News


నేటి వార్తల్లోని షేర్లు

Friday 24th January 2020
Markets_main1579843019.png-31159



వివిధ వార్తలకు అనుగుణంగా శుక్రవారం ప్రభావితమయ్యే షేర్లు

ఇండియా బుల్స్‌ వెంచర్స్‌: ఇండియా బుల్స్‌ వెంచర్స్‌ క్యూ3 కన్సాలిడేటెడ్‌ నికర లాభం 14 శాతం తగ్గి రూ.120.4 కోట్ల నుంచి రూ104 కోట్లకు చేరింది. వార్షికప్రాతిపదికన ఆదాయం 53 శాతం పెరిగి రూ.566 కోట్ల నుంచి రూ.867 కోట్లకు చేరింది.

జెన్సర్‌ టెక్‌: ఈ కంపెనీ క్యూ3 నికర లాభం 50.6 శాతం తగ్గి రూ.80 కోట్ల నుంచి రూ.40 కోట్లకు చేరింది. వార్షిక ప్రాతిపదికన ఆదాయం 4.8 శాతం తగ్గి రూ.1,072.3 కోట్ల నుంచి రూ.1,020.6 కోట్లకు చేరింది. 

బయోకాన్‌: బయోకాన్‌ క్యూ3 నికర లాభం 6.6 శాతం తగ్గి రూ.217 కోట్ల నుంచి రూ.203 కోట్లకు చేరింది. వార్షిక ప్రాతిపదికన ఆదాయం 13.5 శాతం పెరిగి రూ.15,41 కోట్ల నుంచి రూ.1749 కోట్లకు చేరింది.

ఇండియాబుల్స్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌:  ఇండియాబుల్స్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ 22,93,306 షేర్లను విదేశీ బ్రోకరేజ్‌ సంస్థ అయిన క్రెడిట్‌ సూసీ జనవరి 23న  బ్లాక్‌డీల్‌ ద్వారా సొంతం చేసుకున్నట్లు ఎన్‌ఎస్‌ఈ డేటా వెల్లడించింది.

నిప్పాన్‌ లైఫ్‌ ఏఎంసీ: పీఎస్‌యూ ఈటీఎఫ్‌ల్లో ఏడోదశలో భాగంగా పెట్టుబడులకు అనుమతించమని నిప్పాన్‌ లైఫ్‌ ఏఎంసీ సెబీనీ కోరింది. కాగా నిప్పాన్‌ లైఫ్‌ ఏఎంసీ క్యూ3 నికర లాభం 36 శాతం పెరిగింది.

ఐటీఐ: ఐటీఐ కంపెనీ రూ.1400 కోట్లను సమీకరించి దాన్లో రూ.607 కోట్లను  రుణాలు చెల్లించడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.

గెయిల్‌: వార్షిక లైసెన్సు ఫీజుపై స్పష్టత ఇవ్వాలని గెయిల్‌ కంపెనీ సుప్రీంకోర్టులో పిటీషన్‌ దాఖలు చేసింది.

హెచ్‌డీఎఫ్‌సీ: హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ రూ.2500 కోట్లను సమీకరించేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది.


 



You may be interested

స్వల్పకాలానికి టాప్‌ సిఫార్సులు

Friday 24th January 2020

వచ్చే మూడు నాలుగు వారాల్లో మంచి రాబడినిచ్చే ఆరు స్టాకులను ప్రముఖ అనలిస్టులు రికమండ్‌ చేస్తున్నారు. 1. రామ్‌కో సిమెంట్స్‌: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 890. స్టాప్‌లాస్‌ రూ. 797. సుదీర్ఘ కన్సాలిడేషన్‌ తర్వాత కప్‌ అండ్‌ హ్యాండిల్‌ ప్యాట్రన్‌ నుంచి బ్రేకవుట్‌ సాధించింది. అనంతరం స్వల్పకాలిక స్థిరీకరణ చూపింది. ఆర్‌ఎస్‌ఐలో బలమైన రివర్సల్‌ కనిపిస్తోంది. పైగా పాజిటివ్‌ క్రాసోవర్‌ ఏర్పరిచింది. త్వరలో మరింత అప్‌మూవ్‌ ఉంటుందని అంచనా. 2. క్రెడిట్‌ యాక్సిస్‌

జెన్సార్‌-అదానీ గ్యాస్‌- పీఎన్‌బీ హౌసింగ్‌ ‘బేర్‌

Friday 24th January 2020

ప్రపంచ మార్కెట్లు బలహీనంగా ఉన్నప్పటికీ దేశీ స్టాక్‌ మార్కెట్లు వరుసగా రెండో రోజు సానుకూలంగా ప్రారంభమయ్యాయి. తదుపరి మరింత బలపడ్డాయి. ఉదయం 10 ప్రాంతంలో సెన్సెక్స్‌ 100 పాయింట్లు పెరిగి 41,487కు చేరగా.. నిఫ్టీ 34 పాయింట్లు పుంజుకుని 12,215 వద్ద ట్రేడవుతోంది. ఈ నేపథ్యంలోనూ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2019-20) మూడో త్రైమాసికంలో నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించడంతో ఐటీ సేవల కంపెనీ జెన్సార్‌ టెక్నాలజీస్‌, పీఎన్‌బీ హౌసింగ్‌ ఫైనాన్స్‌ కౌంటర్లో

Most from this category