News


అప్‌ట్రెండ్‌ కొనసాగే ఛాన్స్‌..!

Tuesday 28th May 2019
Markets_main1559031368.png-25962

  • ఈనెల 30న దేశ ప్రధానిగా నరేంద్రమోడీ, కేంద్ర కేబినెట్ మంత్రుల ప్రమాణ స్వీకారం
  • శుక్రవారం క్యూ4 జీడీపీ డేటా, ఇండియా ఇన్‌ఫ్రా అవుట్‌పుట్‌ విడుదల
  • అదానీ పోర్ట్స్, పీఎన్‌బీ, సన్‌ఫార్మా, గెయిల్, ఇండిగో, కోల్ ఇండియా, పవర్ గ్రిడ్ ఫలితాలు ఈవారంలోనే..

ముంబై: సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించిందన్న ఉత్సాహభరిత వాతావరణం...మార్కెట్లో మరికొద్దిరోజులు వుండవచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఇన్వెస్టర్లు కొత్త ప్రభుత్వ ఏర్పాటు, దేశీ స్థూల ఆర్థికాంశాలు, అంతర్జాతీయ పరిణామాలపై దృష్టి నిలుపుతారని కూడా విశ్లేషకులు చెపుతున్నారు.  దేశ ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ రెండోసారి ప్రమాణస్వీకారం చేయడానికి ఈవారంలోనే ముహూర్తం ఖరారైంది. ఈనెల 30న (గురువారం) సాయంత్రం 7 గంటలకు మోడీతో పాటు కేంద్ర కేబినెట్ మంత్రులు కూడా ప్రమాణస్వీకారం చేయనున్నారు. అయితే, ఎంతమంది కేబినెట్ మంత్రులు ఉంటారనే అంశం ఇంకా తెలియకపోవడంతో మార్కెట్‌ వర్గాలు ఈ అంశంపై దృష్టిసారించాయి. ప్రమాణస్వీకారం రోజునే.. మే సిరీస్ ఎఫ్‌ అండ్‌ ఓ ముగింపు ఉన్న కారణంగా ఆరోజున భారీ స్థాయిలో ఒడిదుడుకులకు ఆస్కారం ఉండనుందనే అంచనాలు వెలువడుతున్నాయి. రానున్న రోజుల్లో కూడా మార్కెట్లో ఉత్సాహభరిత వాతావరణం కొనసాగే అవకాశం ఉందని యస్‌ సెక్యూరిటీస్ రీసెర్చ్ హెడ్ అమర్ అంబానీ అన్నారు. ఈవారంలో అయితే సూచీల ప్రయాణం ఎటువైపు ఉంటుందనే అంశంపై పూర్తి అవగాహన రాకపోవచ్చని తాను భావిస్తున్నట్లు సామ్కో సెక్యూరిటీస్‌ అండ్‌ స్టాక్‌ నోట్‌ వ్యవస్థాపక సీఈవో జిమీత్‌ మోడీ వ్యాఖ్యానించారు. తేలికపాటి అమ్మకాల ఒత్తిడికి ఆస్కారం ఉందని, అంతర్జాతీయ పరిణామాలకు అనుగుణంగా కదలాడవచ్చని విశ్లేషించారు. 

సంస్కరణల ఆధారంగానే ర్యాలీ...
‘ఎన్నికలు అనే అతిపెద్ద కార్యక్రమం పూర్తయింది. ఇక్కడ నుంచి ముడిచమురు ధరల కదలికలు, కంపెనీల ఎర్నింగ్స్‌ గైడెన్స్‌ మార్కెట్‌కు కీలకంకానున్నాయి’ అని ఎపిక్‌ రీసెర్చ్‌ సీఈవో ముస్తఫా నదీమ్‌ వ్యాఖ్యానించారు. ప్రభుత్వం చేపట్టనున్న నూతన సంస్కరణలు భారత ఆర్థిక వ్యవస్థను మరింత ముందుకు తీసుకుని వెళ్లనున్నాయని భావిస్తున్నట్లు ఐసీఐసీఐ సెక్యూరిటీస్ ఎండీ, సీఈఓ విజయ్ చందోక్ అన్నారు. వచ్చే ఐదేళ్లు ఆశాజనకంగా ఉన్నందున ఎఫ్‌ఐఐల పెట్టుబడులు కూడా భారీ రానున్నాయని అంచనావేస్తున్నట్లు చెప్పారయన. ‘ఆర్‌బీఐ ద్రవ్య పరపతి విధాన సమీక్ష, నూతన ప్రభుత్వ బడ్జెట్ ప్రకటన వెలువడే వరకు మార్కెట్లో వేచిచూసే ధోరణే ఉండవచ్చు. ఇక నుంచి క్రమంగా ఒడిదుడుకులు తగ్గవచ్చని భావిస్తున్నాం’ అని జిమీత్‌ మోడీ అన్నారు. 

