News


సింగపూర్‌ కొత్త ఒప్పందం- ఎఫ్‌పీఐలకు ప్రతికూలం?!

Wednesday 22nd January 2020
Markets_main1579670806.png-31094

భారత్‌లో పెట్టుబడులు పెట్టే విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు ఎక్కువగా సింగపూర్‌ మార్గంలో వస్తుంటారు. అయితే తాజాగా ఇండియా, సింగపూర్‌ మధ్య కుదిరిన ఎంఎల్‌ఐ(మల్టీలేటరల్‌ అగ్రిమెంట్‌)తో ఇండియాకు వచ్చే ఎఫ్‌పీఐలపై నెగిటివ్‌ ప్రభావం పడవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఏప్రిల్‌ 1 నుంచి ఈ ఒప్పందం అమల్లోకి రానుంది. దీని ప్రకారం ఇండియాలో పెట్టుబడులు పెట్టే విదేశీ ఫండ్‌ మేనేజర్లు కేవలం ఇండియాలో పెట్టుబడుల కోసమే సింగపూర్‌లో పాగా వేయలేదని ఇండియా పన్ను అధికారులకు నిరూపించుకోవాల్సిఉంటుంది. ప్రస్తుతం సింగపూర్‌ నుంచి ఇండియాలో పెట్టుబడులు పెట్టే మదుపరులకు పలు పన్ను ప్రయోజనాలు కలుగుతున్నాయి. డెరివేటివ్స్‌పై క్యాపిటల్‌గెయిన్‌ టాక్స్‌ మినహాయింపు, ఈక్విటీలపై స్వల్ప క్యాపిటల్‌ గెయిన్‌టాక్స్‌ లాంటి ప్రయోజనాలు సింగపూర్‌ నుంచి వచ్చే ఎఫ్‌పీఐలు పొందుతున్నాయి. ఇకపై ఇలాంటి ఎఫ్‌పీఐలు అన్నీ భారత పన్ను అధికారుల ముందు తమ సచ్ఛీలతను నిరూపించుకోవాల్సిఉంటుంది. ఇప్పటికే అమల్లో ఉన్న జీఏఏఆర్‌ కన్నా ఎంఎల్‌ఐ మరింత కఠినంగా ఉంటుందని నిపుణులు భావిస్తున్నారు. 


2017లో జీఏఏఆర్‌ను ప్రవేశపెట్టారు. ఇందులో నిబంధనల కన్నా ఎంఎల్‌ఐలో నిబంధలు మరింత కట్టుదిట్టంగా ఉంటాయి. నిబంధనల్లో భాగంగా కేవలం పన్ను ప్రయోజనాల కోసమే ఒక సంస్థ ఒక ప్రాంతంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు తేలితే, సదరు సంస్థకు పన్ను ప్రయోజనాలు రద్దు చేస్తారు. ఈ నిబంధన సింగపూర్‌ నుంచి కార్యకలాపాలు జరిపే పలు చిన్న, మధ్యతరహా ఎఫ్‌పీఐలకు ప్రతికూలంగా మారవచ్చని అంచనా. ఇవన్నీ సింగపూర్‌లో ఎలాంటి వ్యాపారాలు నిర్వహించడంలేదు. కేవలం ఇండియాలో పెట్టుబడుల కోసమే సింగపూర్‌లో ఆఫీసులు తెరిచాయి. ఇవన్నీ ఇకపై పీపీటీ(ప్రిన్సిపుల్‌ పర్పస్‌ టెస్ట్‌) కిందకు వస్తాయి. ఈ టెస్ట్‌ కింద భారత పన్ను అథార్టీలు వీటి కార్యకలాపాలను పరిశీలించి పన్ను మినహాయింపు కోసమే ఇవి వచ్చాయా?లేదా? నిర్ధారిస్తాయి. జీఏఏఆర్‌ ప్రకారం ఒక ఫండ్‌ ప్రధాన ఉద్దేశం పన్ను మినహాయింపు పొందడమే ఐనా, సింగపూర్‌లో పెట్టుబడుల వాతావరణం బాగుండడం తదితర కారణాల దృష్ట్యా ఇక్కడ ఆఫీసు పెట్టామని సదరు ఫండ్‌ పేర్కొంటే పన్ను మినహాయింపు కొనసాగేది. కానీ పీపీటీలో ఇవన్నీ చెల్లవు. పన్ను మినహాయింపు పొందడమే ఆఫీసు పెట్టేందుకు కారణమైతే చాలు, సదరు ఫండుకు మినహాయింపు ప్రయోజనాలన్నీ బంద్‌ అవుతాయి. ఈ నిబంధన ఎంఎన్‌సీలు చేసే పన్ను ఎగవేతలు అరికట్టేందుకు తీసుకువచ్చారని నిపుణులు భావిస్తున్నారు. భారత్‌లోకి వచ్చే ఎఫ్‌డీఐల్లో సింగపూర్‌ నుంచి వచ్చే పెట్టుబడులు నాలుగో స్థానంలో ఉన్నాయి. సింగపూర్‌ ఎఫ్‌పీఐల కింద దాదాపు 3.15 లక్షల కోట్ల రూపాయల ఏయూఎంలున్నాయి. You may be interested

నష్టాల్లో పసిడి

Wednesday 22nd January 2020

దేశీయ ఎంసీఎక్స్‌ మార్కెట్లో బుధవారం పసిడి ఫ్యూచర్ల ధర నష్టాల్లో ట్రేడ్‌ అవుతోంది. ఎంసీఎక్స్‌లో  ఫిబ్రవరి కాంటాక్టు 10గ్రాముల పసిడి ధర రూ.106లు నష్టంతో రూ.39805.00 కదలాడుతోంది. అంతర్జాతీయ మార్కెట్లో పసిడికి డిమాండ్‌ తగ్గడం, నేడు ఫారెక్స్‌ మార్కెట్లో డాలర్‌ మారకంలో రూపాయి విలువ బలపడటం తదితర అంశాలు పసిడి ప్యూచర్లకు డిమాండ్‌ను తగ్గించాయి. నిన్నరాత్రి ఎంసీఎక్స్‌ మార్కెట్‌ ముగిసే సరికి 10గ్రాముల పసిడి ధర రూ.39733 వద్ద స్థిరపడింది.  ‘‘వరల్డ్‌

బ్యాంక్‌ నిఫ్టీ డౌన్‌

Wednesday 22nd January 2020

0.5 శాతం వెనకడుగు రెండు రోజుల వరస నష్టాలకు చెక్‌ పెడుతూ ప్రారంభంలోనే బౌన్స్‌బ్యాక్‌ అయిన దేశీ స్టాక్‌ మార్కెట్లు తదుపరి తిరిగి అమ్మకాల ఒత్తిడిలో పడ్డాయి. లాభాలను పోగొట్టుకోవడంతోపాటు.. నష్టాల బాట పట్టాయి. ఉదయం 10.40 ప్రాంతంలో సెన్సెక్స్‌ 60 పాయింట్లు క్షీణించి 41,254ను తాకగా.. నిఫ్టీ 24 పాయింట్లు తక్కువగా 12,146 వద్ద ట్రేడవుతోంది. ఈ నేపథ్యంలో బ్యాం‍క్‌ కౌంటర్లలో అమ్మకాలు కనిపిస్తున్నాయి. వెరసి ఎన్‌ఎస్‌ఈలో బ్యాంక్‌ నిఫ్టీ

Most from this category