News


బడ్జెట్‌ రోజున కొత్త గరిష్ఠాలకు ఛాన్స్‌?!

Thursday 4th July 2019
Markets_main1562230458.png-26794

గణాంకాల విశ్లేషణ
దేశీయ మార్కెట్లు బడ్జెట్‌ సమయంలో తమ ఆల్‌టైమ్‌ హైకి దగ్గర్లో కదలాడుతున్నాయి. ఈ నేపథ్యంలో బడ్జెట్‌రోజు బ్రేకవుట్‌తో మరో ఆల్‌టైమ్‌ హైని మార్కెట్‌ చవిచూసే అవకాశం ఉన్నట్లు మార్కెట్‌ నిపుణులు అంచనా వేస్తున్నారు. గత పదేళ్ల గణాంకాలు పరిశీలిస్తే బడ్జెట్‌రోజు తీవ్ర కదలికలు చూపినా, చివరకు ఫ్లాట్‌గా మార్కెట్‌ ముగియడం ఎక్కువసార్లు కనిపిస్తుంది. పదేళ్లలో బడ్జెట్‌ రోజున బుల్స్‌ పట్టు బిగించిన సందర్భాలు ఐదు సార్లున్నాయని, ఈ ఐదు దఫాల్లో సూచీలు దాదాపు ఒక శాతం లాభపడ్డాయని ఐసీఐసీఐ డైరెక్ట్‌ నివేదిక వివరించింది. మిగిలిన ఐదు దఫాల్లో బేర్స్‌ నాలుగుసార్లు హవా చూపగా, ఒకసారి సూచీలు ఫ్లాట్‌గా ముగిశాయి. ఈ పరంగా చూస్తే శుక్రవారం మార్కెట్‌ 11500 పాయింట్లనుంచి 12100 పాయింట్ల వరకు ఊగిసలాడవచ్చని అంచనా. ఇదే జరిగితే ఇంట్రాడేలో పాత లైఫ్‌టైమ్‌హైని కొంత మేర దాటేందుకు ఛాన్సులున్నాయి.

వృద్ది ప్రోత్సాహక బడ్జెట్‌ ఉంటుందని చాలామంది నిపుణులు భావిస్తున్నారు. ఈ నమ్మకానికి ఏమాత్రం విఘాతం కలిగినా సూచీల్లో పతనం తప్పక వస్తుందని ఐసీఐసీఐ డైరెక్ట్‌ నివేదిక తెలిపింది. మార్కెట్లు ప్రధానంగా బడ్జెట్లో విత్త నిర్వహణపై దృష్టి పెడతాయని, లోటు గతంలోకన్నా ఎక్కువగా ఉంటే మార్కెట్లు నిరాశపడతాయని తెలిపింది. బడ్జెట్లో ఎన్‌బీఎఫ్‌సీ సంక్షోభ పరిష్కార చర్యలు, పీఎస్‌బీలకు క్యాపిటల్‌ ఇన్‌ఫ్యూజన్‌, వివిధ రంగాలకు ప్రోత్సాహకాలు ఉంటాయని అంచనా. ఈ నేపథ్యంలో ఎకానమీ ఆధారితమై, వృద్ధి అవకాశాలు మెండుగా ఉన్న స్టాకులను ఎంచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. పీఎస్‌బీలు, ప్రైవేట్‌బ ఆ‍్యంకులు, సిమెంట్‌, నిర్మాణం, పారిశ్రామిక రంగాలపై ఎక్కువమంది బుల్లిష్‌గా ఉన్నారు. మిడ్‌క్యాప్స్‌లో వాల్యూషన్లు ఆకర్షణీయంగా ఉన్నాయని, వీటిలో నాణ్యమైన వాటిని ఎంచుకోవచ్చని మరికొందరి సూచన. 



You may be interested

టైటాన్‌ రేటింగ్‌ తగ్గించిన మోర్గాన్‌ స్టాన్లీ

Thursday 4th July 2019

రాకేశ్‌ ఝున్‌ఝున్‌వాలా పెట్‌ షేరుగా పిలువబడే టైటాన్‌ షేర్లపై విదేశీ బ్రోకరేజ్‌ హౌసింగ్‌ సంస్థ మోర్గాన్‌ స్టాన్లీ రేటింగ్‌ను డౌన్‌గ్రేడ్‌ చేసింది. గతంలో తాము కేటాయించిన ఓవర్‌ వెయిట్‌ రేటింగ్‌ నుంచి ఈక్విల్‌ వెయిట్‌ రేటింగ్‌కు తగ్గిస్తున్నట్లు గురువారం ప్రకటించింది. అయితే రూ.1300 షేరు కొనుగోలు టార్గెట్‌ ధరను  మాత్రం యథాతథంగా ఉంచుతున్నట్లు తెలిపింది. ధీర్ఘకాలిక ఇన్వెస్టర్లకు ఈ కంపెనీ షేర్లు ప్రయోజనకరం. అయితే ప్రస్తుత స్థాయి మించి లాభాలను ఆర్జించడటం తేలికైన

బడ్జెట్‌పై మార్కెట్‌కు ఆశల్లేవా?!

Thursday 4th July 2019

దేశీయ మార్కెట్లో తీవ్ర కదలికలను సూచించే వీఐఎక్స్‌ సూచీ గతంలో బడ్జెట్‌ సమయంలో బాగా పెరుతుండేది. బడ్జెట్లో కీలక నిర్ణయాలుంటాయన్న నమ్మకంతో వీఐఎక్స్‌లో పెరుగుదల ఉండేది. కానీ ఈ దఫా బడ్జెట్‌కు ముందు వీఐఎక్స్‌ సూచీ బాగా తక్కువగా ఉంది. బడ్జెట్‌పై మార్కెట్‌కు పెద్దగా అంచనాల్లేవనేందుకు ఇది నిదర్శనంగా నిపుణులు విశ్లేషిస్తున్నారు. బడ్జెట్‌ ప్రకటనలు భారీ కదలికలను ప్రేరేపించేవిగా ఉండవని మార్కెట్లు భావిస్తున్నాయి. ప్రస్తుతం దేశీయ వీఐఎక్స్‌ 13.5 వద్ద

Most from this category