News


ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 30 పాయింట్లు డౌన్‌

Tuesday 4th June 2019
Markets_main1559617472.png-26073

ఆసియా మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు అందుతున్న నేపథ్యంలో భారత్‌ మార్కెట్‌ మంగళవారం నెగిటివ్‌గా ప్రారంభమయ్యే సంకేతాల్ని ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ అందిస్తోంది. ఇక్కడి ఎన్‌ఎస్‌ఈలో నిఫ్టీ ఫ్యూచర్‌తో అనుసంధానంగా ట్రేడయ్యే ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ ఈ ఉదయం 8.35 గంటలకు 30  పాయింట్ల నష్టంతో 12,080 పాయింట్ల వద్ద కదులుతోంది. బుధవారం ఇక్కడ నిఫ్టీ జూన్‌ ఫ్యూచర్‌ 12,110  పాయింట్ల వద్ద ముగిసింది.  తాజాగా ఆసియా మార్కెట్లలో  జపాన్‌ నికాయ్‌, సింగపూర్‌ స్రె‍్టయిట్‌ టైమ్స్‌, హాంకాంగ్‌ హాంగ్‌సెంగ్‌, తైవాన్‌ వెయిటెడ్‌  చైనా షాంఘై, కొరియా కోస్పి ఇండెక్స్‌లు  అరశాతం వరకూ నష్టాలతో ట్రేడవుతున్నాయి. గత రాత్రి అమెరికాలో టెక్నాలజీ షేర్లు తీవ్ర అమ్మకాల ఒత్తిడికి లోనుకావడంతో నాస్‌డాక్‌ ఇండెక్స్‌ 2 శాతం పతనమయ్యింది. ఫాంగ్‌ స్టాక్స్‌గా ప్రసిద్ధిచెందిన అల్ఫాబెట్‌ (గూగుల్‌ మాతృసంస్థ) 6 శాతం పతనంకాగా, ఫేస్‌బుక్‌, అమేజాన్‌లు 5 శాతం చొప్పున క్షీణించాయి. సోషల్‌ మీడియా రంగంలో గుత్తాధిపత్య ధోరణిని ప్రదర్శిస్తున్నదన్న ఆరోపణలపై అమెరికా న్యాయశాఖ​..అల్ఫాబెట్‌ వ్యాపారతీరును దర్యాప్తు చేయనున్నదనే వార్తలతో ఈ షేరు అత్యధికంగా పడిపోయింది. ఒక్కరోజే 54 బిలియన్‌ డాలర్ల మార్కెట్‌క్యాప్‌ను కోల్పోయింది. మరోవైపు ఎస్‌ అండ్‌ పీ500 సూచి 7 పాయింట్ల నష్టంతోనూ, డోజోన్స్‌ ఇండస్ట్రియల్‌ ఏవరేజ్‌ 4 పాయింట్ల స్వల్పలాభంతోనూ ముగిసాయి. 



You may be interested

నష్టాల ప్రారంభం

Tuesday 4th June 2019

క్రితం రోజు రికార్డుస్థాయిలో ముగిసిన భారత్‌ సూచీలు ఆసియా మార్కెట్ల ప్రతికూల సంకేతాల ప్రభావంతో మంగళవారం నష్టాలతో మొదలయ్యాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 72 పాయింట్ల నష్టం‍తో 41,196 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 36 పాయింట్ల నష్టంతో 12,053 పాయింట్ల వద్ద ప్రారంభమయ్యాయి. ట్రేడింగ్‌ ప్రారంభంలో డాక్టర్‌ రెడ్డీస్‌లాబ్‌, యూపీఎల్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, షేర్లు 1 శాతం వరకూ లాభపడగా, హెచ్‌సీఎల్‌ టెక్‌, బీపీసీఎల్‌, టీ టెలిఫిల్మ్‌, టీసీఎస్‌, ఇన్ఫోసిస్‌ షేర్లు

స్మాల్‌క్యాప్‌లో ఇవి ఆకర్షణీయం..!

Monday 3rd June 2019

ఇన్వెస్టర్ల పెట్టుబడులను హరించే చౌక ధరలో లభించే స్టాక్స్‌ కంటే, అధిక నాణ్యత కలిగిన స్టాక్స్‌ను ఎంపిక చేసుకోవడం... పెట్టుబడుల వృద్ధిలో కీలకమైన అంశం. ఈ విషయంలో ప్రఖ్యాత ఇన్వెస్టర్‌ వారెన్‌ బఫెట్‌ విధానాన్ని మార్చిన ఇన్వెస్టర్‌ చార్లీ ముంగర్‌. ఆకర్షణీయమైన ధరలో లభించే గొప్ప వ్యాపారం, చౌకగా లభించే చక్కని వ్యాపారం (కంపెనీ) కంటే బలమైనదన్నది చార్లీ ముంగర్‌ సూత్రీకరణ. స్మాల్‌క్యాప్‌ విభాగంలో ఆల్ట్‌మ్యాన్‌ జెడ్‌ స్కోరు 2.99

Most from this category