News


ఆర్‌బీఐ రేట్ల కోత ఎంత?

Wednesday 7th August 2019
Markets_main1565155178.png-27595

రుతుపవనాల లోటు తగ్గుతుండడం, చమురు ధరల పతనం, ద్రవ్యోల్బణ ఆందోళనలు తగ్గుముఖం పట్టడం వలన ఆర్‌బీఐ మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) జరుపుతున్న ద్రవ్య పరపతి విధాన సమావేశంలో స్వల్పకాలిక రుణ రేటు, రెపో రేటును 25-50 బేసిస్ పాయింట్లు (బిపిఎస్‌) తగ్గించవచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల ఎంపీసీ బృందం నిర్ణయం బుధవారం వెలువడనుంది. దేశియ ఆర్థిక మం‍దగమనాన్ని తగ్గించేందుకు వరుసగా నాలుగోసారి రేట్ల కోతకు సిద్ధపడుతుందని విశ్లేషకులు, ఆర్థికవేత్తలు విస్తృతంగా నమ్ముతున్నారు. 
    50 బేసిస్ పాయింట్ల రేటు తగ్గింపు అవసరాన్ని నిపుణులు తెలియజేస్తున్నప్పటికి సెంట్రల్ బ్యాంక్ మాత్రం 25-35 బీపీఎస్ ఉపశమనం మాత్రమే ఇచ్చే అవకాశం ఉంది. గత నెలలో శక్తికాంత్‌ దాస్ ఓ ఇంటర్వ్యూలో ఆర్‌బీఐ 25 బీపీఎస్‌ వరకు తగ్గించడానికి అవకాశం ఉందని తెలిపిన విషయం తెలిసిందే. ఈ రేట్ల తగ్గింపు 35 బీపీఎస్‌గా ఉండవచ్చని బ్యాంక్ ఆఫ్ అమెరికా-మెరిల్ లించ్ అభిప్రాయపడింది. రుతుపవనాల లోటు క్రమంగా తగ్గుంతుడడంతో ద్రవ్యోల్బణ భయాలు తగ్గుముఖం పట్టాయని పేర్కొంది.  ‘యుఎస్ ఫెడ్ జూలై 31 న  రేట్లను తగ్గించడంతో  అంతర్జాతీయంగా కూడా రేట్లు తగ్గింపు వాతవరణం పెరిగింది. అంతేకాకుండా అంతర్జాతీయ అనిశ్చితి వలన చమురు ధరలు పడిపోతున్నాయి. దేశీయ ద్రవ్యోల్బణ కూడా ఆర్‌బీఐ నిర్దేశించుకున్న 2-6 శాతం లక్ష్యంలో ఉంది. ఈ అంశాలన్ని అక్టోబర్‌లో 'బిజీ' సీజన్ ప్రారంభమయ్యే ముందు ఆర్‌బీఐ 35 బేసిస్‌ పాయింట్ల రేట్ల కోత చేసేందుకు అనుకూలంగా ఉన్నాయి’ అని బ్యాంక్ ఆఫ్ అమెరికా-మెరిల్ లించ్ బ్రోకరేజీ తెలిపింది.
   ‘ప్రస్తుత పరిస్థితులలో ఆర్బీఐ 50 బిపిఎస్ రేటు తగ్గింపుకు అనుకూలంగా ఉంటే మంచిది. కానీ గవర్నర్ శక్తికాంత్‌ దాస్‌ ఇటీవలి ఇంటర్వ్యూను గమనిస్తే ఆర్‌బీఐ ఆర్థిక వృద్ధిపైనే ఎక్కువగా దృష్టి సారించిందనే విషయం అర్థమవుతుంది. ప్రస్తుతం ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించే బాధ్యత ఆర్‌బీఐకి వుంది’ అని ఎడెల్విజ్‌ సెక్యూరిటీస్ తెలిపింది. ఈ రోజు జరిగే ఆర్‌బీఐ ద్రవ్యపరపతి విధాన సమావేశంలో 25 బేసిస్‌ పాయింట్ల తగ్గింపు ఉండవచ్చని ఈ బ్రోకరేజి సం‍స్థ అంచనావేసింది.
   ‘దేశ ఆర్థిక వ్యవస్థ దేశియ, అంతర్జాతీయ సమస్యలను ఎదుర్కొంటోంది. దేశంలోని ఎనిమిది ప్రధాన పరిశ్రమల వృద్ధి నాలుగేళ్ల కనిష్టానికి పడిపోయింది. వాహన రంగంలో అమ్మకాలు పడిపోతున్నాయి. పెట్టుబడి కార్యకలాపాల మందగించడం, ప్రపంచ ఆర్థిక మందగమనం వలన ఎగుమతులు దెబ్బతిన్నాయి’ అని సెంట్రమ్ బ్రోకింగ్ తెలిపింది. జులై నెలలో ద్రవ్యోల్బణం 3 శాతంగానే నమోదుయ్యిందని, ఫలితంగా వరుసగా 11 నెలలో ద్రవ్యోల్బణం అదుపులో ఉందని, అందువలన రాబోయే పాలసీలో 50 బిపిఎస్ రేటు తగ్గింపును ఆర్‌బీఐ చేస్తే మంచిదని ఈ బ్రోకరేజి సంస్థ అభిప్రాయపడింది. ఏది ఏమైనా ఆర్‌బీఐ గవర్నర్ ఇటీవల చేసిన వ్యాఖ్యల వలన కేవలం 25 బేసిస్‌ పాయింట్లను మాత్రమే తగ్గించవచ్చని తెలుస్తోందని వివరించింది.You may be interested

