News


ఇన్సూరెన్స్‌ భవిష్యత్‌ బాగుంది: సెంట్రమ్‌ బ్రోకింగ్‌

Wednesday 26th June 2019
Markets_main1561540450.png-26591

  • పార్మా రంగానికన్నా ఐటీ రంగమే మంచిది
  • వచ్చే  3-4 నెలలో ఆటో రంగం ​ఒత్తిడికి లోనయ్యే అవకాశం
  • కానీ లాంగ్‌ టెర్మ్‌ పెట్టుబడులతో మంచి లాభాలు పొందవచ్చు
  • ఇన్సూరెన్స్‌ రంగంలో లాభాలు వచ్చే అవకాశం ఎక్కువ: జగన్నాథం తునుగుంట్ల

పార్మారంగంలో ఇన్వెస్ట్‌ చేయడం కన్నా అధిక మూలధనమున్న ఐటీ కంపెనీలలో పెట్టుబడులు పెట్టడం సురక్షితమని, ఆర్బీఐ ప్రభుత్వానికి నగదు ఇస్తే రూపీ బలహీనత పెరుగుతుందని అది ఐటీ రంగానికి మంచిదేనని సెంట్రమ్‌ బ్రోకింగ్‌ సీనియర​ వైస్‌ప్రెసిడెంట్‌, రిసెర్చ్‌ హెడ్‌ జగన్నాథమ్‌ తునుగుంట్లా అన్నారు. ఒక ఆంగ్ల చానెల్‌కు ఇచ్చిన ఇంటర్యూలో ఆయన  తన అభిప్రాయాలను పంచుకున్నారు. ఇంటర్యూలోని ముఖ్యంశాలు ఆయన మాటల్లోనే..

డిఫాల్ట్‌ కంపెనీల బెయిల్‌ అవుట్‌ అవసరం
ఎన్‌డీఏ 2 వచ్చాకా ఒక సెంటిమెంట్‌ బలబడింది.  ఎన్‌డీఏ ప్రభుత్వం మరోక సారి అధికారంలోకి వచ్చాక  కార్పోరేట్‌ డీఫాల్ట్‌లను తగ్గించడానికి కొత్త ప్రణాళికలు తీసుకోస్తారని, తిరోగమన బాటలో ఉన్న కార్పోరేట్‌ సెంటిమెంట్‌ను, నమ్మకాన్ని ఆపడానికి 100 రోజుల ప్రణాళిక వేస్తారని భావించారు. నిజాయితిగా మాట్లాడుకుంటే  మే 23 నుంచి జూన్‌ 4 మధ్యగల పదిరోజుల కాలంలో వ్యాపార, వాణిజ్యాలు, బ్రోకరేజీ నగదు పెరిగాయి. కానీ జూన్‌ 5న డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ డీఫాల్ట్‌ అయ్యాక ట్రెండ​మారింది. గత 20 రోజులు ఈ రంగం తిరోగమన బాటలోనే నడిచింది. కొత్త కార్పోరేట్‌ కంపెనీలు సమస్యల్లో చిక్కుకుంటున్నాయి. ఇదే ఒకవేళ ముదిరితే లిక్విడిటీని, నమ్మకాన్ని అందుకోవడం కష్టమవుతుంది.

    ఇప్పుడు అందరి దృష్ఠి బడ్జెట్‌పైనే ఉంది.   ప్రభుత్వం చిత్త శుద్దితో వస్తుందా? 5 ఏళ్ల కనిష్ఠానికి పడిపోయిన ఆర్థికవ్యవస్థను పరుగులు పెట్టించేలా ఎటువంటి ప్రకటనలుంటాయి? ఈ డిఫాల్ట్‌లను ఆపడానికి ఆర్బీఐ, ప్రభుత్వం ఎటువంటి చర్యలను తీసుకోనుంది? అనే అంశాలు అందరి మనసుల్లో ఉన్నాయి. కొన్ని డీఫాల్ట్‌ కార్పోరేట్‌ కంపెనీలను బయటపడేందుకు ప్రభుత్వం చేయూతనందించడం వంటివి మనలాంటి మార్కెట్లకు బలన్నిచ్చినట్టువుతుంది.

