News


‘40 ఏళ్ల అనుభవంలో ఈ స్థాయి సంపద విధ్వంసాన్ని చూడలేదు’

Friday 23rd August 2019
Markets_main1566502730.png-27956

దేశ ఆర్థిక వ్యవస్థ ఎదుర్కొంటున్న సగం సమస్యలు... ప్రభుత్వం తన బకాయిలను చెల్లించడం వల్ల పరిష్కరించొచ్చని మోతీలాల్‌ ఓస్వాల్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ సహ వ్యవస్థపాకుడు రామ్‌దేవ్‌ అగర్వాల్‌ అన్నారు. ‘‘30 రోజుల బిల్లును ప్రభుత్వం కనీసం 30 రోజుల్లోపు చెల్లించినా మూడింట ఒక వంతు సమస్యలు పరిష్కారం అవుతాయి’’ అని పేర్కొన్నారు. హీరో మైండ్‌మైన్‌ సదస్సు 2019 కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా రామ్‌దేవ్‌ అగర్వాల్‌ మాట్లాడారు. విధాన నిర్ణేతలు భారతీయ వృద్ధి నమూనాను అభివృద్ది చేయాలని, చైనా వృద్ధి నమూనా గురించి మాట్లాడడం ఆపేయాలని అగర్వాల్‌ సూచించారు. విధానాల రూపకల్పన స్థాయిలో అవగాహనకు, ఆర్థిక రంగ వాస్తవానికి ఎంతో వ్యత్యాసం ఉంటుందన్నారు. ‘‘నా 40 ఏళ్ల అనుభవంలో ప్రస్తుతం మనం చూస్తున్న స్థాయి సంపద విధ్వంసాన్ని ఇంత వరకు చూడలేదు’’అని రామ్‌దేవ్‌ అగర్వాల్‌ తెలిపారు. ఇన్వెస్టర్ల విషయంలో ప్రభుత్వం నిజాయతీగా లేదన్నారు. 

 

‘‘అతిథి దేవో భవ అన్న సంప్రదాయం మన దేశంలో ఉంది. కానీ, విదేశీ ఇన్వెస్టర్ల విషయానికొచ్చేసరికి ఈ సూత్రం అమలు కావడం లేదు’’ అని రామ్‌దేవ్‌ అగర్వాల్‌ అన్నారు. పెట్టుబడుల విషయంలో సౌకర్యం ఉండే విధంగా విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లకు (ఎఫ్‌పీఐలు) ప్రభుత్వం సరైన నిబంధనలను నిర్ణయించాల్సిన అవసరం ఉందన్నారు. భారత్‌ వారికి ఎంతో ఆకర్షణీయమైన మార్కెట్‌ అని, వారికి సరైన వాతావరణం అవసరమన్నారు. వ్యాపారాలు వాస్తవంగా ఎదుర్కొంటున్న సమస్యలు ఢిల్లీ, ముంబైలోని వాతావరణం మాదిరే ఉన్నాయని అభివర్ణించారు. ప్రస్తుత గడ్డు పరిస్థితులకు ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ సంక్షోభమే కారణమన్నారు. రుణాల పంపిణీయే అతిపెద్ద సమస్యని, ప్రభుత్వం వీటిల్లో చాలా సమస్యలను పరిష్కరించగలదన్నారు. వ్యవస్థలో లిక్విడిటీ సమస్య ఉందని, నేడు అది మరింత దారుణంగా తయారైందని వ్యాఖ్యానించారు. ‘‘కాస్త మంచి పరిణామం ఏమిటంటే ప్రధాని ఒక లక్ష్యాన్ని నిర్దేశించారు. దీన్ని చేరుకునేందుకు మనకంటూ నమూనాను గుర్తించాల్సి ఉంది’’ అని రామ్‌దేవ్‌ అగర్వాల్‌ పేర్కొన్నారు. You may be interested

శుక్రవారం వార్తల్లోని షేర్లు

Friday 23rd August 2019

వివిధ వార్తలకు అనుగుణంగా శుక్రవారం ప్రభావితమయ్యే షేర్ల వివరాలు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌:- కంపెనీ సీఎఫ్‌ఓగా శ్రీనివాసన్‌ వైద్యనాథన్‌ నియమితులయ్యారు.  ఫ్యూచర్‌ రిటైల్‌:- ఫ్యూచర్‌ కూపన్‌ లిమిటెడ్‌లో 49శాతం వాటాను కొనుగోలు చేసింది.  సోమనీ సిరామిక్స్‌:- షాబ్లోనా ఇండియా కంపెనీ విలీనానికి సంబంధించిన డ్రాఫ్ట్‌ స్కీమ్‌ ఆఫ్‌ అమాల్గమేషన్‌ కు ఆమోదం తెలిపింది.  జిల్లేట్‌ ఇండియా:- ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి రూ.10లు ముఖవిలువ కలిగిన ప్రతి షేరుపై రూ.25ల తుది డివిడెండ్‌ను ప్రకటించింది. శ్రీజీ ట్రాన్స్‌లాజిస్టిక్ట్స్‌:- మధ్యంతర డివిడెండ్‌,

స్టాక్స్‌ను మళ్లీ ఈ ధరల్లో చూడలేం...?

Friday 23rd August 2019

మార్కెట్లకు క్షీణ దశ ముగుస్తున్నట్టేనన్నారు ప్రముఖ నిపుణులు, కార్నెలియన్‌ క్యాపిటల్‌ వ్యవస్థాపకుడు వికాస్‌ఖేమాని. వచ్చే మూడు నాలుగు నెలల కాలం మంచి షేర్ల కొనుగోలుకు అనుకూల సమయంగా సూచించారు. రికవరీ అన్నది మొదలైతే మళ్లీ ఈ ధరల్లో స్టాక్స్‌ లభించవన్న విషయాన్ని గుర్తు చేశారు. మార్కెట్లకు సంబంధించిన అంశాలపై ఓ వార్తా సంస్థతో ఆయన మాట్లాడారు.    ‘‘ఆర్థిక రంగంలో కదలికకు ప్రభుత్వం వంతుగా ఎంతో చేస్తుందని ఆశించొచ్చు. నాలుగు విడతలుగా రేట్ల

Most from this category