News


కొనుగోళ్లకు ఇదే మంచి తరుణం!

Monday 26th August 2019
Markets_main1566809527.png-28024

ఇంత నెగిటివ్‌ వాతావరణం ఎప్పుడూ చూడలేదు
రాకేశ్‌ ఝన్‌ఝన్‌వాలా
మార్కెట్లలో ప్రస్తుతం కనిపిస్తున్నంత నిరాశాపూరిత వాతావరణం ఎప్పుడూ చూడలేదని ప్రముఖ ఇన్వెస్టర్‌ రాకేశ్‌ ఝన్‌ఝన్‌వాలా చెప్పారు. పరిస్థితి చూస్తే చాలా అతి నిరాశ నిండినట్లు కనిపిస్తోందన్నారు. ఇలాంటి తరుణమే కొనుగోళ్లకు సరైన అవకాశమని సూచించారు. అయితే వెనువెంటనే సూచీల్లో రీబౌన్స్‌ ఉంటుందని భావించడం లేదని, క్రమానుగత మెరుగుదల ఉండొచ్చని అంచనా వేశారు. ఆర్థిక మంత్రి తాజా ప్రకటనతో సోమవారం సూచీలు భారీ లాభాల్లో పయనిస్తున్నాయి. మార్కెట్లలో సెంటిమెంట్‌ను పునరుజ్జీవింపజేయటానికి ఒక్క కారణం సరిపోదని, అనేక అంశాల కలబోతే సెంటిమెంట్‌ను పాజిటివ్‌గా మారుస్తుంనది రాకేశ్‌ చెప్పారు. ప్రభుత్వ తాజా చర్యలు ఎకానమీలో పాజిటివ్‌నెస్‌ తెస్తాయన్నారు. నిఫ్టీకి 10500- 10750 పాయింట్ల జోన్‌ బలమైన మద్దతు స్థాయిగా నిలుస్తుందని, ఈ స్థాయి అంత తొందరగా కోల్పోదని అంచనా వేశారు. ప్రస్తుతం మిడ్‌క్యాప్స్‌లో మంచి అవకాశాలున్నాయని తెలిపారు. ఈ సమయంలో వీటిని కొన్నవారికి భవిష్యత్‌లో మంచి రాబడి ఉంటుందని చెప్పారు. అల్ప వడ్డీరేట్ల వాతావరణం కొనసాగుతుందని, బ్యాంకులు ఈ సమయంలో మరింతగా రుణాలిచ్చి లిక్విడిటీ పెంచాలని ఆయన సూచించారు. దేశీయ పొదుపు సొత్తు క్రమంగా ఈక్విటీలవైపు మరలవచ్చని అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం జరుగుతున్న ట్రేడ్‌వార్‌ దీర్ఘకాలంలో ఇండియాకు మేలు చేస్తుందని రాకేశ్‌ అంచనా వేశారు. 



You may be interested

సెన్సెక్స్‌ 792, నిఫ్టీ 224 పాయింట్లు అప్‌

Monday 26th August 2019

ఆర్థిక మంత్రి ప్యాకేజీకి జైకొట్టిన మార్కెట్‌ 11050పై ముగిసిన నిఫ్టీ కేంద్రం ప్రకటించిన ఉద్దీపన చర్యలు మార్కెట్‌ను మురిపించడంతో పాటు అమెరికా-చైనాల మధ్య వాణిజ్య చర్చలు తెరపైకి రావడంతో సూచీలు సోమవారం భారీ లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్‌ 793 పాయింట్ల లాభంతో 37,494 వద్ద ముగిసింది. నిఫ్టీ 228  పాయింట్లు పెరిగి 11050 పైన 11,057.85  వద్ద స్థిరపడింది. దాదాపు 3నెలల అనంతరం సూచీలు ఒక ట్రేడింగ్‌ సెషన్‌లో ఈ స్థాయిలో లాభాలను

భారత్‌ రేటింగ్‌ అప్‌గ్రేడ్‌ చేసిన నోమురా

Monday 26th August 2019

సెన్సెక్స్‌ ఏడాది టార్గెట్‌ 40వేలు జపాన్‌ బ్రోకరేజ్‌ దిగ్గజం నోమురా తాజాగా భారత రేటింగ్‌ను ఓవర్‌వెయిట్‌కు అప్‌గ్రేడ్‌ చేసింది. ఆర్థిక మంత్రి ప్రకటించిన ఉద్దీపన చర్యలు మార్కెట్లో ఉత్సాహం పెంచుతాయని, అందువల్ల ఏడాది చివరకు సెన్సెక్స్‌ టార్గెట్‌ 40వేల పాయింట్లని అంచనా వేస్తున్నామని తెలిపింది. అంతర్జాతీయ అస్థిరతల వేల స్థానికంగా పాజిటివ్‌ డెవలప్‌మెంట్స్‌పై నిధులను వెచ్చించాల్సిన సమయమిదని సూచించింది. ఎకానమీకి తాజాగా ప్రకటించిన ప్రోత్సాహకాలు, ప్రకటనలు మంచి ఉత్సాహమిస్తాయని అభిప్రాయపడింది. ఆర్థికసంవత్సరం

Most from this category