News


నెల్కో- ఎన్‌సీసీ హైజంప్‌

Monday 30th December 2019
Markets_main1577699422.png-30533

వరుసగా రెండో రోజు హుషారుగా ప్రారంభమైన దేశీ స్టాక్‌ మార్కెట్లు తదుపరి అమ్మకాల ఒత్తిడిలో పడ్డాయి. ఒక దశలో లాభాలు పోగొట్టుకోవడంతోపాటు నష్టాలలోకి సైతం ప్రవేశించాయి. తదుపరి మిడ్‌సెషన్‌లో తిరిగి కొనుగోళ్లు కనిపించడంతో మిశ్రమంగా కదులతున్నాయి. మధ్యాహ్నం 3 ప్రాంతంలో సెన్సెక్స్‌ 3 పాయింట్ల నామమాత్ర నష్టంతో 41,572కు చేరగా.. నిఫ్టీ 13 పాయింట్లు పుంజుకుని 12,258 వద్ద ట్రేడవుతోంది. ఈ నేపథ్యంలోనూ రెండు మిడ్‌ క్యాప్‌ స్టాక్స్‌ ఇన్వెస్టర్ల కొనుగోళ్లతో సందడి చేస్తున్నాయి. వివరాలు చూద్దాం...

నెల్కో లిమిటెడ్‌
విమానప్రయాణాల్లో డేటా సర్వీసులు అందించేందుకు విస్తారాతో ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు వెల్లడించడంతో సిస్టమ్‌ ఇంటిగ్రేషన్‌, ప్రొడక్ట్‌ మేనేజ్‌మెంట్‌ సేవల సంస్థ నెల్కో లిమిటెడ్‌ కౌంటర్‌ జోరందుకుంది. ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో ఈ షేరు 5.4 శాతం జంప్‌చేసి రూ. 247 వద్ద ట్రేడవుతోంది. ఇంట్రాడేలో రూ. 256 వద్ద గరిష్టాన్ని తాకగా.. రూ. 236 సమీపంలో కనిష్టాన్ని చవిచూసింది. కంపెనీలో​ ప్రమోటర్లకు 50.09% వాటా ఉంది. ఇన్‌ఫ్లైట్‌ డేటా సర్వీసులు అందించేందుకు టాటా గ్రూప్‌, సింగపూర్‌ ఎయిర్‌లైన్స్‌ జేవీ అయిన విస్తారా సంస్థతో చేతులు కలిపినట్లు నెల్కో పేర్కొంది. 

ఎన్‌సీసీ లిమిటెడ్‌
సొంత అనుబంధ కంపెనీలు యాస్టర్‌ రైల్‌, వైదేహీ ఎవెన్యూస్‌లను విలీనం చేసుకునేందుకు బోర్డు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చినట్లు మౌలిక సదుపాయాల సంస్థ ఎన్‌సీసీ లిమిటెడ్‌ తాజాగా వెల్లడించింది. స్టాక్‌ యార్డుల అభివృద్ధి, నిర్వహణలను వైదేహీ ఎవెన్యూస్‌ చేపడుతున్నట్లు కంపెనీ పేర్కొంది. ఇదే విధంగా రైల్వే సిగ్నలింగ్‌, కమ్యూనికేషన్‌ పరికరాల డిజైనింగ్‌, తయారీ, ఇనస్టలేషన్‌ తదితర కార్యకలాపాలను యాస్టర్‌ రైల్‌ నిర్వహిస్తున్నట్లు తెలియజేసింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో ఎన్‌సీసీ షేరు 4.6 శాతం జంప్‌చేసి రూ. 55.45 వద్ద ట్రేడవుతోంది. ఇంట్రాడేలో రూ. 55.80 వద్ద గరిష్టాన్నీ, రూ. 53.10 వద్ద కనిష్టాన్నీ చవిచూసింది.



You may be interested

జనవరి సీరిస్‌ కోసం టాప్‌ టెన్‌ సిఫార్సులు

Monday 30th December 2019

కొత్త సంవత్సరం తొలి నెల కోసం ప్రముఖ బ్రోకరేజ్‌లు పది షేర్లను రికమండ్‌ చేస్తున్నాయి. ఐసీఐసీఐ డైరెక్ట్‌ రికమండేషన్లు 1. ఎస్‌బీఐ: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 360. స్టాప్‌లాస్‌ రూ. 324. దీర్ఘకాలిక ఆరోహణ త్రిభుజాకృతి నుంచి బ్రేకవుట్‌ ఇచ్చేందుకు సిద్ధంగా ఉంది. రెండు వారాలుగా గత గ్యాప్‌ ఏరియా రూ. 321-325ను పరీక్షించి బలమైన మద్దతు బేస్‌ ఏర్పరుచుకుంది. త్వరలో గత పతనానికి 123.6 శాతం రిట్రేస్‌మెంట్‌ స్థాయిలకు ర్యాలీ జరిపేందుకు

ఆటో సూచీలో గోల్డెన్‌ క్రాస్‌!

Monday 30th December 2019

బుల్లిష్‌ అంటున్న నిపుణులు  రెండేళ్ల తర్వాత ఆటో సూచీలో బుల్లిష్‌ సంకేతాలు కనిపిస్తున్నాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు. అమ్మకాల్లో రికవరీ ఉంటుందన్న ఆశల నడుమ ఆటో స్టాకులు క్రమంగా పాజిటివ్‌ ధృక్పథంలోకి మారుతున్నాయంటున్నారు. తాజాగా నిఫ్టీ ఆటో సూచీలో గోల్డెన్‌ క్రాస్‌ ఏర్పడడాన్ని ఇందుకు నిదర్శనంగా చెబుతున్నారు. 2016 మే తర్వాత నిఫ్టీ ఆటో సూచీలో గోల్డెన్‌ క్రాస్‌ ఏర్పడడం ఇదే తొలిసారి. స్వల్పకాలిక మూవింగ్‌ యావరేజ్‌ రేఖ దిగువ నుంచి పైకి

Most from this category