సంపద సృష్టించే రంగం ఇన్సూరెన్స్‌..
  గత 20 ఏళ్లలో బ్యాంకింగ్‌ సెక్టార్‌ సృస్టించిన సంపదను ఇన్సూరెన్స్‌ కంపెనీలు రాబోయే 15-20 ఏళ్లలో సృస్టించే సామర్థ్యం కలిగి ఉన్నాయి. ఈ రంగంలో కొన్ని కంపెనీలు మాత్రమే స్టాక్‌ మార్కెట్లలో నమోదయ్యాయి. అందువలన పెట్టుబడులు పెట్టాలనుకునే వాళ్లు ఇన్సూరెన్స్‌ రంగాన్ని  పరిశీలించవచ్చు. బ్యాంకింగ్‌ పాత్ర మార్కెట్లలో ఎక్కువగా ఉంటుంది. కానీ 5 లక్షల కోట్లు, 10 లక్షల కోట్ల మార్కెట్‌ క్యాప్‌ ఉన్న కంపెనీలు పెద్ద మొత్తంలో లాభాలను ఇవ్వలేకపోవచ్చు. ఇప్పుడు ఆ బాధ్యతను ఇన్సూరెన్స్‌ కంపెనీలు తీసుకోనున్నాయి.        

   హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ లేదా ఎస్‌బీఐ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ల స్టాక్‌ల కోసం విదేశి ఇన్వెస్టర్లు కూడా ఎదురుచూస్తున్నారు. హెచ్‌డీఎఫ్‌సీ బ్రాండ్‌ ఉండడంతో హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌ బలంగా ఉంది. దీని షేరు ధర కూడా ఖరిదుగానే ఉంది. ఎస్‌బీఐ వాటా అధికంగా ఉండడం వలన ఎస్‌బీఐ లైఫ్‌ కూడా బలంగానే ఉంది. కానీ ప్రభుత్వ రంగ బ్యాంకులలో ఉన్న ప్రమాదాన్ని కూడా గుర్తించాలి. ప్రభుత్వం ఈ కంపెనీలలో ఏదో ఒక విషయంలో జోక్యం చేసుకునే అవకాశం ఉంటుంది.

లాంగ్‌టెర్మ్‌లో ఆటో రంగం ఓకే..
   వాహన తయారి రంగంలో పెట్టుబడులు పెట్టడానికి సిద్ధపడితే ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇంకో రెండు మూడు నెలలో ఈ రంగానికి సంబంధించి ‘సెల్‌’ సిఫార్సులు పెరగవచ్చు. అందరికి వ్యతిరేకంగా ట్రేడింగ్‌ చేయలేము కదా! ఒక వేళ ఆ ప్రమాదాలను ఎదుర్కొడానికి సిద్ధపడితే ఆటో రంగం రాబోయే ఐదారేళ్లలో మం‍చి లాభాలను ఇవ్వగలదు. ఆటో రంగంలో మహింద్రా అండ్‌ మహింద్రా బాగుంది. ఈ కంపెనీ ముందు నుంచే ఎలకి​‍్ట్రక్‌ వాహనాలను తయారు చేస్తుండంతో పాటు గత ఐదు ఏళ్ల నుంచి కంపెనీ స్టాక్‌ నిలకడగానే ఉంది. ఈ కంపెనీ స్టాక్‌ ధరలలో ఎటువంటి చెప్పుకోదగ్గ మార్పేమి చోటు చేసుకోకపోవడంతో కంపెనీ స్టాక్‌ ‘అండర్‌ వాల్యు’లో ఉంది. అయినప్పటికి కంపెనీ వృద్ధి సాధిస్తోంది. అంతేకాకుండా కంపెనీకి టెక్‌ మహింద్రా, మహింద్రా హాలిడేస్‌, మహింద్రా లైఫ్‌ స్పేస్‌ వంటి కంపెనీలు దన్నుగా ఉన్నాయి కూడా. 
     ఎమ్‌ అండ్‌ ఎమ్‌ మార్కెట్‌ వాటాలో ఆటో తయారి రంగం వాటా 60 శాతం ఉండగా మిగిలిన కంపెనీల వాటా 40 శాతం ఉంది. ఆటో సెక్టార్‌లో  అధిక వెయిటేజి ఉండడంతో దీనిని మినీ మూచ్యువల్‌ ఫండ్‌గా భావించవచ్చు.  వచ్చే నాలుగు నెలలో అనేక పరిణామాలను ఈ రంగం ఎదుర్కొనవచ్చు. అందువలన ఈ రంగంలో ట్రేడ్‌ చేయడం ప్రమాదమే కానీ వచ్చే నాలుగేళ్లలో మంచి లాభాలను పొందవచ్చు. 