స్థూల ఆర్థిక అంశాలపై దృష్టి
గత ఆర్థిక సంవత్సరం క్యూ4 (జనవరి-మార్చి) స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) గణాంకాలను ప్రభుత్వం శుక్రవారం ప్రకటించనుంది. అదేరోజున ద్రవ్య లోటు, ఇండియా ఇన్‌ఫ్రా అవుట్‌పుట్‌ డేటా విడుదలకానున్నాయి. ఇక అంతర్జాతీయ అంశాల్లో.. బ్యాంక్‌ ఆఫ్‌ జపాన్‌ సీపీఐ, చైనా ఉత్పత్తి డేటా, అమెరికా వ్యక్తిగత వ్యయ సమాచారం వెల్లడికానున్నాయి.

ఆర్థిక ఫలితాల ప్రభావం..
అదానీ పోర్ట్స్, కోల్గేట్-పామోలివ్, గెయిల్, ఇంటర్ గ్లోబ్ ఏవియేషన్, ఆయిల్ ఇండియా, జీ ఎంటర్‌టైన్‌మెంట్‌, కోల్ ఇండియా, హెచ్‌సీఎల్‌ ఇన్ఫోసిస్టమ్స్, స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా, పీఎన్‌బీ, సన్‌ఫార్మా, పవర్ గ్రిడ్ ఫలితాలు ఈవారంలో వెలువడనున్నాయి.

ఎఫ్‌ఐఐల నికర విక్రయాలు..
మే 2-24 మధ్యకాలంలో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐ) రూ.4,375 కోట్ల పెట్టుబడులను ఉపసంహరించుకున్నట్లు డిపాజిటరీ డేటా ద్వారా వెల్లడయింది. ఈ కాలంలో ఈక్విటీ మార్కెట్‌ నుంచి రూ.2,048 కోట్లు.. డెట్‌ మార్కెట్‌ నుంచి రూ.2,310 కోట్లు ఉపసంహరించుకున్నారు. You may be interested

ఇలా చేస్తే మరింత అద్దె ఆదాయం

Tuesday 28th May 2019

కో లివింగ్‌ బెటర్‌ ఆప్షన్‌ అధిక ఆదాయం పర్యాటకులకు అద్దెకు ఇవ్వడం మరో మార్గం తమ ఇంటి ప్రాపర్టీ ఏ ప్రాంతంలో ఉందనేది కీలకం పేయింగ్‌ గెస్ట్‌ ద్వారానూ అదనపు ఆదాయం నేరుగా అద్దెకు ఇవ్వడం వల్ల తక్కువ ఆదాయం ఇంటికి మార్పులు చేయడం ద్వారా పెంచుకునే అవకాశం  ఇంటి విలువతో పోలిస్తే అద్దె రూపంలో వచ్చే ఆదాయం చాలా స్వల్పంగా ఉంటుంది. అందుకే, సొంత నివాసం కోసం కాకుండా అద్దెకు ఇచ్చే ఇంటి విషయంలో ఆదాయం గురించి యజమానులు

ఈఎల్‌ఎస్‌ఎస్‌ ఫండ్స్‌ను ఎలా ఎంచుకోవాలి ?

Tuesday 28th May 2019

ప్ర: ఇన్వెస్ట్‌మెంట్‌కు బ్యాలన్స్‌డ్‌ ఫండ్స్‌ మంచి సాధనమని, బ్యాలన్స్‌డ్‌  ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేస్తే మంచి రాబడులు వస్తాయని ఫ్రెండ్స్‌ ఊదరగొట్టడంతో నేను హెచ్‌డీఎఫ్‌సీ బ్యాలన్స్‌డ్‌ ఫండ్‌లో సిస్టమేటిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాన్‌(సిప్‌) విధానంలో ఇన్వెస్ట్‌ చేయడం మొదలు పెట్టాను.  కానీ ఈ ఫండ్‌ పనితీరు అంతంతమాత్రంగానే ఉంది. ఈ ఫండ్‌ నుంచి ఇన్వెస్ట్‌మెంట్స్‌ వెనక్కి తీసుకొని వేరే కేటగిరీ ఫండ్‌లో ఇన్వెస్ట్‌ చేయమంటారా ? -రవి, విజయవాడ  జ: హెచ్‌డీఎఫ్‌సీ బ్యాలన్స్‌డ్‌ ఫండ్‌ హెచ్‌డీఎఫ్‌సీ

Most from this category