News


నేటి వార్తల్లోని షేర్లు

Monday 27th January 2020
Markets_main1580102306.png-31229


వివిధ వార్తలకు అనుగుణంగా సోమవారం స్టాక్‌ మార్కెట్లో ప్రభావితమయ్యే షేర్లు
ఈఐహెచ్‌: ఈఐహెచ్‌ క్యూ3 నికర లాభం 5.3 శాతం పెరిగి రూ.95 కోట్లకు చేరింది. వార్షికప్రాతిపదికన  ఆదాయం 3.8 శాతం తగ్గి రూ.505.5 కోట్లుగా నమోదైంది.

జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌: ఈ కంపెనీ క్యూ3 నికర లాభం 88.3 శాతం పెరిగి రూ.187 కోట్లకు చేరింది. వార్షిక ప్రాతిపదికన ఆదాయం 11 శాతం తగ్గి రూ.18,055 కోట్లుగా నమోదైంది.

ఏపీఎల్‌ అపోలో ట్యూబ్స్‌: ఈ కంపెనీ క్యూ3 నికర లాభం పెరిగి రూ. 13 కోట్ల నుంచి రూ.88.3 కోట్లకు చేరింది. వార్షిక ప్రాతిపదికన ఆదాయం రూ. 1691.2 కోట్ల నుంచి రూ. రూ.2,116 కోట్లకు చేరింది. 

డీసీబీ బ్యాంక్‌: డీసీబీ బ్యాంక్‌ క్యూ3 నికర లాభం 12.3 శాతం రూ.86.10 కోట్లనుంచి పెరిగి రూ.97 కోట్లకు చేరింది. వార్షిక ప్రాతిపదికన నికర వడ్డీ ఆదాయం 10 శాతం పెరిగి రూ.293.6 కోట్ల నుంచి రూ.323 కోట్లకు చేరింది.

ప్రెస్టేజ్‌ ఎస్టేట్స్‌: ఈ కంపెనీ క్యూ3 కన్సాలిడేటెడ్‌ నికర లాభం పెరిగి రూ.67.4 కోట్ల నుంచి రూ.216 కోట్లకు చేరింది. వార్షిక ప్రాతిపదికన ఆదాయం రూ.1,053.5 కోట్ల నుంచి రూ.2, 681 కోట్లకు చేరింది.

సీమన్స్‌: సీఅండ్‌ఎస్‌ ఎలక్ట్రిక్‌ కంపెనీలో 99.22 శాతం వాటాను రూ.2,120 కోట్లకు కొనుగోలు చేసేందుకు సీమన్స్‌  కంపెనీ ఒప్పందం చేసుకుంది.
యాక్సిస్‌ బ్యాంక్‌: నాన్‌ కన్వర్టబుల్‌ డిబెంచర్లతో రూ.5000 కోట్లను సమీకరించాలని యాక్సిస్‌ బ్యాంక్‌ నిర్ణయించింది.

రిలయన్స్‌ క్యాపిటల్‌: ఈ కంపెనీ జనవరి 24న జరపాల్సిన వడ్డీ చెల్లింపుల్లో జాప్యం జరిగింది.

రిలయన్స్‌ ఇన్‌ఫ్రా: రిలయన్స్‌ ఇన్‌ఫ్రా ఎన్‌సీడీల రేటింగ్‌ను కేర్‌ రేటింగ్‌ సంస్థ కేర్‌ డీగా సవరించింది.

సిప్లా: సిప్లాకు చెదిన బొమ్మసంద్రా యూనిట్‌లో  యూఎస్‌ఎఫ్‌డీఏ సీజీఎంపీ పరిశీలనలను పూర్తి చేసింది.

బజాజ్‌ ఫైనాన్స్‌: ఎన్‌సీడీల ద్వారా నిధులు సమీకరించేందుకు బజాజ్‌ ఫైనాన్స్‌ బోర్డు జనవరి 29న సమావేశం కానుంది.

ఐటీఐ: ఎఫ్‌పీవో ధరను నిర్ణయించేందుకు ఐటీఐ బోర్డు జనవరి 29న సమావేశం కానుంది.

మారుతీ సుజుకీ : మారుతీ సుజుకీ నెక్సా స్టైలిష్‌ అండ్‌ స్పోర్ట్స్‌ కార్‌ సియజ్‌ ఎస్‌ను విడుదల చేసింది.

టీవీఎస్‌ మోటార్స్‌: అధునాతన టెక్నాలజీతో రూపొందించిన టీవీఎస్‌ ఐక్యూబ్‌ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ను టీవీఎస్‌ మోటార్‌ మార్కెట్లోకి విడుదల చేసింది.


 



You may be interested

మొబైల్స్‌ తర్వాత ఆటోరంగంపై చైనా కంపెనీల కన్ను!

Monday 27th January 2020

భారత మార్కెట్లో మెజార్టీ వాటా కొల్లగొట్టేందుకు యత్నాలు ప్రధానంగా ఇ-వాహనాలపై దృష్టి భారత ఐటీ, టెక్నాలజీ రంగాల్లోకి చైనా ఆక్రమణ చాలా నెమ్మదిగా స్లోపాయిజన్‌లాగా జరుగుతూ వస్తోంది. తొలుత నెమ్మదిగా ఆరంభమయ్యే చైనా ఆక్రమణ క్రమంగా ఉధృత రూపం దాలుస్తూ చివరకు అడుగు పెట్టిన రంగాన్ని శాసించేలా చేస్తుందన్నది టెలికం రంగ అనుభవాలు చెబుతున్నాయి. కొన్నేళ్లుగా అటు స్మార్ట్‌ఫోన్ల నుంచి ఇటు డిజిటల్‌పేమెంట్స్‌ వరకు, అటు ఇ- వాహనాల నుంచి ఇటు కన్జూమర్‌

ఏపీఎల్‌ జూమ్‌- వెండిట్‌, బీవోబీ బోర్లా

Monday 27th January 2020

క్యూ3(అక్టోబర్‌-డిసెంబర్‌) ఫలితాల ఎఫెక్ట్‌ ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తున్న కరోనా వైరస్‌ కారణంగా దేశీ స్టాక్‌ మార్కెట్లలో అమ్మకాలు తలెత్తాయి. దీంతో బలహీనంగా ప్రారంభమైన మార్కెట్లు నేలచూపులతో కదులుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2019-20) మూడో త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించడంతో ఏపీఎల్‌ అపోలో ట్యూబ్స్‌ కౌంటర్‌కు డిమాండ్‌ కనిపిస్తోంది. అయితే మరోపక్క ఈ ఏడాది క్యూ3(అక్టోబర్‌-డిసెంబర్‌)లో సాధించిన ఫలితాలు ఇన్వెస్టర్లను నిరాశపరచడంతో వెండిట్‌ ఇండియా, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా కౌంటర్లు అమ్మకాలతో

Most from this category