News


ఐపీఓకు ఎన్‌సీడీఈఎక్స్‌

Wednesday 12th February 2020
Markets_main1581485981.png-31718

  • రూ.500 కోట్ల నిధుల సమీకరణ
  • సెబీకి ముసాయిదా పత్రాల సమర్పణ

ఇండియాలో అతిపెద్ద అగ్రి డెరివేటివ్స్‌ ఎక్చ్సేంజ్‌  నేషనల్‌ కమోడిటీ డెరివేటివ్స్‌ ఎక్చ్సేంజ్‌ ఐపీఓకు సిద్ధమైంది. ఈ మేరకు మంగళవారం మార్కెట్‌ నియంత్రణ సంస్థ సెబీకి ముసాయిదా పత్రాలు సమర్పించింది. ఈ ఐపీఓ మొత్తం రూ.500 కోట్లను సమీకరించనుంది. ఐపీఓలో భాగంగా ఎగ్జిస్టింగ్‌​ఇన్వెస్టర్లు కొంత వాటాను విక్రయించడంతో పాటు రూ.100 కోట్ల విలువైన తాజా ఈక్విటీ షేర్లను జారీ చేయనుంది. సమీకరించిన నిధులను కోర్ సెటిల్మెంట్ గ్యారెంటీ ఫండ్‌,  ఎన్‌సీసీఎల్‌ నికర విలువ అవసరాలకు వినియోగిస్తున్నట్లు ఎక్చ్సేంజ్‌ తెలిపింది. ఎన్‌సీడీఈక్స్‌లో ఎన్‌ఎస్‌ఈ 15శాతం వాటాను, ఎల్‌ఐసీ, నాబార్డ్‌ సంస్థలు 11శాతం వాటాను కలిగి ఉన్నాయి. వాటితో పాటు ఇండియన్‌ ఫార్మర్‌ ఫెర్టిలైజర్‌ కార్పోరేటింగ్‌, ఓమెన్‌ ఇండియా జాయింట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఫండ్‌ 10శాతం, కెనరా బ్యాంక్‌ 7శాతం, ఐడీఎఫ్‌సీ ప్రైవేట్‌ ఈక్విటీ ఫండ్‌ 6శాతం వాటాను కలిగి ఉన్నాయి. 



You may be interested

కరోనా ప్రభావాన్ని అతిగా ఊహించారు!

Wednesday 12th February 2020

రే డాలియో అభిప్రాయం ప్రపంచ మార్కెట్లపై కరోనా వైరస్‌ ప్రభావాన్ని ఎక్కువ చేసి చూపారని ప్రముఖ ఫండ్‌ మేనేజర్‌ రే డాలియో అభిప్రాయపడ్డారు. ఈ భయాలు ఎక్కువ కాలం నిలిచేవి కావన్నారు. ఏదైనా అంటువ్యాధి ప్రబలినప్పుడు అందరిలో తలెత్తే సాధారణ భయాలే మార్కెట్‌ ఇన్వెస్టర్లలో కూడా కలిగాయని, కాకపోతే మార్కెట్లు ఈ భయాన్ని కాస్త ఎక్కువగా స్వీకరించాయని చెప్పారు. ఇకపై సూచీల్లో రీబౌండ్‌ ఉంటుందని అంచనా వేశారు. బ్రిడ్జ్‌వాటర్‌ అసోసియేట్స్‌కు వ్యవస్థాపకుడైన

అప్‌ఫ్రంట్‌ మార్జిన్‌ ప్లాన్‌ రద్దు యోచనలో సెబీ?!

Wednesday 12th February 2020

బ్రోకింగ్‌ సంస్థల బిజినెస్‌లో ఇంట్రాడే లావాదేవీల వాటా 50 శాతం  రోజువారీ లేదా డెరివేటివ్‌ విభాగంలో లావాదేవీల నిర్వహణకు ట్రేడర్లు చెల్లించవలసిన అప్‌ఫ్రంట్‌ మార్జిన్‌(ముందస్తు చెల్లింపు) ప్రణాళిక రద్దయ్యే అవకాశమున్నట్లు వార్తలు వెలువడ్డాయి. దేశీ కేపిటల్‌ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీతోసాటు స్టాక్‌ ఎక్స్ఛేంజీలు ఈ అంశాన్ని సానుకూల థృక్పథంతో పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. సాధారణంగా బ్రోకింగ్‌ సంస్థల బిజినెస్‌లో 50-70 శాతం వరకూ ఇంట్రాడే లావాదేవీల నుంచే నమోదవుతూ ఉంటుందని సంబంధిత

Most from this category