News


యస్‌ బ్యాంక్‌కు 100 ఫండ్‌ మేనేజర్లు గుడ్‌బై

Wednesday 24th July 2019
Markets_main1563960519.png-27284

‘గత ఏడాది కాలంలో 100 మ్యూచువల్ ఫండ్ నిర్వాహకులు యస్ బ్యాంక్‌లో తమ వాటాను పూర్తిగా విక్రయించుకున్నారు’ అని మార్నింగ్‌ స్టార్‌ ఇండియా తెలిపింది. జూన్ 2018 లో 227 మ్యూచువల్ ఫండ్ పథకాల పోర్ట్‌ఫోలియోలో యెస్ బ్యాంక్‌ ఉండగా, జూన్ 2019 నాటికి ఈ మ్యూచువల్‌ ఫండ్‌ల సంఖ్య 132 కు పడిపోయిందని వివరించింది. యస్ బ్యాంక్‌ స్టాకు విలువ గణనీయంగా కూడా తగ్గడం ఈ పతనానికి ఒక కారణంగా చెప్పుకోవచ్చు. ఫలితంగా మ్యూచువల్‌ ఫండ్స్‌ యెస్ బ్యాంకులో చేసిన ఇన్వెస్ట్‌మెంట్‌లు జూన్ 2018లో రూ.8,930 కోట్ల ఉండగా, 2019 జూన్‌ నాటికి రూ.1,751 కోట్లకు పడిపోయాయి. 
   గత ఏడాది జూన్‌ త్రైమాసికంతో పోలిస్తే ఈ కంపెనీ నికర లాభం ఈ జూన్‌ త్రైమాసికంలో 91 శాతం తగ్గింది. త్రైమాసిక ఫలితాలు వెలువడిన తర్వాత యస్ బ్యాంక్‌ షేరు విలువ ఐదేళ్ల  కనిష్టానికి పడిపోవడం గమనర్హం. క్యూ1 ఫలితాలు వెలువడిన తర్వాత ఈ కంపెనీ రేటింగ్‌ను చాలా బ్రోకరేజి సంస్థలు తగ్గించడమే కాకుండా టార్గెట్‌ ధరకు 50 శాతం మేర కోత విధించాయి. జెఫ్ఫరీస్‌ ఈ స్టాకు టార్గెట్‌ ధరను రూ.50 నిర్ణయించింది. ఇది ఈ షేరు ప్రస్తుత ధర కన్నా సుమారుగా 50 శాతం తక్కువ కావడం గమనర్హం. ఈ కంపెనీ వాల్యుషన్లు ఆకర్షిణియంగా ఉన్నా సరే  ప్రస్తుతం ఈ స్టాకుకు దూరంగా ఉండడం చాలా మంచిదని నిపుణులు తెలిపారు. ‘బాగా పతనమైన స్టాకులు తక్కువ ధర వద్దే లభిస్తాయి. అంతమాత్రానా వీటిలో ఇన్వెస్ట్‌ చేయడానికి సిద్ధపడకూడదు’ అని సామ్కో సెక్యూరిటీస్ రీసెర్చ్ హెడ్ ఉమేష్ మెహతా అన్నారు.



You may be interested

ఆగస్టు సీరిస్‌ కోసం ఐదు సిఫార్సులు

Wednesday 24th July 2019

సాంక్టమ్‌ వెల్త్‌ రికమండేషన్లు వచ్చే ఆగస్టు సీరిస్‌లో 10- 16 శాతం వరకు రాబడినిచ్చే ఐదు స్టాకులను సాంక్టమ్‌వెల్త్‌ రికమండ్‌ చేస్తోంది. 1. పవర్‌గ్రిడ్‌: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 245. స్టాప్‌లాస్‌ రూ. 199. జూలై 2017లో ఆల్‌టైమ్‌ హైని తాకి వెంటనే వేగంగా రూ. 172 వరకు పతనమైంది. ఆతర్వాత రూ. 172- 205 మధ్య గతేడాది మొత్తం కన్సాలిడేట్‌ అవుతూవచ్చింది. గత జూన్‌లో ఈ కన్సాలిడేషన్‌ నుంచి బ్రేకవుట్‌ సాధించింది.

నష్టాల బాటలో అటో షేర్లు

Wednesday 24th July 2019

ఐదో రోజూ కొనసాగుతున్న మార్కెట్‌ పతనంలో భాగంగా ఆటో షేర్లు బుధవారం నష్టాల బాట పట్టాయి. ఎన్‌ఎస్‌ఈలో అటో షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ అటో ఇండెక్స్‌ నేడు 2శాతం క్షీణించింది. నేడు ఇండెక్స్‌ 7,162.85 వద్ద ట్రేడింగ్‌ ప్రారంభించింది. మార్కెట్‌ ప్రారంభం నుంచి అటో షేర్లలో అమ్మకాలు విరివిరిగా జరగడంతో ఇండెక్స్‌ ఒకదశలో దాదాపు 2శాతం క్షీణించి 7,039.65 వద్ద ఇంట్రాడే కనిష్టానికి పతనమైంది. ఇండెక్స్‌లోని అధిక వెయిటేజీ

Most from this category