పార్మా కన్నా ఐటీ మిన్న
 ఐటీ రంగం ఇప్పటికి పర్వాలేదు. తాజాగా బిమల్‌ జలాన్‌ కమిటీ ఆర్బీఐ మిగులు నిధులను ప్రభుత్వానికి కేటాయించే అవకాశాన్ని పరిశీలిస్తోంది. ఒక వేళ అదే జరిగితే ప్రభుత్వానికి రూ.1-2లక్షల కోట్లు ఆర్బీఐ నుంచి అందవచ్చు. ఇంత మొత్తం నగదును ఆర్బీఐ ప్రింట్‌ చేయాలి. ఫలితంగా రూపీ విలువ పడిపోతుంది ఇది ఐటీ సెక్టార్‌కు అనుకూలించేదే. ఒకవేళ ఆర్బీఐ ప్రభుత్వానికి ఇచ్చే నగదు రూ.2-3 లక్షల కోట్లుంటే రూపీ ఇంకా ఎక్కువగా బలహీనపడుతుంది. అంతేకాకుండా ఐటీ కంపెనీలు బై బ్యాక్‌లు, ప్రత్యేక డివిడెం‍డ్‌లంటూ ఇన్వెస్టర్లతో స్నేహ పూర్వకంగా ఉంటున్నాయి. అధిక మూలధనమున్న ఐటీ కంపెనీలలో ఇన్వెస్ట్‌ చేయడం సురక్షితం. అంతేకాకుండా ఇప్పుడున్న ఆర్థిక మందగమనంలో పార్మా రంగానికన్నా ఐటీలో పెట్టుబడులు పెట్టడం ఉత్తమమే.  ఎఫ్‌డీఏ నిబంధనలు కఠినతరం చేయడంతో పార్మారంగం నష్టపోతుంది. అంతేకాకుండా 2020లో అమెరికా అధ్యక్ష ఎన్నికలుండడం కూడా పార్మారంగాన్ని ప్రభావితం చేస్తుంది. ఎందుకంటే అమెరికా ఎన్నికల్లో ఆరోగ్య రక్షణకు అధిక ప్రాధాన్యం ఉంటుంది. ఫలితంగా ట్రంప్‌ ఈ రంగం పై ఒత్తిడి పెట్టవచ్చు.  పెట్టుబడులు పెట్టే ముందు ఈ విషయాలను గుర్తుపెట్టుకోవడం చాలా అవసరం. అంతర్జాతీయ పరిణామాలు, రూపీ బలహీనతల వలన ఐటీలో పెట్టుబడులు పెట్టడం పార్మారంగానికన్నా మంచిది. You may be interested

రివకరి బాటలో అడాగ్‌ గ్రూప్‌ షేర్లు

Wednesday 26th June 2019

క్రితం ట్రేడింగ్‌ సెషన్‌లో భారీగా నష్టపోయిన అనిల్‌ అంబానికి చెందిన అడాగ్‌ షేర్లు నేటి ట్రేడింగ్‌లో రికవరి బాట పట్టాయి. ఈ గ్రూప్‌నకు చెందిన రిలయన్స్‌ ఇన్ఫ్రా, రిలయన్స్‌ పవర్‌,  రిలయన్స్‌  క్యాపిటల్‌ షేర్లు 20శాతం నుంచి 13శాతం ర్యాలీ చేశాయి. ఎన్‌ఎస్‌ఈలోని ఎఫ్‌అండ్‌ఓ సెక్యూరిటీస్‌ విభాగంలో టాప్‌-10 గెయినర్లలో మూడు షేర్లు మొదటి మూడు స్థానాల్లో ట్రేడ్‌ అవుతున్నాయి.  రిలయన్స్‌ ఇన్ఫ్రాటెల్‌:- నేడు ఎన్‌ఎస్‌ఈలో రూ.50.80ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది.

వచ్చే మూడేళ్లలో ట్రిలియన్‌ డాలర్లకు ఎగుమతులు

Wednesday 26th June 2019

భారత ఎగుమతి సంస్థల సమాఖ్య అంచనా న్యూఢిల్లీ: భారత్‌ నుంచి ఎగుమతులు గణనీయంగా పెరగనున్నట్లు అంచనాలు వెలువడుతున్నాయి. ప్రస్తుతం 535 బిలియన్‌ డాలర్లుగా ఉన్న దేశీ ఎగుమతులు.. వచ్చే మూడేళ్లలో ఒక ట్రిలియన్‌ డాలర్లకు చేరనున్నాయని భారత ఎగుమతి సంస్థల సమాఖ్య(ఎఫ్‌ఐఈఓ) అంచనావేసింది. లాజిస్టిక్స్ రంగంలో అభివృద్ధి, మౌళిక సదుపాయాల నిర్మాణం ఎగుమతులకు ఊతం ఇవ్వనున్నట్లు వెల్లడించింది. ‘లాజిస్టిక్స్ (సరుకు రవాణా) రంగం వ్యయ నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించడం, వ్యాపార

Most from this category