News


ఆర్‌కామ్‌ ఆర్‌పీగా డెలాయిట్‌ నానావతి

Saturday 22nd June 2019
Markets_main1561178329.png-26494

 

  • వచ్చే నెల 23 కల్లా రిజల్యూషన్‌ ప్లాన్‌పై నివేదిక 

ముంబై: రిలయన్స్‌ కమ్యూనికేషన్స్‌ కంపెనీ దివాలా ప్రక్రియకు సంబంధించి రిజల్యూషన్‌ ప్రొఫెషనల్‌(ఆర్‌పీ)గా డెలాయిట్‌కు చెందిన అనీశ్‌ నానావతి నియమితులయ్యారు. ఆర్‌కామ్‌, దాని రెండు అనుబంధ సంస్థలు-రిలయన్స్‌ టెలికామ్‌, రిలయన్స్‌ ఇన్‌ఫ్రాటెల్‌ల దివాలా ​ప్రక్రియలకు కూడా ఆర్‌పీగా నానావతిని నేషనల్‌ కంపెనీ లా ట్రైబ్యునల్‌(ఎన్‌సీఎల్‌టీ) నియమించింది.  రిజల్యూషన్‌ ప్లాన్‌కు సంబంధించిన పురోగతి నివేదికను వచ్చేనెల 23 కల్లా సమర్పించాల్సిందిగా ఆర్‌పీని ఎన్‌సీఎల్‌టీ ఆదేశించింది. కాగా రిలయన్స్‌ ఇన్‌ఫ్రాటెల్‌ విషయమై రుణదాతల నిర్ణయంపై స్టే ఇవ్వాలంటూ గత నెల మే 30 దోహా బ్యాంక్‌ ఎన్‌సీఎల్‌టీని ఆశ్రయించింది. ఈ విషయమై వచ్చే నెల 28న విచారణ జరగనున్నది. రిలయన్స్‌ ఇన్‌ఫ్రాటెల్‌ నుంచి తమకు రూ.1,400 కోట్ల బకాయిలు రావలసి ఉందని దోహా బ్యాంక్‌ అంటోంది. 

ఆర్‌కామ్‌, దాని అనుబంధ సంస్థలు ఆర్థిక సంస్థలకు చెల్లించాల్సిన బకాయిలు రూ.57,382 కోట్లని ఆర్‌కామ్‌ తన పిటీషన్‌లో పేర్కొంది. చైనా బ్యాంక్‌లకు రూ.14,775 కోట్లు చెల్లించాల్సి ఉంది. చైనా బ్యాంక్‌ల బకాయిలను కూడా కలుపుకొని ఈ కంపెనీ మొత్తం 53 బ్యాంక్‌లకు రూ.47,000 కోట్లు బకాయిలు చెల్లించాల్సి ఉంది. గ్రూప్‌ కంపెనీలకు చెల్లించాల్సిన బకాయిలు రూ.7,000 కోట్లుగా ఉన్నాయి. 



You may be interested

ఫ్లాట్‌గా ముగిసిన ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ

Saturday 22nd June 2019

విదేశాల్లో ట్రేడయ్యే ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ ఇండెక్స్‌ శుక్రవారం ఫ్లాట్‌గా ముగిసింది. సింగపూర్‌లో  నిన్నరాత్రి 3పాయింట్ల స్వల్ప లాభంతో 11,757.00 వద్ద స్థిరపడింది. మధ్యప్రాచ్య దేశంలో చెలరేగిన యుద్ధ ఉద్రికత్తలు, ముడిచమురు ధరల అనూహ్య పెరుగుదలతో మార్కెట్‌ ఈ వారంతపు రోజైన శుక్రవారం‍ నష్టాలతో ముగిసింది. సెన్సెక్స్‌ 407 పాయింట్లు నష్టంతో 39,194 వద్ద, నిఫ్టీ 107 పాయింట్లను కోల్పోయి 11724 వద్ద స్ధిరపడ్డాయి. ట్రేడ్‌వార్‌ యుద్ధం, రూపాయి బలహీనత, రుతుపవనాల

మారుతీ సుజుకీ వాహనాలకు బీఓబీ ఫైనాన్స్‌

Saturday 22nd June 2019

ఇరు సంస్థల మధ్య ఒప్పందం పూర్తి న్యూఢిల్లీ: డీలర్ ఇన్వెంటరీ, కస్టమర్ ఆటో రుణ ఫైనాన్స్‌ సేవలను పొందడం కోసం బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు దేశీయ వాహన తయారీ దిగ్గజం మారుతీ సుజుకీ ఇండియా (ఎంఎస్‌ఐ) శుక్రవారం ప్రకటించింది. తాజా భాగస్వామ్యంతో బీఓబీ తమ సంస్థకు ప్రాధాన్య ఫైనాన్షియర్ హోదాని పొందిందని వివరించింది. ఈ సందర్భంగా ఎంఎస్‌ఐ ఎగ్జిక్యూటీవ్‌ డైరెక్టర్‌ (మార్కెటింగ్, సేల్స్‌) శశాంక్‌ శ్రీవాస్తవ మాట్లాడుతూ.. ‘ప్రభుత్వ

Most from this category