News


ఐదేళ్లలో లాభాలు పదింతలు

Friday 27th December 2019
Markets_main1577386611.png-30459

వేగవంతమైన వృద్ధిని నమోదు చేసే కంపెనీల షేర్లకు మంచి రీరేటింగ్‌.. కాస్త ముందుగా లేదంటే కాస్త వెనుకనో ఎ‍ప్పటికైనా జరగాల్సిందే. అప్పటి వరకు ఆయా కంపెనీల్లో ఇన్వెస్ట్‌ చేసిన వారు ఓపిక వహించాలి. అప్పుడే లాభాలకు అవకాశం ఉంటుంది. మనీ కంట్రోల్‌ సంస్థ గత ఐదేళ్లలో లాభాలను పదిరెట్లు పెంచుకున్న కంపెనీలతో ఓ జాబితాను రూపొందించింది. వీటిల్లో ప్రకాష్‌ ఇండస్ట్రీస్‌ కూడా ఒకటి. ఇది ఐరన్‌ అండ్‌ స్టీల్‌ రంగ కంపెనీ. 2014-15 సంవత్సరంలో ఈ సంస్థ రూ.9.34 కోట్ల నికర లాభాన్ని ఆర్జించగా, నాటి నుంచి రెండు, మూడు రెట్ల చొప్పున ఏటా లాభాలను భారీగా పెంచుకుంటూ.. 2018-19లో రూ.539 కోట్లను నమోదు చేసింది. అంటై ఐదేళ్లలో 57 రెట్లు లాభం పెరగడం గమనార్హం. ఆయా కంపెనీల వివరాలు..

 

కంపెనీ                  నికర లాభం(రూ.కోట్లలో) 2014-15    2018-19    ఐదేళ్లలో ఎన్ని రెట్ల వృద్ధి
ప్రకాష్‌ ఇండస్ట్రీస్‌                                       9.34          539           57
ఫిలిప్స్‌ కార్బన్‌                                        10.37         382.67      36
నేషనల్‌ పెరాక్సైడ్‌                                      6.68         53.80        22 
పీఅండ్‌జీ హెల్త్‌                                         43             838.72     18
నేషనల్‌ ఫర్టిలైజర్స్‌                                   26              298          10
ఆటోమోటిక్‌ యాక్సిల్స్‌                             10.54          118.70     10

 

మార్కెట్‌ విలువ కనీసం రూ.100 కోట్లకు పైన ఉండి, 2013-14 నుంచి ఏటేటా లాభాలను పెంచుకుంటూ, కనీసం 10 రెట్లు ఐదేళ్లలో పెంచుకున్న కంపెనీల వివరాలను మనీ కంట్రోల్‌ సంస్థ పరిగణనలోకి తీసుకుని ఈ వివరాలు వెల్లడించింది. అదే సమయంలో 2018-19లో నికర లాభం రూ.100 కోట్లకు పైన ఉన్న వాటినే తీసుకుంది. మరి ఈ స్థాయిలో అద్భుత పనితీరు చూపించిన కంపెనీల షేర్లు ఏ విధంగా ఉన్నాయనే సందేహం తప్పక వస్తుంది. గత ఐదు ఆర్థిక సంవత్సరాల్లో పీఅండ్‌జీ షేరు ధర అత్యధికంగా 412 శాతం మేర పెరిగింది. తర్వాత ఫిలిప్స్‌ కార్బన్‌ 312 శాతం, నేషనల్‌ పెరాక్సైడ్‌ 146 శాతం మేర రాబడులను ఇచ్చాయి. ఆటోమోటివ్‌ యాక్సిల్స్‌ 12 శాతం లాభాలను ఇచ్చింది. కానీ, ప్రకాష్‌ ఇండస్ట్రీస్‌ నికరంగా 20 శాతం, నేషనల్‌ ఫర్టిలైజర్స్‌ 30 శాతం మేర నష్టపోయాయి.  You may be interested

ఇన్‌ఫ్రాలో మంచి అవకాశాలు

Friday 27th December 2019

గత ఏడాది కాలంలో మౌలిక రంగానికి చెందిన చాలా స్టాక్స్‌ గణనీయంగా దిద్దుబాటుకు గురయ్యాయి. 2024 నాటికి మౌలిక సదుపాయాల కోసం రూ.100 లక్షల కోట్లు వెచ్చించాలన్నది కేంద్ర ప్రభుత్వ ప్రణాళిక. దీంతో మౌలిక రంగం 2020లో పెట్టుబడుల పరంగా మంచి అవకాశాలనిస్తుందని బ్రోకరేజీ, ఫైనాన్షియల్‌ సేవల సంస్థ ప్రభుదాస్ లీలాధర్‌ తెలిపింది. ‘‘2019-20 ఆర్థిక సంవత్సరం ద్వితీయ భాగంలో ఆర్డర్ల​రాక పుంజుకుంటుంది. రోడ్లు, ఇరిగేషన్‌, ఫ్యాక్టరీలు, బిల్డింగ్‌, రైల్వేస్‌,

ఎఫ్‌అండ్‌వో ఎఫెక్ట్‌- మూడో రోజూ డౌన్‌

Thursday 26th December 2019

ఎఫ్‌అండ్‌వో చివరి రోజూ మార్కెట్లు డీలా డిసెంబర్‌ కాంట్రాక్టుల ఎక్స్‌పైరీ ఎఫెక్ట్‌ నష్టాలకు ఎదురీదిన మెటల్‌ ఇండెక్స్‌ వరుసగా మూడో రోజు దేశీ స్టాక్‌ మార్కెట్లు వెనకడుగు వేశాయి. తొలి నుంచీ బలహీనంగా కదిలిన మార్కెట్లు సమయం​ గడిచేకొద్దీ మరింత నీరసించాయి. ట్రేడింగ్‌ ముగిసేసరికి సెన్సెక్స్‌ 297 పాయింట్లు పతనమై 41,164 వద్ద నిలిచింది. నిఫ్టీ సైతం 88 పాయింట్లు క్షీణించి 12,127 వద్ద స్థిరపడింది. డిసెంబర్‌ డెరివేటివ్‌ సిరీస్‌ గడువు గురువారంతో ముగియనున్న

Most from this category