News


మిడ్‌క్యాప్‌ ఎన్‌బీఎఫ్‌సీలవైపు చూపు

Tuesday 31st December 2019
Markets_main1577776710.png-30559

ఇప్పటికే ఎన్‌బీఎఫ్‌సీ విభాగంలో భారీ కరెక్షన్‌
ఎల్‌అండ్‌టీ ఫైనాన్స్‌ తదితరాలు ఆకర్షణీయం
హేమంగ్‌ జాని, సీనియర్‌ వైస్‌ప్రెసిడెంట్‌, షేర్‌ఖాన్‌

2019 ముగింపు దశకు చేరుకున్న ప్రస్తుత పరిస్థితుల్లో వచ్చే ఏడాది(2020) వెలుగులో నిలవగల కౌంటర్లవైపు మార్కెట్‌ దృష్టి పెట్టనున్నట్లు బ్రోకింగ్‌ సంస్థ షేర్‌ఖాన్‌, సీనియర్‌ వైస్‌ప్రెసిడెంట్‌ హేమంగ్‌ జాని చెబుతున్నారు. ఇటీవల వృద్ధి బాటలో సాగుతున్న స్టాక్స్‌కు ఇన్వెస్టర్లు ప్రాధాన్యత ఇచ్చే వీలున్నట్లు తెలియజేశారు. ఒక ఆంగ్ల చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇంకా పలు అంశాలను ప్రస్తావించారు. వివరాలు చూద్దాం..

2019లో నిఫ్టీ 13 శాతం పుంజుకున్నప్పటికీ ఏడాది పొడవునా మిడ్‌, స్మాల్‌ క్యాప్స్‌ వెనకడుగులోనే గడిపాయి. కొన్ని హెవీవెయిట్స్‌ మాత్రమే ర్యాలీకి దోహదం చేశాయి. కొత్త ఏడాది(2020) తొలి మూడు నెలల్లోనూ జీడీపీ పురోగతి లేదా కంపెనీల పనితీరు వంటి అంశాలలో పెద్దగా మార్పులు చోటుచేసుకోకపోవచ్చు. అయితే ఇకపై వృద్ధి బాటపట్టే పరిస్థితులను ప్రతిబింబిస్తున్న కంపెనీలలో ఇన్వెస్టర్లు పెట్టుబడులకు ప్రాధాన్యం ఇచ్చే వీలుంది. ఆర్థిక వ్యవస్థలో రికవరీ కనిపిస్తే.. రిస్క్‌కు తట్టుకోగల పెట్టుబడులు పెరిగే అవకాశముంటుంది. దీంతో ర్యాలీ మిడ్‌, స్మాల్‌ క్యాప్‌ కౌంటర్లకూ పాకవచ్చు.

బ్లూచిప్స్‌లోనూ
ఈ ఏడాది నాన్‌బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌(ఎన్‌బీఎఫ్‌సీ) విభాగంలో ఎదురైన అత్యంత విపత్కర పరిస్థితులను చాలావరకూ దాటుకుని వచ్చేశాం. ఈ ప్రభావంతో కొన్ని కంపెనీలు భారీగా దిద్దుబాటు(కరెక్షన్‌)ను చవిచూశాయి కూడా. వెరసి ఈ విభాగంలో కొన్ని ఎంపిక చేసిన కౌంటర్లు పుంజుకునే అవకాశముంది. ఉదాహరణకు ఎల్‌అండ్‌టీ ఫైనాన్స్‌ను ప్రస్తావించవచ్చు. ఇదే విధంగా మరికొన్ని చిన్నతరహా బ్యాంక్‌ కౌంటర్లనూ పరిశీలించవచ్చు. వీటి ఎంపికలో నాణ్యతకు పెద్దపీట వేయవలసి ఉంటుంది. ఇక మరోవైపు వృద్ధి బాటలో సాగుతున్న హెచ్‌డీఎఫ్‌సీ, బజాజ్‌ ఫైనాన్స్‌ వంటి బ్లూచిప్స్‌వైపు సైతం దృష్టి సారించవచ్చు. 

బీపీసీఎల్‌ కథేంటి?
ఇంధన రంగ పీఎస్‌యూ దిగ్గజం భారత్‌ పెట్రోలియం కార్పొరేషన్‌(బీపీసీఎల్‌)లో ప్రభుత్వం డిజిన్వెస్ట్‌మెంట్‌ చేపట్టనున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. కంపెనీలో 30 శాతం వాటాను ప్రభుత్వం విక్రయించనున్నట్లు తెలుస్తోంది. డిజిన్వెస్ట్‌మెంట్‌ ప్రాసెస్‌ సాధారణంగా ఆలస్యమవుతుంటుంది. డిజిన్వెస్ట్‌మెంట్‌ ప్రక్రియ ఒక కొలిక్కివస్తే.. దీనికితోడు ఏదైనా గ్లోబల్‌ దిగ్గజం కంపెనీలో వాటా కొనుగోలుకి ఆసక్తి ప్రదర్శిస్తే.. బీపీసీఎల్‌కు అధిక విలువ చేకూరే వీలుంది. ఎలాంటి విలువ లభిస్తుందన్న అంశం​ కొద్ది నెలల్లో వెల్లడికావచ్చు. కేవలం దేశీ కంపెనీలేకాకుండా.. విదేశీ ఇంధన రంగ దిగ్గజాలు ఆసక్తి చూపితే బీపీసీఎల్‌కు డిమాండ్‌ మరింత పెరిగే అవకాశముంది!



You may be interested

వచ్చే ఏడాదిలో రూ.50వేల కోట్ల ఐపీఓలు

Tuesday 31st December 2019

వచ్చే ఏడాదిలో భారతీయ కంపెనీలు ఐపీఓ ద్వారా రూ.50వేల కోట్ల నిధుల సమీకరణ సిద్ధమైనట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఈ ఏడాది(2019)లో 16 కంపెనీలు సమీకరించిన రూ.12,362 కోట్లతో పోలిస్తే ఈ మొత్తం(రూ.50వేల కోట్లు) విలువ నాలుగు రెట్లు అధికంగా ఉంది. వచ్చే ఏడాది ప్రథమార్థంలో ఎస్‌బీఐ కార్డు అండ్‌ పేమెంట్‌(రూ.9వేల నుంచి 10వేల కోట్లు), యూటీఐ అసెట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీ(రూ.3,5000 నుంచి రూ.4,000), హోమ్‌ ఫస్ట్‌ ఫైనాన్స్‌ (రూ.1500 కోట్లు),

నిర్మలా ఏం చెబుతారో...

Tuesday 31st December 2019

సంవత్సరం చివరి రోజు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ విలేకరుల సమావేశం నిర్వహించనున్నారు. మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు ఈ సమావేశం జరుగుతుందని ఆర్థిక మంత్రిత్వ శాఖ వర్గాలు తెలిపాయి. ప్రస్తుత స్థితిలో ఆర్థిక మంత్రి ఏవిషయమై ఈ సమావేశం నిర్వహిస్తున్నారోనని సర్వత్రా ఆసక్తి నెలకొంది. మొత్తంమీద ఆర్థిక వ్యవస్థలో పునరుజ్జీవానికి సంబంధించిన చర్యలనే మంత్రి ప్రకటించే అవకాశాలున్నాయని నిపుణులు భావిస్తున్నారు. ముఖ్యంగా రూ. 100 లక్షల కోట్ల జాతీయ

Most from this category