గోల్డ్‌ బాండ్‌ స్కీమ్‌ 9వ తేదీతో ముగింపు

Wednesday 7th August 2019

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం సౌర్వభౌమ బంగారం బాండ్ల పథకంలో 2019-20 ఆర్థిక సంవత్సరంలో మూడో విడత పెట్టుబడులకు ద్వారాలు తెరిచింది. గ్రాముకు రూ.3,499గా ధర నిర్ణయించింది. సబ్‌స్క్రిప్షన్‌ ఈ నెల 5న ఆరంభం కాగా, ఈ నెల9వ తేదీన ముగుస్తుంది. ఆగస్టు 14వ తేదీన అర్హులైన వారికి బాండ్లను జారీ చేస్తారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసి, డిజిటల్‌ పద్దతిలో చెల్లింపులు చేసే వారికి గ్రాముకు రూ.50 వరకూ డిస్కౌంట్‌ ఇవ్వాలని

ఐఫోన్‌లో క్రెడిట్‌ కార్డ్‌ సేవలు ఆరంభం

Wednesday 7th August 2019

న్యూయార్క్‌: ఐఫోన్‌ యూజర్లు ‘ఆపిల్ కార్డ్’ సేవలను ఈ మంగళవారం నుంచి వినియోగించుకోవచ్చని టెక్ దిగ్గజం ఆపిల్ ప్రకటించింది. వాలెట్‌ యాప్‌ నుంచి క్రెడిట్‌ కార్డ్‌ కావాలని దరఖాస్తు చేసుకున్నవారికి ఈ సౌకర్యం అందుబాటులోకి రానుందని వెల్లడించింది. గోల్డ్‌మన్‌ శాక్స్‌ భాగస్వామ్యంతో నూతనతరం ఆర్థిక సేవలకు శ్రీకారం చుట్టిన ఈ సంస్థ.. ఆపిల్‌ బ్రాండెడ్‌ క్రెడిట్‌ కార్డ్‌ సేవలను తొలుత అమెరికాలో ప్రారంభించనున్నట్లు వివరించింది. వీలైనన్ని సైన్‌-అప్స్‌ను పెంచడం ద్వారా

Most from this category