‌క్యాప్‌ స్టాక్స్‌ రెండు మూడు రెట్ల మేర లాభాలనిస్తాయి. 

 

యస్‌ బ్యాంకుకు టైర్‌-1, టైర్‌-2 నిధులు అవసరమైన మేర ఉన్నాయి. వృద్ధి కోసమే నిధులు కావాలి. ఇదొక అద్భుతమైన బ్రాండ్‌, ఫ్రాంచైజీతో కూడిన బ్యాంకు. గతంలో క్యూఐపీ జరిగిన రూ.85 వరకు స్టాక్‌ పెరిగే అవకాశం ఉంది. ఓపిక ఉన్న ఇన్వెస్టర్‌ అయితే పెట్టుబడులకు ఇదే సరైన సమయం. ఆర్‌బీఎల్‌, డీసీబీ బ్యాంకు, ఫెడరల్‌ బ్యాంకు, పీఎన్‌బీ, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా పెట్టుబడులకు మంచి ఆకర్షణీయంగా ఉన్నాయి’’అని సంజీవ్‌ భాసిన్‌ వివరించారు. You may be interested

బంగారం వెల్లడికి ఎటువంటి పథకం లేదు

Friday 1st November 2019

కేంద్ర ప్రభుత్వ వర్గాల వెల్లడి న్యూఢిల్లీ: ప్రభుత్వం బంగారానికి సంబంధించి ఎటువంటి క్షమాభిక్ష పథకాన్ని పరిశీలించడం లేదని కేంద్ర అధికార వర్గాలు స్పష్టం చేశాయి. లెక్కలు చూపని బంగారాన్ని వెలుగులోకి తీసుకొచ్చేందుకు ఓ స్వచ్చంద వెల్లడి పథకాన్ని త్వరలో కేంద్రం తీసుకురానుందంటూ వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. నిజానికి ఈ తరహా పథకం ఆదాయపన్ను శాఖ పరిశీలనలో లేదని అధికార వర్గాలు స్పష్టం చేశాయి. బడ్జెట్‌ ప్రక్రియ ఆరంభమైందని, సాధారణంగా బడ్జెట్‌

వచ్చే ఏడాదే ఆర్థిక రికవరీ: సౌరభ్‌ ముఖర్జియా

Friday 1st November 2019

ఆర్థిక రంగ వృద్ధి బోటమ్‌ అవుట్‌ అయిందన్న సంకేతాలు ఇంకా కనిపించలేదు. కానీ, మార్కెట్లు మాత్రం నూతన గరిష్టాలకు దూసుకుపోతున్నాయి. సెన్సెక్స్‌ ఈ ఏడాది జూన్‌ 4న నమోదు చేసిన 40,312 స్థాయిని గురువారం ట్రేడింగ్‌లో అధిగమించింది. అయితే, ఆర్థిక రంగ రికవరీ అన్నది ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఉండకపోవచ్చని, వచ్చే ఆర్థిక సంవత్సరంలోనే ఇది ఉండొచ్చని మార్సెల్లస్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ మేనేజర్స్‌ వ్యవస్థాపకుడు సౌరభ్‌ముఖర్జీ చెప్పారు.     ‘‘ఆర్థిక రంగ వృద్ధి

Most from this category